AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Carpooling Ban: పెట్రోల్‌ ఖర్చు ఆదా చేసేందుకు ఇలా చేస్తే 10,000 జరిమానా

కార్‌పూలింగ్‌ ఇప్పుడు ఇది చట్టవిరుద్ధంగా మారిందని ఆయన చెబుతున్నారు. అయితే ఇలా చేసే వారి ఆర్‌సిని ఆరు నెలల వరకు సస్పెండ్ చేయవచ్చని అధికారి తెలిపారు. అంతే కాకుండా వారికి రూ.5,000 నుంచి రూ.10,000 వరకు జరిమానా కూడా విధించవచ్చని కూడా వెల్లడించారు. ఇది చట్టవిరుద్ధమని ప్రకటించడం వెనుక రవాణా శాఖ కారణం ఏమిటంటే కార్‌పూలింగ్ యాప్‌లు వాణిజ్య ఉపయోగం కోసం..

Carpooling Ban: పెట్రోల్‌ ఖర్చు ఆదా చేసేందుకు ఇలా చేస్తే 10,000 జరిమానా
Carpooling
Subhash Goud
|

Updated on: Oct 01, 2023 | 6:21 PM

Share

పెట్రోల్, డీజిల్ ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి ఇంధనంపై వ్యయాన్ని తగ్గించడానికి అనేక పద్ధతులను అవలంబిస్తున్నారు కొందరు కారు డ్రైవర్లు. ఈ పద్ధతుల్లో ఒకటి కార్‌పూలింక్. ఇది ఇప్పుడు బెంగళూరులో నిషేధించబడింది. ఎవరైనా పెట్రోల్ ఖర్చులు తగ్గించుకోవడానికి ఈ పద్ధతిని అవలంబిస్తే రూ.10,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కార్‌పూలింగ్‌ చేసిన వారిపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు.

టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక నివేదిక ప్రకారం.. బెంగుళూరు రవాణా శాఖ టాక్సీ డ్రైవర్ల నుండి వచ్చిన ఫిర్యాదులను అనుసరించి క్విక్ రైడ్, ఇతర మొబైల్ యాప్‌లను ఉపయోగించి కార్‌పూలింగ్‌ను నిషేధించింది. ఈ యాప్‌ల ద్వారా కార్‌పూలింగ్ చేసే వ్యక్తులు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని రవాణా శాఖ అదనపు కమిషనర్ మల్లికార్జున్ తెలిపారు.

కార్‌పూలింగ్‌ ఇప్పుడు ఇది చట్టవిరుద్ధంగా మారిందని ఆయన చెబుతున్నారు. అయితే ఇలా చేసే వారి ఆర్‌సిని ఆరు నెలల వరకు సస్పెండ్ చేయవచ్చని అధికారి తెలిపారు. అంతే కాకుండా వారికి రూ.5,000 నుంచి రూ.10,000 వరకు జరిమానా కూడా విధించవచ్చని కూడా వెల్లడించారు. ఇది చట్టవిరుద్ధమని ప్రకటించడం వెనుక రవాణా శాఖ కారణం ఏమిటంటే కార్‌పూలింగ్ యాప్‌లు వాణిజ్య ఉపయోగం కోసం నమోదు చేయని ప్రైవేట్ కార్లను సేకరించడం ద్వారా నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

కార్‌పూలింగ్ అంటే ఏమిటి ?

కార్‌పూలింగ్ అనేది కారు యజమానులు తమ ప్రయాణంలో మరికొందరు వ్యక్తులను చేర్చుకుని, ప్రయాణ సమయంలో పెట్రోల్ మొదలైన వాటిపై అయ్యే ఖర్చులను పంచుకునే వ్యవస్థ. ఈ పద్ధతిలో పెట్రోల్‌పై ఖర్చు తగ్గుతుంది. ఇప్పుడు చాలా నగరాల్లో ఈ వ్యవస్థ పెరిగింది. దీని కారణంగా టాక్సీ డ్రైవర్లు మొదలైనవారు నష్టాలను ఎదుర్కొంటున్నారు.

టాక్సీ డ్రైవర్ల సంఘం ఫిర్యాదు

టాక్సీ డ్రైవర్ యూనియన్ల నుంచి అనేక ఫిర్యాదులు అందడంతో, రవాణా శాఖ దానిని పరిగణనలోకి తీసుకొని ఇప్పుడు దానిని నిషేధించింది. క్విక్ రైడ్, జూమ్ వంటి యాప్‌లు ఎలాంటి లైసెన్స్ లేకుండా పనిచేస్తున్నాయని కర్ణాటక రాష్ట్ర డ్రైవర్స్ కౌన్సిల్‌కు చెందిన కె సోమశేఖర్ తన ఆందోళనను వ్యక్తం చేశారు.

కార్‌పూలింగ్‌పై స్పష్టత లేదు

కార్‌పూలింగ్‌ను సమర్థించే వ్యక్తులు ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి ఇది మంచి వ్యవస్థ అని వాదించారు. బెంగళూరు రోడ్లపై వాహనాల సంఖ్య 1.1 కోట్లకు పైగా ఉంది. ఇందులో 73.6 లక్షల ద్విచక్ర వాహనాలు, 23.5 లక్షల నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి