Telangana: తెలంగాణ పొలిటికల్ ఫైర్ బ్రాండ్.. మాటలు తూటాలే.. ఈయనెవరో గుర్తుపట్టారా?
పైన పేర్కొన్న ఫోటోలోని వ్యక్తి ఓ రాజకీయ నాయకుడు. పొలిటికల్ ఫైర్ బ్రాండ్.. తెలంగాణకు చెందిన ఈ నేత స్టైలే వేరు..
పైన పేర్కొన్న ఫోటోలోని వ్యక్తి ఓ రాజకీయ నాయకుడు. పొలిటికల్ ఫైర్ బ్రాండ్.. తెలంగాణకు చెందిన ఈ నేత స్టైలే వేరు.. మాటలు తూటాల్లా పేల్తాయి. ఎప్పుడూ గుబురు గడ్డం, పొడవాటి మీసంతో కనిపించే ఈ కాంగ్రెస్ నేత.. ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయారు. క్లీన్ షేవ్‌తో దర్శనమిచ్చారు. దీంతో ఆయన్ని గుర్తుపట్టడం ఇప్పుడు అందరికీ కష్టమైపోయింది. ఇప్పటికైనా ఆయనెవరో మీకు తెలిసిందా.?
Guessssss???? pic.twitter.com/5WLUNjC6C7
— HEMA NIDADHANA (@Hema_Journo) November 11, 2022
తిరుమల వెంకన్న భక్తుడైన ఆ కాంగ్రెస్ నేత మరెవరో కాదు.. సంగారెడ్డి ఎమ్మెల్యే జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి. ఇటీవల జగ్గారెడ్డి సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించుకుని మొక్కు తీర్చుకున్నారు. గడ్డం, మీసం లేకపోవడంతో జగ్గారెడ్డిని గుర్తుపట్టలేకపోతున్నారు కొందరు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.