SIM Card New Rule: అక్టోబర్‌ 1 నుంచి సిమ్ కార్డ్ కొత్త రూల్స్‌.. అవేంటో తెలుసుకోండి

నకిలీ సిమ్‌కార్డుల విక్రయాలను నిరోధించేందుకు అమ్మకందారుల కోసం ఈ నిబంధనను తీసుకురాగా, ఇది కొనుగోలుదారులపై కూడా ప్రభావం చూపుతోంది. చాలా కాలంగా వస్తున్న ఫిర్యాదులకు కూడా కొంత ఉపశమనం లభిస్తుంది. దేశంలో రోజురోజుకు ప్రీ-యాక్టివేటెడ్ సిమ్ కార్డులు అమ్ముడుపోతున్నాయి. చాలా సందర్భాలలో ఆ సిమ్‌లు మరొకరి పేరు మీద రిజిస్టర్ చేయబడి ఉంటాయి. సిమ్‌కార్డుల విక్రయాన్ని కఠినంగా నిర్వహించగలిగితే..

SIM Card New Rule: అక్టోబర్‌ 1 నుంచి సిమ్ కార్డ్ కొత్త రూల్స్‌.. అవేంటో తెలుసుకోండి
Sim Cards
Follow us
Subhash Goud

|

Updated on: Oct 01, 2023 | 10:04 PM

అక్టోబర్ 1 నుంచి దేశ టెలికాం రంగంలో పెను మార్పు చోటు చేసుకోనున్నాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DOT) సిమ్ కార్డ్‌లను విక్రయించే నిబంధనలను మార్చనున్నట్లు గతంలో ప్రకటించింది. ఇక నుంచి సిమ్‌కార్డుల విక్రయంలో విక్రేతలు అనేక నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఈ నిబంధనను పాటించడంలో విఫలమైతే 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. దేశంలో పెరుగుతున్న సిమ్ కార్డ్ మోసాల రేటును అరికట్టడానికి ప్రభుత్వం ఈ కఠినమైన చర్య తీసుకుంది.

నకిలీ సిమ్‌కార్డుల విక్రయాలను నిరోధించేందుకు అమ్మకందారుల కోసం ఈ నిబంధనను తీసుకురాగా, ఇది కొనుగోలుదారులపై కూడా ప్రభావం చూపుతోంది. చాలా కాలంగా వస్తున్న ఫిర్యాదులకు కూడా కొంత ఉపశమనం లభిస్తుంది. దేశంలో రోజురోజుకు ప్రీ-యాక్టివేటెడ్ సిమ్ కార్డులు అమ్ముడుపోతున్నాయి. చాలా సందర్భాలలో ఆ సిమ్‌లు మరొకరి పేరు మీద రిజిస్టర్ చేయబడి ఉంటాయి. సిమ్‌కార్డుల విక్రయాన్ని కఠినంగా నిర్వహించగలిగితే ఇలాంటి మోసాలు తగ్గుతాయని ప్రభుత్వం పేర్కొంది.

కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత విక్రేతలు ముందుగా యాక్టివేట్ చేసిన సిమ్‌లను ఇతరులకు బదిలీ చేయలేరు. దీంతో సిమ్‌కార్డులు విక్రయిస్తున్న విక్రయదారులపై నిఘా పెట్టి వినియోగదారుల సమస్యకు ముగింపు పలికేందుకు టెలికమ్యూనికేషన్ విభాగం (డీఓటీ) ముందుకు వచ్చింది. అంతే కాదు, సిమ్ విక్రేత తన షాప్ సిబ్బంది మొత్తం సమాచారాన్ని రికార్డ్ చేయాలి. షాపు సిబ్బంది కూడా పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

DoT కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి సిమ్‌ (SIM) కార్డ్ దుకాణానికి (రిటైల్) కార్పొరేట్ ఐడీ నంబర్ లేదా సీఐఎన్‌ నంబర్ జారీ చేయబడుతుంది. ఈ ఎమర్జెన్సీ నంబర్ లేకుండా ఎవరూ సిమ్‌ కార్డ్‌ని విక్రయించలేరు. ఇప్పుడు ఒక రిటైల్ స్టోర్ DoT కింద నమోదు చేసుకోవడానికి ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, జీఎస్టీ వివరాలను అందించాలి. రిజిస్ట్రేషన్ లేకుండా ఏ దుకాణం సిమ్ కార్డును విక్రయించేందుకు వీలుండదు. ఈ రిజిస్ట్రేషన్ లేకుండా దుకాణాదారులు సిమ్‌ కార్డ్‌లను విక్రయిస్తే, దాని ID బ్లాక్ చేయబడుతుంది. అంతే కాకుండా దుకాణదారునికి జరిమానా విధిస్తారు. అలాగే ఒక వ్యక్తి సిమ్ కార్డును పోగొట్టుకున్నా లేదా సిమ్ కట్ చేసినా, అతను వెరిఫికేషన్ ప్రక్రియకు వెళ్లాలి. జియో, ఎయిర్‌టెల్, వి, బిఎస్‌ఎన్‌ఎల్ సిమ్ కార్డులను విక్రయించడానికి ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. అందుకే ఇబ్బడి ముబ్బడిగా సిమ్‌ కార్డులను తీసుకుంటే బ్లాక్‌ చేయించుకోవడం, లేదా అలగే వదిలేసి వేరే సిమ్‌ కార్డులను తీసుకోవడం మంచిది కాదు. లేకుంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. సిమ్‌ కార్డు మోసాలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో టెలికమ్యూనికేషన్‌ విభాగం ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి