AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani: ఎలాంటి జీతం లేకుండానే పని చేస్తున్న అంబానీ వారసులు

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన వివిధ శాఖలకు బాధ్యులైన ఈ ముగ్గురికి ఎలాంటి వేతనాలు లేవు. అయితే బోర్డు, కమిటీ సమావేశాలకు హాజరు కావడానికి రుసుములు, ఇతర వేతనాలు మాత్రమే అందించనున్నారు. ఈ మేరకు షేర్‌ దారులకు పంపిన రిజల్యూషన్‌లో కంపెనీ వెల్లడించింది. బోర్డు డైరెక్టర్లుగా నియామకం కోసం ఆమోదం కోరే వాటాదారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఆమోదించడానికి అనుమతించబడతారు..

Mukesh Ambani: ఎలాంటి జీతం లేకుండానే పని చేస్తున్న అంబానీ వారసులు
Mukesh Ambani
Follow us
Subhash Goud

|

Updated on: Sep 27, 2023 | 8:18 PM

రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) డైరెక్టర్ల బోర్డులో ముకేశ్ అంబానీ ముగ్గురు కుమారులను నియమితులైన విషయం తెలిసిందే. ఈ బోర్డులో అనంత్ అంబానీ, ఇషా అంబానీ, ఆకాష్ అంబానీలను కంపెనీ బోర్డులో నియమించేందుకు వాటాదారుల అనుమతి కోరింది. దీనికి సంబంధించి ఆర్‌ఐఎల్‌ తీర్మానం చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన వివిధ శాఖలకు బాధ్యులైన ఈ ముగ్గురికి ఎలాంటి వేతనాలు లేవు. అయితే బోర్డు, కమిటీ సమావేశాలకు హాజరు కావడానికి రుసుములు, ఇతర వేతనాలు మాత్రమే అందించనున్నారు. ఈ మేరకు షేర్‌ దారులకు పంపిన రిజల్యూషన్‌లో కంపెనీ వెల్లడించింది. బోర్డు డైరెక్టర్లుగా నియామకం కోసం ఆమోదం కోరే వాటాదారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఆమోదించడానికి అనుమతించబడతారు.

RIL బోర్డు లో, నిఖిల్, హితల్ వంటి ముఖేష్ అంబానీ బంధువులు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు గా ఉన్నారు. వీరందరికీ జీతం, కమీషన్, ఇతర అలవెన్సులు లభిస్తాయి. అంబానీ ముగ్గురు పిల్లలకు జీతం లేదు. గత 2-3 సంవత్సరాలుగా ముఖేష్ అంబానీ స్వయంగా ఎటువంటి జీతం తీసుకోలేదు. వచ్చే ఐదేళ్లపాటు ఆయన చైర్మన్‌గా, సీఈవోగా కొనసాగుతారు. అయితే జీతం మాత్రం అందుకోరు. సమావేశానికి వచ్చినప్పుడు, అలాగే కొన్ని  అలవెన్స్ తో కూడినవి మాత్రమే అందుకుంటారు.

ముఖేష్ అంబానీ తన విశాలమైన రిలయన్స్ సామ్రాజ్యాన్ని తన ముగ్గురు పిల్లలకు పంచారు. 31 ఏళ్ల ఇషా అంబానీ రిటైల్ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్నారు. 31 ఏళ్ల ఆకాష్ అంబానీ టెలికాం విభాగానికి సారథ్యం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా, అత్యంత పిన్న వయస్కుడైన 28 ఏళ్ల అనంత్ అంబానీకి కొత్త ఇంధన వ్యాపారం బాధ్యతలు అప్పగించారు.

ఇవి కూడా చదవండి

ఈ ముగ్గురికీ షేర్ ప్రాపర్టీలు ఉన్నాయి. ఆర్‌ఐఎల్ బోర్డుకు డైరెక్టర్‌గా నియమితులైతే, బోర్డు సమావేశాలకు హాజరైతే అతనికి వేతనం, భత్యం లభిస్తుంది. కంపెనీకి లాభం వస్తే కమీషన్ వస్తుంది.

అయితే ముఖేష్‌ అంబానీ ముగ్గురు పిల్లలు గత ఏడాదే రిలయన్స్‌ కంపెనీలో కీలక బాధ్యత పోషిస్తున్నారు. అయితే ఈ ఏడాది రిలయన్స్‌ బోర్డులోకి అనుతించారు. గత నెలలో రిలయన్స్ వార్షిక సమావేశం (AGM) జరుగగా,అందులో ఇషా అంబానీ, అనంత్‌, ఆకాశ్‌ అంబానీలను బోర్డు సభ్యులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బోర్డులో నియామకమైన వీరు డైరెక్టర్స్‌ హోదాలో పని చేయనున్నారు.

అతని తల్లి నీతా అంబానీ 2014 సంవత్సరం లో ఆర్‌ఐఎల్‌ బోర్డులో నియమితులయ్యారు. వారికి జీతం కూడా లేదు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బోర్డు సమావేశానికి హాజరైనందుకు నీతా అంబానీకి పారితోషికం కింద రూ.6 లక్షలు. కమీషన్ కింద రూ.2 కోట్లు చెల్లించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి