AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Online Games: ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నారా? అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు

ప్రస్తుతం, చాలా ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు 18% GST చెల్లిస్తున్నాయి. క్యాసినోలు, బెట్టింగ్ అలాగే అవకాశంతో కూడిన ఇతర గేమ్‌లు 28% జీఎస్టీ పరిధిలో ఉంటాయి. గుర్రపు స్వారీ లేదా గుర్రపు పందేలలో, ఒక బెట్టింగ్ కు వచ్చే వాటా విలువపై ప్రభుత్వం 28% జీఎస్టీ వసూలు చేస్తుంది. భారత్ లో ఆన్‌లైన్ గేమింగ్ మార్కెట్ ఎంత ఉంటుందో ఆ లెక్కలు ఒకసారి చూద్దాం. దేశంలోని 40 కోట్ల మంది ప్రజలు ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతున్నారు.

Online Games: ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నారా? అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు
Online Games
Subhash Goud
|

Updated on: Sep 29, 2023 | 3:03 PM

Share

వస్తు-సేవల పన్ను అంటే GST అక్టోబర్ 1 నుంచి ఆన్‌లైన్ గేమింగ్‌పై 28%గా మారబోతోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) చైర్మన్ సంజయ్ అగర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగంగా గేమింగ్ కంపెనీలకు లీగల్ నోటీసు పంపినట్లు తెలిపారు. సెప్టెంబర్ 30లోగా అన్ని రాష్ట్రాల శాసనసభలు జిఎస్‌టి సవరణ బిల్లు 2023ని ఆమోదించాలని లేదా ఆర్డినెన్స్ తీసుకొచ్చి అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని సంజయ్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఇది అమలులోకి వచ్చిన 6 నెలల తర్వాత ఫలితాలలను రివ్యూ చేస్తామని అయన వెల్లడించారు. ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందెం, క్యాసినోలపై 28% జీఎస్టీ విధిస్తున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ జూలైలో ప్రకటించింది. ఆగస్టు 2న జరిగిన 51వ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం, చాలా ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు 18% GST చెల్లిస్తున్నాయి. క్యాసినోలు, బెట్టింగ్ అలాగే అవకాశంతో కూడిన ఇతర గేమ్‌లు 28% జీఎస్టీ పరిధిలో ఉంటాయి. గుర్రపు స్వారీ లేదా గుర్రపు పందేలలో, ఒక బెట్టింగ్ కు వచ్చే వాటా విలువపై ప్రభుత్వం 28% జీఎస్టీ వసూలు చేస్తుంది. భారత్ లో ఆన్‌లైన్ గేమింగ్ మార్కెట్ ఎంత ఉంటుందో ఆ లెక్కలు ఒకసారి చూద్దాం. దేశంలోని 40 కోట్ల మంది ప్రజలు ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతున్నారు. 2025 నాటికి, ఈ పరిశ్రమ విలువ 5 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 41 వేల కోట్లుగా ఉంటుందని అంచనా. దేశీయ మొబైల్ గేమింగ్ పరిశ్రమలు 2017-2020 మధ్య సంవత్సరానికి 38% చొప్పున వృద్ధి చెందాయి.

ఈ పరిశ్రమ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిని చూపిస్తోంది. భారతదేశం తర్వాత, చైనా- అమెరికాల గేమింగ్ వృద్ధి 8% -10%గా ఉన్నాయి. ఈ లెక్కలు చాలు ఆన్‌లైన్ గేమింగ్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందొ తెలుసుకోవడానికి ఇప్పుడు ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ జీఎస్టీ నిబంధన పరిశ్రమలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది అర్థం చేసుకుందాం. టీసీఎస్‌-ఇన్‌ఫోసిస్‌ సహా అనేక పెద్ద కంపెనీలు ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో ఉన్నాయి. ఈ రంగానికి సంబంధించి దాదాపు లక్ష మంది నిరుద్యోగులుగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గేమింగ్-జూదం రెండిటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. జూదం అంటే గ్యాంబ్లింగ్ అనేది అదృష్టం పై ఆధారపడి ఆడే పందెం ఉదాహరణకు రమ్మీ వంటివి. మరోవైపు గేమింగ్ అంటే చెస్ లాంటి స్కిల్స్ తో ఆడే ఆటలు. ఇవి మానసిక సామర్ధ్యాలపై ఆధారపడి ఉంటాయి. ఈ రెండు రకాలకూ నిర్వచనంతో పాటు కొన్ని నియమాలూ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఐటీ చట్టం-2021 సవరణ ప్రకారం.. అవకాశం అంటే అదృష్టం ఆధారంగా ఉన్న అన్ని ఆటలను ప్రభుత్వం జూదంగా పరిగణిస్తుంది. ఇటువంటి అన్ని ఆటలను ప్రభుత్వం దశలవారీగా గుర్తించి క్లోజ్ చేస్తుంది.

ఇప్పుడు ఇటువంటి ఆన్‌లైన్‌ గేమ్స్ ఆడవారికి ఎటువంటి పరిస్థితి ఉంటుంది? ఇప్పటివరకూ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌కు వినియోగదారు రూ.10 కమీషన్ చెల్లించాలి. ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా వినియోగదారు రూ.100 సంపాదిస్తే, అతనికి రూ.90 మిగులుతుంది. కొత్త రూల్స్‌ ప్రకారం.. ఈ మొత్తంపై 28% జీఎస్టీ అంటే రూ.25.2 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అన్నీ తీసివేస్తే మనకు రూ.64.8 మాత్రమే వస్తుంది. గతంలో రూ.90 వచ్చేది. ఇప్పుడు ఇదివరకులా గంటలకు గంటలు ఆన్‌లైన్‌ గేమ్స్ ఆడుతూ కూచుంటే.. మీకు అదృష్టం బాగుంది లాభం వస్తే అందులో ఒకవంతు ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. అంటే.. మీరు ఎంత ఆన్‌లైన్‌ గేమ్స్ లో మునిగిపోతే.. అంతా ప్రభుత్వానికి ఆదాయం. ఇంతకు ముందు పదో వంతు గేమింగ్ కంపెనీ తీసుకునేది. ఇప్పడు దానితో పాటు ప్రభుత్వం కూడా తీసుకుంటుంది. మరి ఇకపై గేమ్స్ ఆడాలా వద్దా అనేది మీరే ఆలోచించుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి