Minor Gifting: మైనర్లకు ఇచ్చిన గిఫ్ట్‌పై టాక్స్ రూల్స్ ఏం చెబుతున్నాయి..?

ప్రాపర్టీ పై వచ్చే అద్దెతో తన నెలవారీ ఆదాయం స్థిరపడింది. రెండోది పిల్లవాడి భవిష్యత్ కి ఇబ్బంది లేని ఏర్పాటు జరిగింది. ఇక మూడోది ప్రాపర్ట్ పిల్లవాడి పేరుమీద ఉండడం వలన తనకు అద్దెపై వచ్చే ఆదాయాన్ని తన ఆదాయంతో యాడ్ చేయరు. అందువలన తానూ ఎక్కువ టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అయితే.. అతని ఆలోచన తప్పు అని తేలింది. అతని స్నేహితుడు ఒకరు ప్రాపర్టీ పిల్లల పేరుపై గిఫ్ట్ గా ఇచ్చినా దానిపై వచ్చే అద్దె ఆదాయానికి టాక్స్ చెల్లించాల్సిందే అని చెప్పారు. దీంతో విజయ్ ఆనందం ఆవిరి అయిపోయింది..

Minor Gifting: మైనర్లకు ఇచ్చిన గిఫ్ట్‌పై టాక్స్ రూల్స్ ఏం చెబుతున్నాయి..?
Minor Gifting
Follow us
Subhash Goud

|

Updated on: Sep 28, 2023 | 4:54 PM

కొన్నిరోజుల క్రితం వరకూ విజయ్ చాలా సంతోషంగా ఉండేవాడు. ఎందుకంటే, అతను తన కొడుకు భవిష్యత్ భద్రంగా ఉండేలా ఏర్పాటు చేశాడు. అతనికి కొంత ప్రాపర్టీ ఉంది. దానిని అతను తన 12 ఎల్లా కొడుకుకు గిఫ్ట్ గా ఇచ్చాడు. దీనివలన అతనికి మూడు ప్రయోజనాలు ఉంటాయని లెక్క వేశాడు. మొదటిది.. ప్రాపర్టీ పై వచ్చే అద్దెతో తన నెలవారీ ఆదాయం స్థిరపడింది. రెండోది పిల్లవాడి భవిష్యత్ కి ఇబ్బంది లేని ఏర్పాటు జరిగింది. ఇక మూడోది ప్రాపర్ట్ పిల్లవాడి పేరుమీద ఉండడం వలన తనకు అద్దెపై వచ్చే ఆదాయాన్ని తన ఆదాయంతో యాడ్ చేయరు. అందువలన తానూ ఎక్కువ టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అయితే.. అతని ఆలోచన తప్పు అని తేలింది. అతని స్నేహితుడు ఒకరు ప్రాపర్టీ పిల్లల పేరుపై గిఫ్ట్ గా ఇచ్చినా దానిపై వచ్చే అద్దె ఆదాయానికి టాక్స్ చెల్లించాల్సిందే అని చెప్పారు. దీంతో విజయ్ ఆనందం ఆవిరి అయిపోయింది. ప్రాపర్టీ గిఫ్ట్ గా ఇచ్చినప్పటికీ విజయ్ స్వంత జేబు నుంచి ఎందుకు టాక్స్ పే చేయాల్సి వస్తుంది? ఇది అతని అవగాహనకు మించినది. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు మనం అర్ధం చేసుకుందాం.

ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50 వేల కంటే ఎక్కువ ఖరీదైన గిఫ్ట్ పొందినట్లయితే టాక్స్ కట్టాలి. ఈ టాక్స్ గిఫ్ట్ తీసుకున్న వ్యక్తి కట్టాల్సి ఉంటుంది. అయితే, ఆదాయ పన్ను చట్టం కింద ‘బంధువు’ నిర్వచనం పరిధిలోకి వచ్చే వ్యక్తుల నుంచి వచ్చిన ఏదైనా విలువ గల బహుమతులపై పన్ను ఉండదు. బంధువు నిర్వచనంలో జీవిత భాగస్వామి, సోదరుడు లేదా సోదరి, తల్లి లేదా తండ్రి, జీవిత భాగస్వామి తల్లిదండ్రులు ఉన్నారు. విజయ్ తన కొడుక్కి ఆస్తిని కానుకగా ఇచ్చాడు. అలాంటి పరిస్థితిలో ఆస్తిని బహుమతిగా ఇచ్చేటప్పుడు ఇద్దరికీ ఎలాంటి పన్నుల భారం ఉండదు.

ఇప్పుడు విజయ్ తన కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్ పై ఎప్పుడు – ఎందుకు పన్ను చెల్లించాలి అనే ప్రశ్న వస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తి సొంతంగా డబ్బు సంపాదించినప్పుడు మాత్రమే పన్ను విధిస్తారు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో మరొకరు సంపాదించినప్పుడు కూడా ఆ ఆదాయం మీ ఇన్ కమ్ కి యాడ్ చేస్తారు. ఇలా మీ ఇన్ కమ్ కి వేరొకరి ఆదాయం యాడ్ చేయడం జరిగితే దాన్ని క్లబ్బింగ్ ఆఫ్ ఇన్ కమ్ లేదా ఇన్ కమ్ క్లబ్బింగ్ అంటారు. క్లబ్బింగ్ కు సంబంధించిన రూల్స్ ఆదాయ పన్ను చట్టంలోని 60 నుంచి 64 సెక్షన్‌లలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

సెక్షన్ 64 జీవిత భాగస్వామి లేదా మైనర్ పిల్లల సంపాదన అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల సంపాదన మీ ఆదాయానికి ఎప్పుడు, ఎలా యాడ్ అవుతుంది అనే దాని గురించి చెబుతుంది. సెక్షన్ 64(1A) మైనర్ పిల్లల సంపాదనను కవర్ చేస్తుంది. ఇందులో సవతి పిల్లలు అలాగే దత్తత తీసుకున్న పిల్లలు కూడా వస్తారు.

సెక్షన్ 64 (1A) ప్రకారం.. మైనర్ పిల్లవాడు ఏదైనా సంపాదన కలిగి ఉంటే.. అది అతని తల్లిదండ్రుల సంపాదనకు యాడ్ అవుతుంది. తల్లిదండ్రుల్లో ఎవరికైనా అంటే తల్లి లేదా తండ్రి ఎక్కువ సంపాదన కలిగి ఉంటారు. పిల్లల సంపాదన అతని ఆదాయానికి యాడ్ అవుతుంది. తల్లిదండ్రులు విడాకులు తీసుకుంటే.. పిల్లల ఆదాయం అతని చట్టపరమైన సంరక్షకుడితో ముడి పడి ఉంటుంది. పిల్లవాడు యుక్తవయస్సు వచ్చేంత వరకు ఆదాయాన్ని క్లబ్ చేయడం కంటిన్యు అవుతుంది. అతనికి యుక్తవయస్సు వచ్చిన తర్వాత, ఈ ఆదాయం అతని సొంత ఆదాయంగా పరిగణిస్తారు. దానిప్రకారం పన్ను పరిధిలోకి వస్తుంది. మైనర్ పిల్లల ఆదాయాన్ని తల్లి లేదా తండ్రి ఆదాయానికి యాడ్ కాకుండా ఉండే అవకాశం ఉందా? అంటే ఉంది. ఆదాయ పన్ను చట్టం కింద అలాంటి మూడు పరిస్థితులు ఉన్నాయి.

మొదటిది, సెక్షన్ 80Uలో పేర్కొన్న వైకల్యంతో బాధపడుతున్న పిల్లల ఆదాయం తల్లి లేదా తండ్రి ఆదాయానికి యాడ్ కాదు. రెండవది పిల్లవాడు ఏదైనా మాన్యువల్ పని చేయడం ద్వారా సంపాదిస్తే, అటువంటి ఆదాయం తల్లిదండ్రుల ఆదాయానికి కూడా యాడ్ అవదు. మూడవది మీ చిన్నారి ఏదైనా గేమ్ షో లేదా యాక్టివిటీలో పాల్గొని, అతని నైపుణ్యం లేదా ప్రతిభ ద్వారా ఏదైనా ఆదాయాన్ని సంపాదిస్తే, ఈ సంపాదన తల్లిదండ్రుల ఆదాయానికి యాడ్ చేయరు.

విజయ్ లానే, మీరు కూడా మీ ఆదాయాన్ని దాచాలనే ఉద్దేశ్యంతో మీ మైనర్ బిడ్డ లేదా భార్య పేరు మీద ఆస్తిని కొనుగోలు చేసినా లేదా FD చేసినా, దాని నుంచి వచ్చే రాబడిపై మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఆపై క్లబ్బింగ్ నిబంధనను గుర్తుంచుకోండి. మీరు అటువంటి ఆదాయంపై పన్ను చెల్లించాల్సి రావచ్చు. ఇంకో విషయం గుర్తుంచుకోండి.. ఇలా పన్ను ఆదా చేస్తే పన్ను ఎగవేతగా భావించి జరిమానా చెల్లించాల్సి రావచ్చు. అంతే కాదు లీగల్ సమస్యకు కూడా దారితీయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి