RBI: రూ.2000 నోటుకు సంబంధించి కీలక అప్‌డేట్‌.. నోట్ల మార్పిడి తేదీ పొడిగింపుపై స్పందించిన ఆర్బీఐ

గడువు సమీపిస్తున్న కొద్దీ విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు, ఎన్‌ఆర్‌ఐల కోసం 2000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ గడువును అక్టోబర్ 31, 2023 వరకు పొడిగించవచ్చని అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి. కానీ ఇప్పుడు ANI నివేదిక ప్రకారం.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గడువును పొడిగించే ఆలోచనలో లేనట్లుగా తెలుస్తోంది. ప్రజలు బ్యాంకులకు వెళ్లి ఈ నోట్లను మార్చుకోవచ్చు..

RBI: రూ.2000 నోటుకు సంబంధించి కీలక అప్‌డేట్‌.. నోట్ల మార్పిడి తేదీ పొడిగింపుపై స్పందించిన ఆర్బీఐ
2000 Notes
Follow us
Subhash Goud

|

Updated on: Sep 30, 2023 | 2:28 PM

రూ.2000 నోటుకు సంబంధించి పెద్ద వార్తలే వస్తున్నాయి. రూ.2000 నోటును మార్చుకునేందుకు గడువు ముగిసిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించింది. రూ.2000 నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 చివరి తేదీ అని ఆర్బీఐ తెలిపింది. 2000 నోట్లను మార్చుకోవడానికి ప్రజలకు సమయం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టంగా చెప్పింది. సెప్టెంబర్ 30 తర్వాత, ఈ నోట్లు కేవలం కాగితం ముక్కగా మిగిలిపోతాయని తెలిపింది. అయితే వార్తా సంస్థ ANI వివరాల ప్రకారం.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి గడువును పొడిగించడం లేదు. అటువంటి పరిస్థితిలో రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి మీకు చివరి అవకాశం ఇదే.

గడువు పొడిగింపు ఉండదు:

గడువు సమీపిస్తున్న కొద్దీ విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు, ఎన్‌ఆర్‌ఐల కోసం 2000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ గడువును అక్టోబర్ 31, 2023 వరకు పొడిగించవచ్చని అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి. కానీ ఇప్పుడు ANI నివేదిక ప్రకారం.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గడువును పొడిగించే ఆలోచనలో లేనట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

4 నెలల సమయం ఇచ్చారు

మే 19, 2023న 2000 రూపాయల నోట్లను చెలామణి నుంచి తొలగించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రజలకు 4 నెలల సమయం ఇచ్చింది. తద్వారా ప్రజలు బ్యాంకులకు వెళ్లి ఈ నోట్లను మార్చుకోవచ్చు. దీని గడువు ఈరోజుతో ముగుస్తుంది అంటే శనివారం, సెప్టెంబర్ 30, 2023. మీరు ఈ పనిని ఇంకా పూర్తి చేయకపోతే ఈ రోజు మీకు చివరి అవకాశం. రూ.2000 నోట్లను ఒకేసారి రూ.20,000 వరకు మాత్రమే మార్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ పరిమితి విధించింది. అయితే శనివారం ఒక రోజు మాత్రమే మిగిలి ఉండటంతో మిగిలిపోయిన నోట్లు పెద్ద ఎత్తున మార్పిడి జరిగే అవకాశం ఉందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

ఇప్పటి వరకు 93 శాతం నోట్లు వెనక్కి వచ్చాయి

సెప్టెంబర్ 1న రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. రూ.2000 నోట్లలో దాదాపు 93 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నోట్ల మొత్తం విలువ రూ.3.32 లక్షల కోట్లు. అదే సమయంలో బ్యాంకింగ్ వ్యవస్థలోకి రావడానికి దాదాపు రూ.24,000 కోట్లు అంటే 7 శాతం మొత్తం ఇంకా మిగిలి ఉంది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న డేటా ప్రకారం.. డిపాజిట్ చేసిన నోట్లలో 87 శాతం బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు తెలుస్తోంది. మిగిలిన 13 శాతం మొత్తాన్ని ఇతర నోట్ల రూపంలో మార్చుకున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు