AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank CEO: ఆటో డ్రైవర్ ఖాతాలో రూ.9 వేల కోట్లు జమ.. ఆ బ్యాంక్ సీఈవో రాజీనామా!

వ్యక్తిగత కారణాల వల్ల ఎస్‌ కృష్ణన్‌ టీఎంబీ సీఈవో పదవికి రాజీనామా చేసినట్లు బ్యాంక్‌ తెలిపింది. ఎస్ కృష్ణన్ 4 సెప్టెంబర్ 2022న తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా నియమితులయ్యారు. వ్యక్తిగత కారణాలతో బ్యాంకు ఎండీ, సీఈవో ఎస్‌ కృష్ణన్‌ సెప్టెంబర్‌ 28న రాజీనామా చేశారు. బ్యాంక్ బోర్డు మీటింగ్‌లో ఆయన రాజీనామాను ఆమోదించి ఆర్‌బీఐకి పంపారు. రిజర్వ్ బ్యాంక్..

Bank CEO: ఆటో డ్రైవర్ ఖాతాలో రూ.9 వేల కోట్లు జమ.. ఆ బ్యాంక్ సీఈవో రాజీనామా!
Bank
Subhash Goud
|

Updated on: Sep 29, 2023 | 3:34 PM

Share

తూత్తుకుడి కేంద్రంగా పనిచేస్తున్న తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (టీఎంబీ- తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్) సీఈవో, ఎండీ ఎస్ కృష్ణన్ రాజీనామా చేశారు. వారం రోజుల క్రితం ఈ బ్యాంకు నుంచి చెన్నైలోని ఓ ట్యాక్సీ డ్రైవర్ ఖాతాకు రూ.9 వేల కోట్ల నగదు బదిలీ అయిందన్న వార్త దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఆ కారణంగా సీఎం రాజీనామా చేశారో లేదో తెలియదు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఎస్‌ కృష్ణన్‌ టీఎంబీ సీఈవో పదవికి రాజీనామా చేసినట్లు బ్యాంక్‌ తెలిపింది. ఎస్ కృష్ణన్ 4 సెప్టెంబర్ 2022న తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా నియమితులయ్యారు. వ్యక్తిగత కారణాలతో బ్యాంకు ఎండీ, సీఈవో ఎస్‌ కృష్ణన్‌ సెప్టెంబర్‌ 28న రాజీనామా చేశారు. బ్యాంక్ బోర్డు మీటింగ్‌లో ఆయన రాజీనామాను ఆమోదించి ఆర్‌బీఐకి పంపారు. రిజర్వ్ బ్యాంక్ నుండి తదుపరి సలహాలు లేదా మార్గదర్శకత్వం వచ్చే వరకు కృష్ణన్ ఎండీ, సీఈవోగా కొనసాగుతారు అని టీఎంబీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఒక ఫైలింగ్‌లో తెలిపింది.

కృష్ణన్ తన రాజీనామా లేఖలో ఏం చెప్పారు?

‘నా పదవీకాలం ఇంకా మూడేండ్లు ఉన్నప్పటికీ, వ్యక్తిగత కారణాల వల్ల బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. బ్యాంకులో పూర్తిస్థాయి డైరెక్టర్‌ ఒక్కరే ఉన్నారని, ఈ విషయంలో ఆర్‌బీఐ మార్గదర్శకత్వం కోరుతున్నామని సీఈవో ఎస్‌ కృష్ణన్‌ తెలిపారు. ఎస్ కృష్ణన్ తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ సీఈఓగా నియమితులయ్యే ముందు అనేక ఇతర బ్యాంకుల్లో ఉన్నత పదవులను చేపట్టారు. అతను 2017 నుంచి 2020 వరకు సిండికేట్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత కెనరా బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో సీఈవోగా పనిచేశారు.

ఇవి కూడా చదవండి

ఆటోరిక్షా డ్రైవర్ ఖాతాలో బ్యాంకు రూ.9,000 కోట్లు జమ:

గత వారం రోజుల క్రితం తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ చెన్నై శాఖ ఒక టాక్సీ డ్రైవర్ ఖాతాకు రూ.9,000 కోట్ల ను బదిలీ చేసింది. ఇది బ్యాంకింగ్ రంగానికి పెద్ద షాక్ ఇచ్చింది. ఈ వార్త పెద్ద ఎత్తున వైరల్‌ అయ్యింది. బ్యాంకు పొరపాటు జరిగినా.. ఇంకేదైనా ఈ లావాదేవీ బ్యాంకుకు పెద్ద షాకిచ్చినట్లయ్యింది. ఇంత పెద్ద మొత్తంలో పొరపాటున టాక్సీ డ్రైవర్‌ ఖాతాలోకి వెళ్లడం సంచలనం సృష్టించింది. అయితే ఈ విషయంపై బ్యాంకు వివరణ ఇచ్చింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ పొరపాటు జరిగిందని సదరు బ్యాంకు వివరించింది. అయితే ఈ పొరపాటును మాత్రం త్వరగానే గుర్తించినట్లు బ్యాంకు తెలిపింది. డ్రైవర్ ఖాతాకు బదిలీ అయిన రూ.9000 కోట్లను రికవరీ చేసినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి