Visa Apply: ఆన్‌లైన్ యాప్స్‌తో వీసా పొందడం చాలా సులభం.. ఎలాగో తెలుసుకోండి

విదేశాలకు వెళ్లడం అనేది చాలామంది కల. కానీ దానికోసం కావలసిన వీసా పొందడంలో చాల ఇబ్బందులు ఉంటాయి. దానికోసం చాలా డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. ఏదోలా కష్టపడి అన్నిటినీ సిద్ధం చేసుకుని వీసా కోసం అప్లై చేసినా కానీ, వీసా దొరుకుతుంది అనే గ్యారెంటీ లేదు. అలాంటి సందర్భాలలో ఆన్‌లైన్ వీసా అప్లికేషన్ ప్లాట్‌ఫారమ్‌లు ఒక వరం లాంటివి. 2032 నాటికి గ్లోబల్ ఇ-వీసా మార్కెట్ విలువ $4 బిలియన్ (4.03 బిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా వేశారు. దీనిని పరిగణనలోకి తీసుకుంటే, ఆన్‌లైన్ వీసా అప్లికేషన్..

Visa Apply: ఆన్‌లైన్ యాప్స్‌తో వీసా పొందడం చాలా సులభం.. ఎలాగో తెలుసుకోండి
Online Visa
Follow us
Subhash Goud

|

Updated on: Sep 28, 2023 | 2:31 PM

సురేష్ దుబాయ్ వెళ్లాలనుకుంటున్నాడు. దాని కోసం E-వీసా సిస్టమ్ ద్వారా UAE వీసా కోసం అప్లై చేసుకున్నాడు. కానీ కొన్ని ఇబ్బందుల కారణంగా అనేక ప్రయత్నాల తర్వాత కూడా అప్లికేషన్ పని పూర్తి కాలేదు. అతని స్నేహితుడు ఒకరి దగ్గర ఈ విషయాన్ని చెప్పినపుడు ఇప్పుడు అనేక ఆన్‌లైన్ వీసా అప్లికేషన్ ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉన్నాయని చెప్పాడు. ఇవి వీసాను సులభంగా పొందడంలో సహాయపడతాయని వివరించాడు. సురేష్ అటువంటి ప్లాట్‌ఫారమ్ ద్వారా అప్లై చేసుకున్నాడు. ఆ తరువాత కేవలం మూడు రోజుల్లోనే వీసా అందుకున్నాడు. అయితే ఈ వీసా ప్లాట్‌ఫారమ్‌లు ఏమిటి? అవి ఎలా పని చేస్తాయి? వాటి వలన ఉండే లాభాలు.. ఇబ్బందులు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.

విదేశాలకు వెళ్లడం అనేది చాలామంది కల. కానీ దానికోసం కావలసిన వీసా పొందడంలో చాల ఇబ్బందులు ఉంటాయి. దానికోసం చాలా డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. ఏదోలా కష్టపడి అన్నిటినీ సిద్ధం చేసుకుని వీసా కోసం అప్లై చేసినా కానీ, వీసా దొరుకుతుంది అనే గ్యారెంటీ లేదు. అలాంటి సందర్భాలలో ఆన్‌లైన్ వీసా అప్లికేషన్ ప్లాట్‌ఫారమ్‌లు ఒక వరం లాంటివి. 2032 నాటికి గ్లోబల్ ఇ-వీసా మార్కెట్ విలువ $4 బిలియన్ (4.03 బిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా వేశారు. దీనిని పరిగణనలోకి తీసుకుంటే, ఆన్‌లైన్ వీసా అప్లికేషన్ ప్లాట్‌ఫారమ్‌ల ఇంపార్టెన్స్ ఎక్కువ కావచ్చు.

Atlys, ivisa.com, Visa2Fly.. వంటి అనేక ఆన్‌లైన్ వీసా దరఖాస్తు ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. ఇవి టూరిస్ట్ వీసాలు పొందే పనిని చాలా సులభతదరం ఈజీ చేశాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌లు వీసా అప్లికేషన్ ప్రాసెస్‌ను సులభతరం చేస్తాయి. అప్లై చేసుకోవడంలో ఉండే గందరగోళం అలాగే కాంప్లికేషన్స్ ను తొలగిస్తాయి, విదేశీ ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తెస్తాయి. అనేక యాప్‌లు టూరిస్ట్ వీసాలు మాత్రమే కాకుండా బిజినెస్ అలాగే ట్రాన్సిటివ్ వీసాలు పొందడంలో కూడా సహాయపడతాయి. అయితే ఈ ప్లాట్‌ఫారమ్‌లు ఎలా పని చేస్తాయో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

ముందుగా, మీరు లాగిన్ IDని క్రియేట్ చేయాలి. ఆపై సెర్చ్ బాక్స్‌లో మీకు వీసా కావాల్సిన దేశం కోసం వెతకాలి. ఆ తరువాత వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్లాట్‌ఫారమ్‌లలో డాక్యుమెంట్స్ స్కాన్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం యాప్ గైడెన్స్ ఇస్తూ వస్తుంది. దాని ప్రకారం మీరు కావలసిన ఇన్ పుట్స్ ఇస్తే ఇది వీసా అప్లికేషన్ ప్రాసెస్ ఈజీగా చేసేస్తుంది. మీరు యాప్‌లో అవసరమైన ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్స్ ఒక్కసారి సేవ్ చేస్తే.. తరువాత మీరెప్పుడు విదేశాలకు వెళ్లాలన్నా మీరు వెళ్లాలని అనుకుంటున్న దేశం పేరు.. జర్నీ డేట్స్, అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. చాలా యాప్‌లు యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌లను కలిగి ఉంటాయి. అవి ప్రాసెస్ మొత్తంలో మీకు ఈజీగా గైడ్ చేస్తాయి. అలాగే ఆ యాప్స్‌కి సంబంధించిన సపోర్ట్ టీమ్ కూడా కస్టమర్స్ ప్రశ్నలు, సమస్యలపై వెంటవెంటనే పరిష్కారాలను అందిస్తాయి.

ఈ ప్లాట్‌ఫారమ్‌ల ప్రయోజనాల గురించి చూస్తే కనుక మీరు మీ వీసాను ఎప్పుడు అందుకుంటారో అంచనా వేయడానికి వారు మిలియన్ల కొద్దీ డేటా పాయింట్‌లను ఉపయోగించుకుంటారు. ఇది వీసా రిజెక్ట్ రేట్ ను తగ్గిస్తుంది. అలాగే, వీసా ఎప్పటిలోగా పొందగలరనే హామీని కూడా నిర్ధారిస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లతో వచ్చే ఇబ్బందుల గురించి చెప్పుకుంటే కనుక చాలా సందర్భాలలో మీకు ఏవైనా సమస్యలు ఎదురైతే.. మీరు ఇమెయిల్ ద్వారా మాత్రమే కస్టమర్ కేర్‌ను సంప్రదించగలరు. అలాంటి సందర్భాలలో ఎవరికైనా అత్యవసరంగా సహాయం అవసరమైతే, ఈ ప్రాసెస్ స్లోగా ఉండవచ్చు. ఈ యాప్‌లు గ్యారెంటీ ఆన్-టైమ్ సర్వీస్‌లను అందిస్తామని చెబుతున్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో కొంచెం ఆలస్యం జరగవచ్చు. అంతేకాకుండా మీ వీసా అప్లికేషన్ రిజెక్ట్ అయితే ఎందుకు అలా జరిగింది అనే స్పష్టమైన కారణాన్ని యాప్స్ చెప్పలేకపోవచ్చు. దీనికోసం సంబంధిత అధికారులను సంప్రదించమని సూచించే అవకాశం ఉంటుంది. ఇది మరింత ఆలస్యం కావడానికి కారణం కావచ్చు. అలాగే డైరెక్ట్ వీసా దరఖాస్తుల ఫీజులతో పోలిస్తే, యాప్ ల ద్వారా వీసా కోసం చేసే ప్రయత్నంలో కొంచెం ఖర్చు ఎక్కువ కావచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..