Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Reservation: 5 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు రైల్వే బెర్త్ బుక్ చేయాలంటే ఎలాంటి నియమాలు?

ఐదు నుంచి పన్నెండేళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు పూర్తి టికెట్ ఛార్జీని రైల్వే వసూలు చేస్తుందని ప్రకటించింది. ఈ వయస్సు పిల్లలకు ప్రత్యేక బెర్త్ సీటు అవసరమైతే, వారు పూర్తి ఛార్జీని చెల్లించాలి. ఈ సవరించిన నియమం 21 ఏప్రిల్ 2016 నుంచి అమలు చేయబడింది. ఇంతకుముందు, రైల్వేలు 5 నుంచి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు సగం ఛార్జీలతో బెర్త్‌లను..

Railway Reservation: 5 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు రైల్వే బెర్త్ బుక్ చేయాలంటే ఎలాంటి నియమాలు?
Train
Follow us
Subhash Goud

|

Updated on: Sep 29, 2023 | 4:04 PM

భారతీయ రైల్వే గత ఏడేళ్లలో పిల్లల కోసం ఛార్జీల నిబంధనలను మార్చడం ద్వారా రూ. 2800 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించింది. ఆర్టీఐ కార్యకర్త సమాచార అభ్యర్థనకు రైల్వే ఐటీ కంపెనీ ‘క్రైస్’ ఇచ్చిన సమాధానంలో ఈ విషయం వెల్లడైంది . సవరించిన చైల్డ్ ఫేర్ రూల్స్ 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే రూ.560 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. ఇది ఈ సంవత్సరాలను అత్యంత లాభదాయకమైన సంవత్సరాలుగా మార్చింది. రైల్వేస్ ‘CRIS’ కంపెనీ ప్రయాణీకుల, సరుకు రవాణా, రైల్వే కమ్యూనికేషన్ నియంత్రణ వంటి ప్రధాన సేవలలో సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తుంది.

మార్చి 31, 2016 న రైల్వే మంత్రిత్వ శాఖ ఐదు నుంచి పన్నెండేళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు పూర్తి టికెట్ ఛార్జీని రైల్వే వసూలు చేస్తుందని ప్రకటించింది. ఈ వయస్సు పిల్లలకు ప్రత్యేక బెర్త్ సీటు అవసరమైతే, వారు పూర్తి ఛార్జీని చెల్లించాలి. ఈ సవరించిన నియమం 21 ఏప్రిల్ 2016 నుంచి అమలు చేయబడింది. ఇంతకుముందు, రైల్వేలు 5 నుంచి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు సగం ఛార్జీలతో బెర్త్‌లను అందజేసేవి. పిల్లలు ప్రత్యేక బెర్త్ తీసుకోకుండా తోటి పెద్దల బెర్త్‌లో ప్రయాణించాలనుకుంటే వారికి సగం ఛార్జీలు వసూలు చేశారు.

పిల్లల కోసం నియమాలు ఏమిటి?

రిజర్వ్ కోచ్‌లో రైల్వే ప్రయాణంలో 1 నుంచి 4 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు రిజర్వేషన్ చేయవలసిన అవసరం లేదు. ఐదు సంవత్సరాల లో పు ఉన్న పిల్లలు రైలు టికెట్ లేకుండా ప్రయాణం చేయవచ్చు. 5 నుంచి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ప్రత్యేక రిజర్వేషన్ సీటు వద్దనుకుంటే సగం ఛార్జీలు చెల్లించి వారి తల్లిదండ్రులు లేదా బంధువులతో కలిసి ప్రయాణించవచ్చు. కానీ 5 నుంచి 12 ఏళ్ల పిల్లలకు ప్రత్యేక బెర్త్ కావాలంటే పూర్తి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు 1 నుంచి 4 సంవత్సరాల వయస్సు గల పిల్లల వివరాలను నింపినట్లయితే పిల్లల ఛార్జీలు చెల్లించవలసి ఉంటుంది. వివరాలు అందించకపోతే 1 నుంచి 4 సంవత్సరాల వయస్సు పిల్లలు ఉచితంగా ప్రయాణించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు పూర్తి బెర్త్ పిల్లల కోసం రిజర్వ్ చేయబడింది:

పిల్లల కోసం రెండు-స్థాయి ఛార్జీల ఎంపికల ఆధారంగా క్రిస్ 2016-17 నుండి 2022-23 సంవత్సరాలకు సంపాదన గణాంకాలను విడుదల చేశారు. ఈ ఏడేళ్లలో 3.6 కోట్ల మంది పిల్లలు రిజర్వ్‌డ్ సీటు లేదా బెర్త్‌ను ఎంచుకోకుండా సగం ఛార్జీలతో ప్రయాణించారు.  అయితే బెర్త్ కావాలంటే పూర్తి ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ వివరాల ప్రకారం.. రైలులో ప్రయాణించే మొత్తం పిల్లలలో 70 శాతం మంది పూర్తి ఛార్జీలు చెల్లించి బెర్త్‌లు లేదా సీట్లను రిజర్వ్ చేసుకున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి