త్వరపడండి.! మీ దగ్గర రూ. 2 వేల నోటు ఉందా.? ముగుస్తున్న డెడ్‌లైన్.. మరి నెక్స్ట్ ఏంటి.!

మీ దగ్గర 2వేల రూపాయల నోటు ఇంకా ఉందా? బ్యాంక్‌లో డిపాజిట్ చేయకుండా మర్చిపోయారా? ఇవాళ, రేపు మాత్రమే గడువు ఉంది. త్వరగా త్వరపడండి.. లేదంటే న్యాయపరమైన చిక్కులు తప్పవు.. అయినా లైట్ తీసుకుంటే కటకటాలు లెక్కించడం ఖాయం. ఎందుకంటారా? మరి ఈ స్టోరీ మీ కోసమే. ఇక్కడ కీలక విషయాలు తెలుసుకోండి.. పదండి చూద్దాం..

త్వరపడండి.! మీ దగ్గర రూ. 2 వేల నోటు ఉందా.? ముగుస్తున్న డెడ్‌లైన్.. మరి నెక్స్ట్ ఏంటి.!
Rs 2000 Notes
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 29, 2023 | 1:29 PM

మీ దగ్గర 2వేల రూపాయల నోటు ఇంకా ఉందా? బ్యాంక్‌లో డిపాజిట్ చేయకుండా మర్చిపోయారా? ఇవాళ, రేపు మాత్రమే గడువు ఉంది. త్వరగా త్వరపడండి.. లేదంటే న్యాయపరమైన చిక్కులు తప్పవు.. అయినా లైట్ తీసుకుంటే కటకటాలు లెక్కించడం ఖాయం. ఎందుకంటారా? ఈ స్టోరీ మీ కోసమే.

నోట్ల రద్దు.. సామాన్యుల్నే కాదూ బడాబాబుల్ని సైతం ఇబ్బందులు పెట్టింది. 2016, నవంబర్‌ 19 అర్ధరాత్రి నుంచి 500, 1000రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. నోట్ల రద్దు తరువాత రిజర్వ్ బ్యాంక్ 2వేల నోట్లను విడుదల చేసింది. పింక్ నోట్ పేరుతో ఈ నోట్లు ప్రజల మధ్య సందడి చేశాయి. అయితే 7ఏళ్లు కూడా తిరక్కుండానే ఈ ఏడాది మే 19న 2వేల నోటును వెనక్కి తీసుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఎవరి దగ్గరైనా 2వేల నోట్లు ఉంటే వాటిని బ్యాంకులలో మార్పు చేసుకోవాలని సూచించింది. నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది.

2000 నోట్లను తమ బ్యాంకు ఖాతాల్లోకి డిపాజిట్ చేయడానికి ఎలాంటి పరిమితి లేదు. అయితే ఆర్బీఐ సూచనలు, చట్టపరమైన నిబంధనలకు లోబడి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మే 23, 2023 నుంచి ప్రజలు తమ దగ్గరున్న 2000 నోట్లను ఏ బ్యాంకులో అయినా ఇతర డినామినేషన్ల నోట్లుగా మార్చుకోవచ్చు. రోజుకు 20,000 వరకు మాత్రమే మార్చుకునే అవకాశం ఉంది. అకౌంట్ లేకపోయినా నిర్దేశించిన గుర్తింపు పత్రాలతో బ్యాంకుకు వెళ్లి నోటు మార్చుకునే వెసులుబాటు ఉంది. నోట్ల మార్పిడి కోసం ఎలాంటి కస్టమర్‌లకు ఛార్జీలు ఉండవు.

పెద్ద నోట్ల రద్దు అనంతరం 2016లో 2 వేలు నోట్లను ఆర్‌బీఐ అందుబాటులోకి తెచ్చింది. క్లీన్‌ నోట్‌ పాలసీలో భాగంగా ఈ ఏడాది మే నెలలో ఉప సంహరించుకుంది. నోట్లను రద్దు చేయకపోయినా ఇప్పటికీ లీగల్‌ టెండర్‌గానే 2వేల నోటు కొనసాగుతోంది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. 2000 నోట్లు వాసప్ ప్రకటన వెలువడిన తర్వాత 20 రోజుల్లోనే 50 శాతం 2వేల నోట్లు బ్యాంకులో జమ అయ్యాయి. ఆగస్ట్‌ 31 నాటికి దాదాపు 93శాతం 2వేల నోట్లు తిరిగి వచ్చాయి. 7శాతం నోట్లు ఇంకా మార్కెట్లోనే ఉన్నాయి. ఈ 7 శాతం నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి బదులుగా.. ప్రజలు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా డబ్బును మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే శుక్ర, శనివారాలే గడువు మిగిలి ఉండటం.. మిగిలిన ఏడు శాతంలో ఎంత మొత్తం వెనక్కి వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

సెప్టెంబర్‌ 30 తర్వాత రెండు వేల నోటు ఉంటే ఏంటన్న సందేహాలు జనాల్లో ఉన్నాయి. అక్టోబర్ 1 నుంచి ఎవరైనా రెండు వేల నోట్లు తమ దగ్గర ఉంచుకుంటే అది శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుందనే వాదనలు ఉన్నాయి. జైల్లో వేస్తారని.. న్యాయపరమైన చిక్కులు తప్పవన్న సందేహాలు ఉన్నాయి. 2016లో నోట్ల రద్దు జరిగిన తరువాత 500, 1000 నోట్లను ఎవరైనా ఉంచుకున్నట్టు బయటపడితే వారికి 10వేల రూపాయల జరిమానా, జైలు శిక్ష విధించే నిబంధనను తీసుకొచ్చింది. ఇప్పుడు 2వేల నోటు విషయంలోనూ అదే వర్తిస్తుందన్న అభిప్రాయాలున్నాయి. 2016లో ఏర్పడిన ఈ చట్టం ఇప్పుడు కూడా వర్తిస్తుందట.

గడువులోగా వేర్వేరు కారణాలతో 2వేల నోట్లను మార్చుకోని వారికి ఆర్‌బీఐ మరికొంత గడువు ఇచ్చే అవకాశమూ లేకపోలేదు. నగదు మార్పిడికి అంగీకరించనప్పటికీ.. డిపాజిట్‌ చేసుకోవడానికి మాత్రం మరో ఛాన్స్‌ ఇవ్వొచ్చని తెలుస్తోంది. అది కేవైసీ చేసిన బ్యాంక్‌ అకౌంట్లలో మాత్రమే డిపాజిట్‌ చేసేలా నిబంధన విధించవచ్చని సమాచారం. 2వేల నోట్ల గురించిన సమాచారం ప్రకారం 24వేల కోట్లు విలువ చేసే 2వేల రూపాయల నోట్లు ఇంకా వాపస్ రాలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నోట్ల మార్పిడి లేదంటే నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి సమయాన్ని పొడిగించే అవకాశం ఉందా లేదా అన్నది త్వరలోనే తెలియనుంది. ఫైనల్‌గా ఎవరి దగ్గరైనా 2వేల రూపాయల నోట్లు ఉంటే వాటిని గడువులోగా మార్పు చేసుకోవాలంటున్నారు విశ్లేషకులు.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!