AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddipet Train: సిద్ధిపేట ప్రజల కల సాకారం.. కూతపెట్టిన రైలు

సిద్దిపేట జిల్లాలో రైలు పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకు రైళ్లు నడవనున్నాయి. తొలిరైలు సాయంత్రం 6.50 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోనుంది. రేపటి నుంచి అంటే బుధవారం సిద్దిపేట-సికింద్రాబాద్‌ మార్గాల్లో రెండు సార్లు రైలు రాకపోకలు సాగించనుంది. సికింద్రాబాద్‌ నుంచి సిద్దిపేట వరకు రైలు టికెట్ ఛార్జీ 60 రూపాయలు ఉంది. సిద్ధిపేట, సికింద్రాబాద్‌ మధ్య నడుస్తోన్న బస్సు ఛార్జీలతో పోల్చితే ఇది సగం రేటే..

Siddipet Train: సిద్ధిపేట ప్రజల కల సాకారం.. కూతపెట్టిన రైలు
Siddipet Train
Subhash Goud
|

Updated on: Oct 03, 2023 | 5:04 PM

Share

సిద్దిపేట ప్రజల దశాబ్ద కల నెరవేరింది. సొంతూరికి రైలుపై వెళ్లాలన్న కల నిజమైంది. సిద్ధిపేటకు రైలొచ్చింది. సిద్ధిపేట – సికింద్రాబాద్ రైలును కొద్ది సేపటి క్రితమే నిజామాబాద్ నుంచి వర్చువల్‌గా ప్రధాని మోదీ ప్రారంభించారు. సిద్ధిపేటలో మంత్రి హరీష్‌రావు జెండా ఊపి రైలు ప్రారంభించారు.

అయితే ఈ రైలు ప్రారంభం సందర్భంగా సిద్ధిపేట రైల్వేస్టేషన్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి హరీష్‌రావు వెంట వచ్చిన బీఆర్‌ఎస్ నేతలు.. అప్పటికే స్టేషన్‌లో ఉన్న బీజేపీ నేతలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో స్టేషన్ హోరెత్తిపోయింది. ఈక్రమంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది.

ఇవాళ్టి నుంచి సిద్దిపేట జిల్లాలో రైలు పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకు రైళ్లు నడవనున్నాయి. తొలిరైలు సాయంత్రం 6.50 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోనుంది. రేపటి నుంచి అంటే బుధవారం సిద్దిపేట-సికింద్రాబాద్‌ మార్గాల్లో రెండు సార్లు రైలు రాకపోకలు సాగించనుంది. సికింద్రాబాద్‌ నుంచి సిద్దిపేట వరకు రైలు టికెట్ ఛార్జీ 60 రూపాయలు ఉంది. సిద్ధిపేట, సికింద్రాబాద్‌ మధ్య నడుస్తోన్న బస్సు ఛార్జీలతో పోల్చితే ఇది సగం రేటే.

ఇవి కూడా చదవండి

సికింద్రాబాద్‌ నుంచి సిద్దిపేటకు మొత్తం 116 కిలోమీటర్ల మేర రైలు మార్గం ఉంది. సికింద్రాబాద్‌లో బయలుదేరిన ట్రైన్.. మల్కాజిగిరి, బొల్లారం, గుండ్లపోచంపల్లి, మేడ్చల్‌, మనోహరాబాద్‌, నాచారం, బేగంపేట, గజ్వేల్‌, కొడకండ్ల, లకుడారం, దుద్దెడ, సిద్దిపేట స్టేషన్‌లలో ఆగనుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సిద్ధిపేట ప్రజల కోరిక ఎట్టకేలకు సాకారమైందనే చెప్పాలి. ఇప్పుడు సికింద్రాబాద్‌ నుంచి సిద్ధిపేటకు రైలు మార్గం ద్వారా గమ్య స్థానాలకు చేరుకోవచ్చు. ఈ సిద్దిపేట – సికింద్రాబాద్‌ రైలు సర్వీసును ప్రారంభించిన మోడీ.. దేశంలో త్వరలో మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.

అయితే కేంద్ర ప్రభుత్వం రైల్వేనే మరింతగా విస్తరిస్తోంది. కొత్త కొత్త ప్రదేశాలలో రైల్వే ట్రాక్‌ను ఏర్పాటు చేస్తూ కొత్త కొత్త సర్వీసులను ప్రారంభిస్తోంది. రైలు అనగానే సామాన్యుల నుంచి ఉన్నతమైన వ్యక్తుల వరకు రైలు ప్రయాణం చేస్తుంటారు. బస్సు ఛార్జీలకంటే రైలు ఛార్జీలు తక్కువగా ఉండటంతో సామాన్యులు సైతం రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. తక్కువ ఛార్జీల్లోనే తమ తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. అందుకే చాలా మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. సామాన్యులను సైతం దృష్టిలో ఉంచుకుని మోడీ ప్రభుత్వం కొత్త రైళ్లను ప్రారంభిస్తోంది. ఇటీవల మోడీ ప్రారంభించిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను సైతం సామాన్యులకు తక్కువ ఛార్జీలు ఉండేలా అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కూడా సాధారణ ఛార్జీలతో సామాన్యులకు అందుబాటులోకి రానుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
మహేష్ బాబు కోసం మాస్టర్ ప్లాన్ వేస్తున్న జక్కన్న
మహేష్ బాబు కోసం మాస్టర్ ప్లాన్ వేస్తున్న జక్కన్న
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రెడిట్‌ కార్డు.. లిమిట్‌ రూ. 10కోట్లు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రెడిట్‌ కార్డు.. లిమిట్‌ రూ. 10కోట్లు