Hyderabad: ఓవైపు కొనసాగుతున్న శోభాయాత్ర.. షార్ట్ సర్క్యూట్ వల్ల తప్పిన పెను ప్రమాదం..

హైదరాబాద్‌లోని మాదన్నపేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఉప్పర్ బస్తి హనుమాన్ దేవాలయం వద్ద పెను ప్రమాదం తప్పింది. గణేష్ శోభ యాత్ర సందర్భంగా వందల విగ్రహాలు వెలాది మంది భక్తులు వెళుతుండగా.. రోడ్డు పక్కనే ఉన్న కరెంటు స్తంభానికి షాక్ సర్క్యూట్ అయింది. దీంతో అక్కడున్న రెండు మేకలు చనిపోయాయి. అయితే అక్కడ తరచుగా షార్ట్ సర్క్యూట్ రావడం వల్ల.. స్థానికులు ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయిందని స్థానికులు ఆగ్రహం వక్తం చేస్తున్నారు.

Hyderabad: ఓవైపు కొనసాగుతున్న శోభాయాత్ర.. షార్ట్ సర్క్యూట్ వల్ల తప్పిన పెను ప్రమాదం..
Ganesh Idol
Follow us
Sravan Kumar B

| Edited By: Aravind B

Updated on: Sep 28, 2023 | 9:38 PM

హైదరాబాద్‌లోని మాదన్నపేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఉప్పర్ బస్తి హనుమాన్ దేవాలయం వద్ద పెను ప్రమాదం తప్పింది. గణేష్ శోభ యాత్ర సందర్భంగా వందల విగ్రహాలు వెలాది మంది భక్తులు వెళుతుండగా.. రోడ్డు పక్కనే ఉన్న కరెంటు స్తంభానికి షాక్ సర్క్యూట్ అయింది. దీంతో అక్కడున్న రెండు మేకలు చనిపోయాయి. అయితే అక్కడ తరచుగా షార్ట్ సర్క్యూట్ రావడం వల్ల.. స్థానికులు ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయిందని స్థానికులు ఆగ్రహం వక్తం చేస్తున్నారు. అలాగే పలుమార్లు జీహెచ్‌ఎంసీ, విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసిన కూడా పట్టించుకోవడం లేదని హనుమాన్ దేవాలయ ప్రతినిధి నిరంజన్ యాదవ్ తెలిపారు. దేవాలయం వద్ద చెత్తకుండి తొలగించాలని జీహెచ్‌ఎంసీకి పలుమార్లు ఫిర్యాదులు చేశామని.. అయినా కుడా వాళ్లు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.

ఇక ఎంఐఎం పార్టీకి చెందిన కార్పొరేటర్ దీనికి ప్రధాన అడ్డంకిగా మారినట్లు ఆరోపణలు చేశారు. గతంలో ఇక్కడే రెండు పశువులు కూడా చనిపోయాయని తెలిపారు. కానీ జీహెచ్‌ఎంసీ, విద్యుత్ అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు జరిగిన ప్రమాదంలో ఒకవేళ వినాయక నిర్వహకులు అప్రమత్తంగా లేకపోయినట్లైతే తీవ్ర ప్రాణ నష్టం జరిగేదని వాపోయారు. చెత్త కుండి తొలగించకపోతే త్వరలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని ఈ సందర్బంగా హెచ్చరించారు. నిమజ్జనం కార్యక్రమం సందర్భంగా.. వందలాది మంది భక్తులు అటుగా ఆ రోడ్డు నుంచి వెళ్తూ ఉండటంతో పొరపాటున ఎవరైనా ఆ కరెంటు స్తంభానికి తాకి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి సరైన చర్యలు తీసుకొని అక్కడి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా మరోవైపు గణేష్ నిమజ్జనోత్సవం రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా జరుగుతోంది. 9 రోజుల పాటు సేవలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడ్డుకు చేరుతున్నాడు. హైదరాబాద్‌లోని హుస్సెన్ సాగర్ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. వేలాది వినాయకుని విగ్రహాలు హుస్సెన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తున్నారు. మరోవైపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు.. ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు చేశారు. అలాగే సీసీటీవీ కెమెరాలతో నిరంతరం నిమజ్జన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కొంతమంది పోకిరీలు కూడా అక్కడ పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. మహిళలను తాకరాని చోట్ల తాకుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే ఇలాంటి పోకీరీల ఆగడాలను అడ్డుకునేందుక షీ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. అమ్మయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిని గుర్తించి అరెస్టు చేస్తున్నారు. అంతేకాదు ఇందుకు సంబంధించి ఓ వీడియోను కూడా తాజాగా విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..