Onion Export Duty: ఈ రకం ఉల్లిపై ప్రభుత్వం ఎగుమతి సుంకాన్ని తొలగించింది.. ధరలు తగ్గుతాయా?

పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి చర్యలు చేపట్టింది. సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఎదురు కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉల్లి ధరలను నియంత్రించేందుకు ఆగస్టు నెలలో ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకాన్ని విధించింది. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పుడు ప్రభుత్వం తెలిపింది. ఉల్లి పై 40 శాతం ఎగుమతి సుంకం డిసెంబర్ ..

Onion Export Duty: ఈ రకం ఉల్లిపై ప్రభుత్వం ఎగుమతి సుంకాన్ని తొలగించింది.. ధరలు తగ్గుతాయా?
Onion Export Duty
Follow us
Subhash Goud

|

Updated on: Sep 30, 2023 | 4:53 PM

ఉల్లిని ఉత్పత్తి చేసే రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లిపై ఎగుమతి సుంకాన్ని తొలగించింది. దీంతో లక్షలాది మంది రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. ఇప్పుడు వారికి సరసమైన ఉల్లి ధరలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అదే సమయంలో ఉల్లి పై ఎగుమతి సుంకాన్ని తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

విశేషమేమిటంటే.. బెంగళూరు రోజ్ రకం ఉల్లి పై మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఎగుమతి సుంకాన్ని తొలగించింది. కొన్ని షరతుల తో ఎగుమతి చేసేందుకు అనుమతి ఇస్తు్న్నట్లు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ లో పేర్కొంది. ఈ నిర్ణయం నేరుగా ఉల్లిని పండించే రైతులకు మేలు చేస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఉల్లి కిలో రూ.30 నుంచి 35 వరకు విక్రయిస్తున్నారు

ఇవి కూడా చదవండి

వాస్తవానికి పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి చర్యలు చేపట్టింది. సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఎదురు కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉల్లి ధరలను నియంత్రించేందుకు ఆగస్టు నెలలో ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకాన్ని విధించింది. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పుడు ప్రభుత్వం తెలిపింది. ఉల్లి పై 40 శాతం ఎగుమతి సుంకం డిసెంబర్ 31, 2023 వరకు కొనసాగుతుంది. ఇలా చేయడం వల్ల దేశం నుంచి ఉల్లి ఎగుమతులు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఉల్లి నిల్వలు పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉల్లి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. కిలో రూ.40కి లభించే ఉల్లి ఇప్పుడు రూ.30 నుంచి రూ.35 వరకు విక్రయిస్తున్నారు.

ఈ దేశాల్లో ఉల్లి సరఫరా అవుతుంది

బెంగళూరు రోజ్ రకానికి విదేశాల్లో అధిక డిమాండ్ ఉంది. దీని గరిష్ట ఎగుమతి థాయిలాండ్, తైవాన్, మలేషియా, సింగపూర్ వంటి దేశాలకు ఉంది. అదే సమయంలో ఎగుమతిదారు బెంగళూరు గులాబీ ఉల్లిని ఎగుమతి చేయడం, దాని నాణ్యతకు సంబంధించి కర్ణాటక హార్టికల్చర్ కమిషనర్ నుంచి ధృవీకరణ పత్రాన్ని చూపించవలసి ఉంటుంది. ఎందుకంటే సర్టిఫికెట్ చూపించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. గతంలో ఉల్లి ధర విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉల్లిపాయలను కొనుగోలు చేయాలంటేనే భయపడే రోజులు ఉండేవి. మోడీ సర్కార్‌ తీసుకున్న చర్యల కారణంగా ఉల్లి ధర క్రమ క్రమంగా దిగి వచ్చింది. ప్రస్తుతం ఉల్లి ధర అదుపులో ఉండటంతో సామాన్య ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి