Telangana: తెలంగాణ నుంచే మోడీ, సోనియా.. ఆ స్థానాల్లో పోటీకి నిలిపేలా బీజేపీ, కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు

జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు.. బీఆర్‌ఎస్‌ను సైడ్‌ చేసేసి, బస్తీమే సవాల్‌ అనుకుంటున్నాయి. దేనికదే ఖతర్నాక్‌ ప్లాన్‌తో ముందుకొస్తున్నాయి. ఎంపీ ఎలక్షన్స్‌లో ఇద్దరు అగ్రనేతల్ని ఈసారి రాష్ట్రంనుంచి బరిలో నిలిపేలా వ్యూహరచన చేస్తున్నాయి.

Telangana: తెలంగాణ నుంచే మోడీ, సోనియా.. ఆ స్థానాల్లో పోటీకి నిలిపేలా బీజేపీ, కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు
PM Modi, Sonia Gandhi
Follow us
Basha Shek

|

Updated on: Dec 18, 2023 | 9:29 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత… రాష్ట్రంలో పొలిటికల్‌ సీన్‌ మారిపోయిందా? బలంగా ఉన్న బీఆర్‌ఎస్‌ను కాదని… కాంగ్రెస్‌, బీజేపీలు నువ్వా? నేనా? అంటూ తలపడబోతున్నాయా? నయానయా స్కెచ్చులతో ఈ రెండు నేషనల్‌ పార్టీస్‌ దూసుకొస్తుండటం చూస్తే.. అది నిజమే అనిపిస్తోంది. గత పదేళ్లుగా తెలంగాణలో గులాబీ గుబాళిస్తే… ఇప్పుడు ఒక్కసారిగా సీన్‌ రివర్స్‌ అయ్యింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు.. బీఆర్‌ఎస్‌ను సైడ్‌ చేసేసి, బస్తీమే సవాల్‌ అనుకుంటున్నాయి. దేనికదే ఖతర్నాక్‌ ప్లాన్‌తో ముందుకొస్తున్నాయి. ఎంపీ ఎలక్షన్స్‌లో ఇద్దరు అగ్రనేతల్ని ఈసారి రాష్ట్రంనుంచి బరిలో నిలిపేలా వ్యూహరచన చేస్తున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌… పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ అదే జోష్‌ను కంటిన్యూ చేయాలనుకుంటోంది. అందుకే, సోనియాను.. తెలంగాణలోని ఏదో ఒక ఎంపీ స్థానం నుంచి బరిలో నిలిపేలా ఒప్పించాలని నిర్ణయించింది టీపీసీసీ. దీనిపై ఇవాళ జరిగిన పీఏసీ మీటింగ్‌లో… తీర్మానం కూడా చేసేసింది. మెదక్‌, మల్కాజ్‌గిరి, కరీంనగర్‌.. ఈ మూడింట్లో ఏదో ఒక స్థానం నుంచి ఆమెను బరిలో నిలపేలా ప్లాన్‌ చేస్తోంది. బీజేపీ సైతం.. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇదేటైపు అస్త్రాన్ని ప్రయోగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రధాని నరేంద్రమోదీని.. ఈసారి పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలో దిగేలా ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్‌ స్థానాల పేర్లు.. ఈ లిస్టులో వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయంలో పార్టమెంట్‌బోర్డు పార్టీ నిర్ణయమే ఫైనల్‌ అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. అటు కాంగ్రెస్‌ నుంచి సోనియా.. ఇటు బీజేపీ నుంచి మోదీ… ఒకవేళ నిజంగానే ఈ ఇద్దరు అగ్రనేతలు ఈసారి తెలంగాణ నుంచి బరిలో ఉంటే మాత్రం.. జనరల్‌ ఎలక్షన్స్‌లో ఈసారి రచ్చరచ్చే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..