President Of India: హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి.. సీఎం హోదాలో తొలిసారి స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆమెకు స్వాగతం పలికేందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో పాటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.

President Of India: హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి.. సీఎం హోదాలో తొలిసారి స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి
President Of India
Follow us
Srikar T

|

Updated on: Dec 18, 2023 | 9:30 PM

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆమెకు స్వాగతం పలికేందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో పాటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరితో పాటూ మరి కొందరు క్యాబినెట్ మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రపతికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి శాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు.

ప్రతి ఏటా శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి హైదరాబాద్ చేరుకోవడం ఆనవాయితీ. ఎన్నో ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అందులో భాగంగానే ద్రౌపది ముర్ము హైదరాబాద్ కి విచ్చేశారు. రాష్ట్రపతి రాకతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసు ఉన్నతాధికారులు. హైదరాబాద్ చేరుకున్న ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నివాసంలో బస చేయనున్నారు. ఈనెల 23 మూడు వరకూ ఈమె పర్యటన కొనసాగనుంది. డిశంబర్ 20న భూదాన్ పోచంపల్లిలో పర్యటించనున్నారు.

పోచంపల్లిలో ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శనలో పాల్గొంటారు. ఈ విడిది కాలంలో పలువురు ముఖ్యనేతలతో పాటూ పలు రంగాల ప్రముఖులను కలువనున్నట్లు తెలుస్తోంది. చేనేత కార్మికులతో ముచ్చటించనున్నారు. ఈ ఐదు రోజుల పర్యటన పూర్తి చేసుకుని 23న తిరిగి ఢిల్లీ వెళ్లనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు. రాష్ట్రపతి హోదాలో ఇలా విడిదికి రావడం ఇది రెండో సారి. గత ఏడాది డిశంబర్ 26న హైదరాబాద్‎కు వచ్చి ఐదు రోజులు పర్యటించి డిశంబర్ 30న ఢిల్లీకి తిరిగి వెళ్లారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..