Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cherlapally Railway Terminal: చర్లపల్లి టెర్మినల్ ఓపెనింగ్ కు సర్వం సిద్దం.. ఇకపై ఆ రైళ్లు ఇక్కడి నుంచే..

వెల్ కం టు చర్లపల్లి రైల్వే స్టేషన్...యస్..చర్లపల్లి రైల్వే టెర్మినల్ సిద్ధమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం (జనవరి 6 వ తేదీన) వర్చువల్ గా ప్రారంభించనున్నారు. దాదాపు వంద ఏళ్ళ తరవాత భాగ్యనగరం లో మరో రైల్వేస్టేషన్ అందుబాటులోకి వచ్చింది.

Cherlapally Railway Terminal: చర్లపల్లి టెర్మినల్ ఓపెనింగ్ కు సర్వం సిద్దం.. ఇకపై ఆ రైళ్లు ఇక్కడి నుంచే..
Cherlapally Railway Terminal
Follow us
Yellender Reddy Ramasagram

| Edited By: Basha Shek

Updated on: Jan 04, 2025 | 6:56 PM

అన్ని పనులు పూర్తి చేసుకొనీ ప్రజలకి ఆదుబాటులోకి వచ్చేందుకు సిద్దం అయింది చర్లపల్లి రైల్వే స్టేషన్.జంట నగరలో రైళ్లు ప్రధానంగా మూడు ప్రధాన టెర్మినల్స్ అయిన సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు కాచిగూడ ద్వారా సేవలు అందిస్తున్నాయి. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్నరద్దీ,అవసరాలను తీర్చడానికి,సిటీ శివారు లో చర్లపల్లి రైల్వేస్టేషన్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు రైల్వే అధికారులు. 430 కోట్ల రూపాయల తో విశాలంగా, ఆధునిక మౌలిక సదుపాయాలతో ఏర్పాటు చేశారు.పూర్తి గా ఎయిర్ పోర్ట్ తరాల లుక్ తో ఈ సోమవారం నుండి ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతుంది కొత్త టెర్మినల్.

చర్లపల్లి టెర్మినల్‌ ప్రారంభమైతే సుమారు 50 వేల మంది ప్రయాణికులకు ట్రాఫిక్ భారం తగ్గనుంది. గంటల తరబడి ట్రాఫిక్ సమస్య నుంచి వారికి విముక్తి కలుగుతుంది. చర్లపల్లి లో ఇప్పుడు 25 జతల రైళ్లు ఆగుతుండగా.. ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే ప్రతి రోజూ 50 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. దీంతో వేగంగా గమ్య స్థానాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. డిల్లి,మద్రాస్, కొలకత్తా,వైజాగ్ వైపు వెల్లె ట్రైన్ లు చర్ల పల్లి నుండి నడవనున్నాయి.ఇక ఈ కొత్త టెర్మినల్ రాక తో సికింద్రబాద్,నాంపల్లి,కాచిగూడ స్టేషన్ ల పై ఒత్తిడి తగ్గనుంది. ప్రస్తుతం ఇక్కడ 2 ఎంఎంటీఎస్‌ ప్లాట్‌ఫాంలతో కలిపి మెుత్తం 9 ప్లాట్‌ఫాంలు, 6 ఎస్కలేటర్లు, 2 ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు ఏర్పాటు చేశారు. అలాగే ప్రయాణికుల కోసం వెయిటింగ్ ఏసీ, నాన్‌ ఏసీ హాల్స్, ఫుడ్‌ కోర్టులు, రెస్టారెంట్లు, రిజర్వేషన్‌ కౌంటర్లు, టికెట్‌ కౌంటర్లు వంటివి సిద్ధం చేశారు. ఇది ప్రారంభమైతే హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లపై ప్రయాణికుల భారం తగ్గనుంది.

ఇవి కూడా చదవండి

ప్రధాని మోడీ చేతుల మీదుగా..

కాగా ప్రధానిమోడీ వర్చువల్ గా ఈ చర్లపల్లి రైల్వే టర్మినల్ ను ప్రారంభిస్తారు. ఇదే సమయంలో  చర్లపల్లిలో జరిగే ప్రారంభోత్సవంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొంటారు.

చర్లపల్లి రైల్వే టర్మినల్ ఫొటోస్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి