AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ.. బీసీ కుల గణన చేయాలని డిమాండ్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రోజురోజుకి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో బీసీల కుల గణన చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. బీసీల కుల గణన చేపట్టాలని సుదీర్ఘ కాలంగా డిమాండ్ ఉందని.. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించిందని తెలిపారు. అలాగే కుల గణన కోసం బీసీ సంఘాలు చేపట్టిన నిరసన, ఉద్యమాలకు కాంగ్రెస్ అండగా నిలిచిందని పేర్కొన్నారు.

Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ.. బీసీ కుల గణన చేయాలని డిమాండ్
Revanth Reddy
Aravind B
|

Updated on: Oct 03, 2023 | 4:23 PM

Share

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రోజురోజుకి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో బీసీల కుల గణన చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. బీసీల కుల గణన చేపట్టాలని సుదీర్ఘ కాలంగా డిమాండ్ ఉందని.. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించిందని తెలిపారు. అలాగే కుల గణన కోసం బీసీ సంఘాలు చేపట్టిన నిరసన, ఉద్యమాలకు కాంగ్రెస్ అండగా నిలిచిందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లును ఆమోదించిన సమయంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారని గుర్తుచేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు చేసినా కూడా బిహార్ రాష్ట్రంలో జేడీయూ పార్టీ కుల జనగణనను విజయవంతంగా చేపట్టిందని.. అలాగే వాటి వివరాలు కూడా విడుదల చేసిందని అన్నారు.

అలాగే బీసీ కులగణనతోనే బీసీ వర్గాలకు న్యాయం జరుగుంతుందని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఈ బీసీ కుల గణన జరిగినట్లైతే.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15,16 ప్రకారం విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు కల్పించినటువంటి రిజర్వేషన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ జనగణన డిమాండ్ ను పట్టించుకోవడం లేదని.. బీసీనని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ కూడా బీసీల న్యాయమైన డిమాండ్‎ను నేరవేర్చడం లేదని ఆరోపించారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీసీ సంక్షేమాన్ని గాలికొదిలేసిందని అన్నారు. బీసీలకు ఎంతో చేస్తున్నామని చెప్పుకోవడమే తప్ప చేసింది శూన్యమని.. బీసీ సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీ తెస్తామన్నా మాట ఉత్త ముచ్చటగానే మిగిలిపోయిందంటూ పేర్కొన్నారు. తక్షణమే బీసీ కుల గణనతో పాటు సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఇలా జరిగినప్పుడే సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో బీసీలకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కుతుందంటూ లేఖలో రాసుకొచ్చారు రేవంత్ రెడ్డి .

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్