Vande Bharat: నేటి నుంచి అందుబాటులోకి సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ట్రైన్.. వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని..
ఈరోజు(ఆదివారం) నుంచి వందే భారత్ రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఉదయం పదిన్నర గంటలకు ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభిచంనున్నారు.

ఈరోజు(ఆదివారం) నుంచి వందే భారత్ రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఉదయం పదిన్నర గంటలకు ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభిచంనున్నారు. అంతేకాదు టికెట్ ధరలు సైతం వెల్లడించింది రైల్వేశాఖ. వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘ఆదివారం నాడు ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సర్వీస్‌ను వర్చువల్‌గా ప్రారంభించడం జరుగుతుంది. ఇది కనెక్టివిటీని పెంచడంతో పాటు, ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇస్తుంది’ అని ప్రధాని పేర్కొన్నారు.
మరోవైపు వందే భారత్ రైలు ప్రారంభోత్సవాన్ని అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్, రైల్వే శాఖ ఉన్నతాధికారులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.




బుకింగ్స్ ప్రారంభం..
తెలుగు రాష్ట్రాల మధ్య అందుబాటులోకి రాబోయే వందే భారత్ ట్రైన్‌కు సంబంధించి ఛార్జీల వివరాలు వెల్లడయ్యాయి, ఇప్పటికే రైల్వేశాఖ ఈ రైలు బుకింగ్స్‌ను ప్రారంభించింది. జనవరి 16 నుంచి ప్రయాణానికి ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ ఛైర్‌కార్ పేరుతో 2 క్లాస్‌లు ఈ రైల్లో అందుబాటులో ఉన్నాయి. విశాఖ నుంచి సికింద్రాబాద్ వచ్చే రైలుకు 20833, సికింద్రాబాద్- విశాఖ రైలుకు 20834 నంబర్‌ను కేటాయించారు.
టికెట్ ధరలు ఇవి..
విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు ఛైర్‌కార్ టికెట్ ధర రూ.1,720, ఎగ్జిక్యూటివ్ ఛైర్‌కార్ టికెట్ ధరను రూ.3,170గా నిర్ణయించారు. సికింద్రాబాద్ నుంచి బయల్దేరి వెళ్లే రైల్లో ఛైర్ కార్ టికెట్ ధర రూ.1665, ఎగ్జిక్యూటివ్ క్లాస్ రూ.3,120గా నిర్ణయించారు.
రైల్వే శాఖ మంత్రితో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..
Along with the Hon’ble Union Minister for @RailMinIndia Sh @AshwiniVaishnaw, inspected the arrangements at the Secunderabad Railway Station, ahead of the launch of the Vande Bharat tomorrow, by the Hon’ble Prime Minister Sh @NarendraModi, through VC. pic.twitter.com/zBL7EB94jF
— G Kishan Reddy (@kishanreddybjp) January 14, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
