Hyderabad: పెంపుడు కుక్క దాడిలో గాయపడ్డ డెలివరీ బాయ్‌ మృతి.. యజమానిపై కేసు ఫైల్ చేసిన పోలీసులు..

Hyderabad: పాపం ఇల్లిల్లూ తిరిగి డెలివరీ చేసుకునే డెలివరీ బాయ్. స్విగ్గీ డెలివరీ బాయ్. ఏ అపార్ట్ మెంట్‌లో ఏ ప్రమాదం పొంచి ఉంటుందో.. ఏ ఇంట్లో ఏ డేంజరస్ డాగ్ దాగి ఉంటుందో తెలీదు.

Hyderabad: పెంపుడు కుక్క దాడిలో గాయపడ్డ డెలివరీ బాయ్‌ మృతి.. యజమానిపై కేసు ఫైల్ చేసిన పోలీసులు..
Food Delivery Boy Died
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 15, 2023 | 8:15 AM

పాపం ఇల్లిల్లూ తిరిగి డెలివరీ చేసుకునే డెలివరీ బాయ్. స్విగ్గీ డెలివరీ బాయ్. ఏ అపార్ట్ మెంట్‌లో ఏ ప్రమాదం పొంచి ఉంటుందో.. ఏ ఇంట్లో ఏ డేంజరస్ డాగ్ దాగి ఉంటుందో తెలీదు. అయినా సరే ప్రాణాలకు తెగించి మరీ.. అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా డెలివరీ ఇస్తుంటారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో స్విగ్గీ డెలివరీస్ చేసే రిజ్వాన్ కూడా సరిగ్గా ఇలాంటి డేంజరస్ పొజిషన్లో డెలివరీలు ఇస్తుంటాడు. ఇప్పటికే రోడ్డు ప్రమాదాల గండం ఇలాంటి డెలివరీ బాయిస్ కి ఎప్పుడూ పొంచి ఉంటుంది. తాజాగా.. మరో గండాన్ని ఫేస్ చేశాడు రిజ్వాన్. దాని పేరే జర్మన్ షెపర్డ్.

నాలుగు రోజుల క్రితం.. రిజ్వాన్ బంజారాహిల్స్ లోని లుంబినీ రాక్ కేజిల్ అపార్ట్ మెంట్స్ కి ఇలాగే డెలివరీకి వెళ్లాడు. అతడికి తెలీదు అక్కడ తన ప్రాణాలను హరించి వేసేంత శక్తిగల సింబా అనే జర్మన్ షెపర్డ్ డాగ్ ఉందని. ఎప్పటి లాగానే అపార్ట్ మెంట్ కి డెలివరీకి వెళ్లాడు. అక్కడ ఎదురైంది సింబా. ఒక్కసారిగా అటాక్ చేసింది. ఆ దాడి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్ధం కాని రిజ్వాన్.. గత్యంతరం లేని పరిస్థితుల్లో మూడో అంతస్తు నుంచి కింద పడ్డాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు.. డాగ్ ఓనర్ శోభనపై కేసు బుక్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు.

గాయపడ్డ రిజ్వాన్ ను నిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. నాలుగు రోజులుగా కోమాలో ఉన్న రిజ్వాన్ నిన్న చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఒక్కసారిగా షాకయ్యారు. ఇతరుల ఆకలి తీర్చే తమకిలాంటి ప్రాణాపాయ పరిస్థితులా? మేమేం నేరం చేశాం? మాకే ఎందుకీ శిక్ష? మేమేం తప్పు చేశామనీ.. అప్పటికీ కస్టమర్లకు టైంకి ఫుడ్ సప్లై చేయడానికి ఎన్నో యాక్సిడెంట్లను తప్పించుకుంటూ వస్తామే? అందుకిదేనా బహుమతి.. వారి ఆవేదన వర్ణనాతీతం.

ఇవి కూడా చదవండి

ఇంతకీ రిజ్వాన్ ప్రాణం పోవడానికి కారకులెవరు? అసలా అపార్ట్‌మెంట్‌లో డాగ్స్ ను అలౌ చేసిందెవరు? అపార్ట్‌మెంట్లలో ఇలాంటి ప్రమాదకరమైన కుక్కలను ఉంచుకోవచ్చా? ఒక వ్యక్తి కుక్కను ఎదర్కోవడం కన్నా మూడంతస్తుల మీద నుంచి దూకేయడం సేఫ్ గా అనుకున్నాడంటే.. అదెంత డేంజరస్ డాగ్ అయి ఉంటుంది? మధ్యప్రదేశ్ సాగర్ లో డాగ్ ట్యాక్స్ విధిస్తుంటారు. మరి ఇక్కడ జీహెచ్ఎంసీ ఎలాంటి చట్టాలను విధిస్తున్నారు? ఎలాంటి యానిమల్ యాక్ట్ అందుబాటులో ఉంది? ఇంతకీ ఈ జర్మన్ షెపర్డ్ కు లైసెన్స్ ఉందా? ఎప్పటికప్పుడు డాక్టర్లకు చూపిస్తున్నారా? అదంత ఫెరోషియస్ గా ఎందుకుంది?

ఇపుడీ ప్రాణం ఎవరి ఖాతాలో? ఇలాంటి కుక్కని పెంచిన ఓనర్ ని అనాలా? అపార్ట్ మెంట్లో కుక్కను అలౌ చేసిన అపార్ట్ మెంట్ నిర్వాహకులను ప్రశ్నించాలా? అన్న ప్రశ్నకు సమాధానమేంటి? పోలీసులేమో.. కుక్క ఓనర్ పై కేసు పెట్టారు. మరి రిజ్వాన్ కుటుంబం పరిస్థితేంటి? అతడిపై ఆధారపడి బతుకుతున్న కుటుంబ జీవనోపాధిని ఎవరిస్తారు? ఈ మరణానికి ఎలాంటి పరిహారం ఇవ్వాలి? ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయని తెలిసిన స్విగ్గీ వీరిపై ఇన్ స్యూరెన్సులు చేయిస్తున్నారా? లేదా? ఇలాంటి ఎన్నో క్వశ్చిన్స్ కి ఆన్సర్ తెలియాల్సి ఉంది.

నిజానికి జర్మన్ షెపర్డ్ జాతి.. రెస్క్యూ ఆపరేషన్లలో ముందుంటాయి. ఓనర్ కి ఎంతో ఒబిడియంట్ గా ఉంటాయి. అలాంటి కుక్క ఇంత డేంజరస్ గా మారిందంటే ఇదెవరి తప్పు? దాన్నిలా తీర్చిదిద్దిన యజమానికి ఎలాంటి శిక్ష విధించాలి? ఇప్పుడిదే ఆ అపార్ట్ మెంట్లో అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. మరి చూడాలి.. రిజ్వాన్ కుటుంబానికి పోలీసులు ఎలాంటి న్యాయం చేస్తారో? అపార్ట్ మెంట్లలో ఇలాంటి డేంజరస్ డాగ్స్ పట్ల వారి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందో తెలియాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్  క్లిక్ చేయండి..