M.S. Swaminathan: హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత..
M.S. Swaminathan: ప్రముఖ వ్యవసాయశాఖ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. మంకొంబు సాంబశివన్ స్వామినాథన్(98) ఇవాళ చెన్నైలోని తన నివాసం ఉదయం 11.20 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
M.S. Swaminathan: ప్రముఖ వ్యవసాయశాఖ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. మంకొంబు సాంబశివన్ స్వామినాథన్(98) ఇవాళ చెన్నైలోని తన నివాసం ఉదయం 11.20 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
1925 ఆగస్టు 7న కుంభకోణంలో సర్జన్ అయిన MK సాంబశివన్, పార్వతి తంగమ్మాళ్ దంపతులకు జన్మించిన స్వామినాథన్ అక్కడే పాఠశాల విద్యను అభ్యసించారు. వ్యవసాయ శాస్త్రంపై ఆయనకున్న ఆసక్తి, తన తండ్రి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనడం, మహాత్మా గాంధీ ప్రభావం ఆయనను ఈ సబ్జెక్ట్‌లో ఉన్నత చదువులు చదివేందుకు ప్రేరేపించాయి. లేదంటే.. స్వామినాథన్ 1940ల చివరలో పోలీసు అధికారి అయ్యి ఉండేవాడు. అప్పటికి, ఆయన కోయంబత్తూరులోని వ్యవసాయ కళాశాల (ప్రస్తుతం, తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం) నుండి రెండు అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను పొందారు.
డాక్టర్ స్వామినాథన్ ‘హరిత విప్లవం’ విజయం కోసం ఇద్దరు కేంద్ర వ్యవసాయ మంత్రులు సి. సుబ్రమణ్యం (1964-67), జగ్జీవన్ రామ్ (1967-70 & 1974-77)తో కలిసి పనిచేశారు. ఈ కార్యక్రమం క్వాంటం జంప్‌కు మార్గం సుగమం చేసింది. రసాయన-జీవ సాంకేతికత అనుసరణ ద్వారా గోధుమ, బియ్యం ఉత్పాదకత, ఉత్పత్తిని పెంచింది. గోధుమలపై ప్రముఖ అమెరికన్ వ్యవసాయ శాస్త్రవేత్త, 1970 నోబెల్ గ్రహీత నార్మన్ బౌర్లాగ్ ఆవిష్కరణ ఈ విషయంలో కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు.
స్వామినాథన్ మృతిపై ప్రముఖుల సంతాపం..
హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ మృతిపట్ల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. స్వామినాథన్ ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ప్రధాని నరేంద్ర అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. స్వామినాథన్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
Deeply saddened by the demise of Dr. MS Swaminathan Ji. At a very critical period in our nation’s history, his groundbreaking work in agriculture transformed the lives of millions and ensured food security for our nation. pic.twitter.com/BjLxHtAjC4
— Narendra Modi (@narendramodi) September 28, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..