PM Modi: టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ.. బీజేపీ ప్రచారం హోరెత్తాల్సిందే..
మరోసారి ఛలో తెలంగాణ అంటున్నారు బీజేపీ అగ్ర నేతలు. తమ పర్యటనలతో తెలుగు రాష్ట్రాల్లో ప్రచార పర్వాన్ని మరింత వేడెక్కించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాల రాకతో క్లైమాక్స్‌లో కాక పుట్టనుంది. ఇప్పటికే.. తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. టార్గెట్ తెలంగాణ అంటూ డబుల్ డిజిట్ సీట్ల కోసం వ్యూహం ప్రారంభించింది.
మరోసారి ఛలో తెలంగాణ అంటున్నారు బీజేపీ అగ్ర నేతలు. తమ పర్యటనలతో తెలుగు రాష్ట్రాల్లో ప్రచార పర్వాన్ని మరింత వేడెక్కించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాల రాకతో క్లైమాక్స్‌లో కాక పుట్టనుంది. ఇప్పటికే.. తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. టార్గెట్ తెలంగాణ అంటూ డబుల్ డిజిట్ సీట్ల కోసం వ్యూహం ప్రారంభించింది. ప్రధాని మోదీ కూడా తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల సమరాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు తెలంగాణలో ప్రచారానికి వచ్చిన మోదీ…మరోసారి తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టబోతున్నారు. ఈ నెల 8, 10వ తేదీల్లో తెలంగాణలో సుడిగాలి పర్యటనలతో మోదీ చుట్టెయ్యనున్నారు. ఈనెల 8న వేములవాడ, ఆ తర్వాత వరంగల్ జిల్లా మడికొండ బహిరంగ సభల్లో మోదీ పాల్గొంటారు. ఇక ఈ నెల 10న నారాయణపేట, హైదరాబాద్‌లో జరిగే సభలో మోదీ పాల్గొంటారు.
తెలంగాణతో పాటు ఏపీపై కూడా ఫోకస్ పెడుతున్నారు ప్రధాని మోదీ. ఈ నెల 8న విజయవాడకు వెళ్లనున్న మోదీ.. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. మోదీ రాక నేపథ్యంలో భారీ స్వాగత ఏర్పాట్లుకు సన్నద్ధమవుతోంది ఏపీ బీజేపీ. అయితే 6వ తేదీన కూడా ఏపీలో మోదీ పర్యటిస్తారా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక మోదీతో.. రాజమండ్రి ,అనకాపల్లి, రాజంపేట, తిరుపతి లో భారీ బహిరంగ సభలకు ఏపీ బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఏపీలో మోదీ పర్యటన కోసం.. కూటమి నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఈ నెల 5న తెలంగాణకు రానున్నారు. ఆదిలాబాద్ ఎంపీ స్థానం పరిధిలోని సిర్పూర్ కాగజ్‌నగర్‌లో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత నిజామాబాద్, మల్కాజ్‌గిరి సభల్లో పాల్గొంటారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఈ నెల 6న పెద్దపల్లి, భువనగిరి, నల్లగొండ సభల్లో పాల్గొంటారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..