Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు గమనించండి
కరోనా ఆ విధానాన్ని పూర్తిగా మార్చేసింది. కచ్చితంగా వీలున్నంత వరకూ ఎదో ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం మంచిది అనే భావన ప్రజల్లో పెరుగుతూ వస్తోంది. ఇక ఇన్సూరెన్స్ లో కూడా హెల్త్ ఇన్సూరెన్స్ వైపు ప్రజలు క్రమేపీ వెళుతున్నారు. ఆరోగ్య సమస్యలు వస్తే హెల్త్ ఇన్సూరెన్స్ తమకు ఉపయోగకరంగా ఉంటుంది అని చాలామంది భావిస్తున్నారు. ఈ క్రమంలో హెల్త్ ఇన్సూరెన్స్..
కొంత కాలం క్రితం వరకూ మన దేశంలో ఇన్సూరెన్స్ పై సరైన అవగాహన ఉండేది కాదు. ఏజెంట్లు బలవంతం చేశారనో.. టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయనో తప్పితే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడానికి పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించే వారు కాదు. అయితే, కరోనా ఆ విధానాన్ని పూర్తిగా మార్చేసింది. కచ్చితంగా వీలున్నంత వరకూ ఎదో ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం మంచిది అనే భావన ప్రజల్లో పెరుగుతూ వస్తోంది. ఇక ఇన్సూరెన్స్ లో కూడా హెల్త్ ఇన్సూరెన్స్ వైపు ప్రజలు క్రమేపీ వెళుతున్నారు. ఆరోగ్య సమస్యలు వస్తే హెల్త్ ఇన్సూరెన్స్ తమకు ఉపయోగకరంగా ఉంటుంది అని చాలామంది భావిస్తున్నారు. ఈ క్రమంలో హెల్త్ ఇన్సూరెన్స్ కి డిమాండ్ పెరుగుతూ వస్తోంది.
హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే.. లిక్విడిటీ సమస్యలు లేకుండా.. సకాలంలో చికిత్స చేయించుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే.. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు ఏ విషయాలు పరిశీలించాలి? ఎటువంటి పాలసీ తీసుకోవాలి? ఈ విషయాలపై చాలామందికి అవగాహన లేదు. ఇప్పడు మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే చూడాల్సిన ముఖ్యమైన విషయాల గురించి మన ఫటా ఫట్ షోలో చెప్పేసుకుందాం..
ముందుగా ఉన్న వ్యాధులకు కవరేజ్ విషయంలో జాగ్రత్తగా పాలసీ నిబంధనలు పరిశీలించాలి. భారతదేశంలో దాదాపు నాలుగింట ఒక వంతు మరణాలు గుండెకు సంబంధించిన వ్యాధుల కారణంగా ఉంటున్నాయని చాలా రిపోర్ట్స్ చెబుతున్నాయి. అదే కాకుండా డయాబెటిస్, క్యాన్సర్, స్ట్రోక్, శ్వాస కోశ ఇబ్బందులు వంటివి కూడా బాగా పెరుగుతున్నాయి. వీటి ప్రభావం చాలా ఎక్కువగా ప్రజలపై ఉంటోంది.
మీకు ఇప్పటికే అలాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నట్లయితే, ముందుగా ఉన్న వ్యాధులకు ఆరోగ్య బీమా కవరేజ్ నుండి మీరు చాలా ప్రయోజనం పొందవచ్చు. మీరు ఇన్సూరెన్స్ మొత్తాన్ని తక్షణమే పొందకపోయినా, వెయిటింగ్ పీరియడ్ తర్వాత మీరు దాన్ని అందుకుంటారు. ఇలా దీర్ఘకాలిక.. సెన్సెటివ్ వ్యాధుల కోసం కవరేజ్ ఇచ్చే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. అదేవిధంగా ఈ పాలసీ తీసుకునేటప్పుడు వెయిటింగ్ పిరియడ్ గురించి పరిశీలించాలి. తక్కువ వెయిటింగ్ పిరియడ్ ఉన్న పాలసీ ఎంచుకోవాలి
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు సాధారణ హాస్పిటల్స్ లో వైద్య చికిత్సలను మాత్రమే కవర్ చేస్తాయి. అయితే దీర్ఘకాలిక వ్యాధులలో మన దేశంలో హోమియోపతి, ఆయుర్వేదం వంటి ఆల్టర్నేట్ మెడిసిన్ సైపు చాలామంది వెళతారు. వీటి వల్ల ఎక్కువశాతం మంది ఉపశమనం పొందినట్టు కొన్ని రిపోర్ట్స్ పేర్కొన్నాయి కూడా. అందుకే ఇలా ఆల్టర్నెట్ వైద్య విధానాలకు సపోర్ట్ చేసే పాలసీ తీసుకోవడం మంచిది. ఇటువంటి వాటిని ఆయుష్ చికిత్సలు అంటారు. ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి ఇందులోకి వస్తాయి. అందుకే చికిత్స రకంతో సంబంధం లేకుండా, సరైన బీమా పాలసీని ఎంచుకోవడం ద్వారా మీరు ఖర్చులను కవర్ చేసుకోవచ్చు.
హాస్పిటల్ నెట్వర్క్ మరో ముఖ్యమైన అంశం. దేశంలోని పట్టణ – గ్రామీణ ప్రాంతాలకు చెందిన భారతీయులు సాధారణంగా ప్రైవేట్ ఆసుపత్రులను ఇష్టపడతారు. ఇది ప్రధానంగా మెరుగైన నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ దొరుకుతుందనే ఆలోచన కారణంగా జరుగుతుంది. అయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖర్చులు పబ్లిక్ ఆల్ట్రనేటివ్ తో చూస్తే దాదాపు 10 రెట్లు ఎక్కువ ఖర్చు అవుతాయి.
మీరు లేదా మీ కుటుంబ సభ్యులు కూడా ప్రైవేట్ సౌకర్యాలను ఇష్టపడితే, బీమా ప్రొవైడర్ నెట్‌వర్క్ ఆసుపత్రుల లిస్ట్ చూసుకోండి. ఎక్కువ నెట్ వర్క్ ఆసుపత్రులు.. మీ దగ్గరలో మంచి హాస్పిటల్స్ ఆ నెట్వర్క్ లో ఉండడం చాలా అవసరం. అప్పుడు మీరు మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో దగ్గరలోని ప్రసిద్ధ ఆసుపత్రిలో సకాలంలో మంచి క్వాలిటీ సర్వీసుల్ని పొందవచ్చు.
అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే సమయంలో అన్ని విషయాలను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోండి. ఇదివరకులా కాకుండా ఇప్పుడు చాలారకాల ప్లాన్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిలో మీకు సరిపడే ప్లాన్ ఎంచుకోండి. అలాగే పేమెంట్ ఆప్షన్స్ కూడా నెలవారి ప్రీమియంలతో కొన్ని కంపెనీలు పాలసీలు అందిస్తున్నాయి. అన్నిటినీ పరిశీలించి మీకు తగిన ప్లాన్ సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఇంకా ఏదైనా అనుమానాలు ఉంటె ఇన్సూరెన్స్ నిపుణుల సలహా తీసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి