Electric Scooter: సింగిల్ చార్జ్‌పై 200కి.మీ.. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లలో స్టన్నింగ్ ఫీచర్లు.. పూర్తి వివరాలు

ఎలక్ట్రిక్ వన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొత్త సిరీస్ ఈ1 ఆస్ట్రో ప్రోను లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో రెండు స్కూటర్లు ఉన్నాయి. ఈ1 అస్ట్రో ప్రో, ఈ1 ఆస్ట్రో ప్రో 10 పేర్లతో మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్కూటర్ల రిటైల్ ధర రూ. 99,999 నుంచి రూ. 1,24,999(ఎక్స్ షోరూం)గా ఉంది. దేశంలోని అన్ని ఎలక్ట్రిక్ వన్ స్టోర్లలో ఈ స్కూటర్లు అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Electric Scooter: సింగిల్ చార్జ్‌పై 200కి.మీ.. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లలో స్టన్నింగ్ ఫీచర్లు.. పూర్తి వివరాలు
Electric One Astro Series Scooters
Follow us
Madhu

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 01, 2023 | 9:27 PM

ఎలక్ట్రిక్ స్కూటర్లకు భారతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అందుకనుగుణంగా అన్ని కంపెనీలు కూడా తమ ఉత్పత్తులు కొత్త ఫీచర్లతో లాంచ్ చేస్తూ ఆకర్షిస్తున్నాయి. ఇదే క్రమంలో ఎలక్ట్రిక్ వన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొత్త సిరీస్ ఈ1 ఆస్ట్రో ప్రోను లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో రెండు స్కూటర్లు ఉన్నాయి. ఈ1 అస్ట్రో ప్రో, ఈ1 ఆస్ట్రో ప్రో 10 పేర్లతో మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్కూటర్ల రిటైల్ ధర రూ. 99,999 నుంచి రూ. 1,24,999(ఎక్స్ షోరూం)గా ఉంది. దేశంలోని అన్ని ఎలక్ట్రిక్ వన్ స్టోర్లలో ఈ స్కూటర్లు అందుబాటులో ఉంటాయి. దాదాపు 20 దేశాల్లో 100,000 వినియోగదారులు ఈ ఆస్ట్రో సిరీస్ పై ఆసక్తిని కలిగి ఉన్నారని ఎలక్ట్రిక్ వన్ కంపెనీ ప్రకటించింది. బ్రాండ్ ఇమేజ్ తో పాటు దీని అధిక పనితీరుపై నమ్మకంతో ఉన్నరని వివరించింది.

దేశీయ అవసరాలకు అనుగుణంగా..

ఈ ఆస్ట్రో ఎలక్ట్రిక్ స్కూటర్ సిరీస్ ను మన దేశంలోని వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తీసుకొచ్చారు. దీనిలో 2400వాట్ల మోటార్ ఉంటుంది. దీని ద్వారా అత్యద్భుతమైన యాక్సెలరేషన్ స్కూటర్ కు లభిస్తుంది. కేవలం 2.99సెకండ్లలోనే గంటకు సున్నా నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. గరిష్టంగా గంటకు 65కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనిలో బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 200కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్లు కార్బన్ కోటెడ్, రస్ట్ ప్రూఫ్, హై గ్రేడ్ ఫ్రేమ్స్ ను కలిగి ఉంటుంది. దీని సాయంతో అధిక కాలంపాటు బాడీ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అలాగే ఎన్ఎఫ్సీ, స్మార్ట్ కార్డ్ టెక్నాలజీ సాయంతో మంచి రైడింగ్ అనుభూతినిస్తుంది.

ఈ ప్రాంతాల్లో అందుబాటులోకి..

ఆస్ట్రో సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు గుజరాత్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత మిగిలిన రాష్ట్రాలకు విస్తరించనున్నారు. ఈ ఎలక్ట్రిక్ వన్ కంపెనీకి దాదాపు 20కి పైగా రాష్ట్రాల్లో 100కు పైగా ప్రత్యేకమైన షోరూంలు ఉన్నాయి. అంతేకాకా శ్రీలంక, నేపాల్ దేశాల్లో కూడా ప్రత్యేకమైన బ్రాండ్ షోరూంలను ఎలక్ట్రిక్ వన్ కలిగి ఉంది. వీటి సాయంతో వినియగదారులకు అద్భుతమైన సర్వీస్ ను అందిస్తుంది. ఎక్స్ టెండెడ్ వారంటీని కూడా ఇస్తుంది. స్కూటర్లోని ప్రధాన భాగాలపై కూడా ‘నో క్వశ్చన్ ఆస్కెడ్’ రిప్లేస్ మెంట్ పాలసీ వర్తింపజేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ ఆస్ట్రో స్కూటర్ 20కిపైగా దేశాలలో విజయవంతంగా నడుస్తోంది. జర్మనీ, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, స్పెయిన్, ఇటలీ, టర్కీ, ఇండోనేషియా వంటి దేశాల్లో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ రెడ్ బెర్రీ, బ్లేజ్ ఆరంజ్, ఎలిగెంట్ వైట్, మెటాలిక్ గ్రే, రేసింగ్ గ్రే వంటి ఐదు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..