Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్లే ఆఫర్లు.. ఏకంగా 90శాతం వరకూ డిస్కౌంట్.. సేల్ ఎప్పటి నుంచి అంటే..

Flipkart Big Billion Days Sale 2023: వారం రోజుల పాటు కొనసాగే ఆన్‌లైన్ సేల్ అక్టోబర్ 8న మన దేశంలో ప్రారంభమవుతోంది. దీనిలో అందించే ప్రధాన డీల్స్ వివరాలను ఫ్లిప్ కార్ట్ సంస్థ టీజర్ లో రీవీల్ చేసింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కాగా మునుపటి సంవత్సరాల మాదిరిగానే, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు 24 గంటల ముందుగానే అందులోని ఆఫర్లను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్లే ఆఫర్లు.. ఏకంగా 90శాతం వరకూ డిస్కౌంట్.. సేల్ ఎప్పటి నుంచి అంటే..
Flipkart Big Billion Days Sale 2023Image Credit source: Flipkart
Follow us
Madhu

| Edited By: TV9 Telugu

Updated on: Sep 28, 2023 | 5:48 PM

ఆన్ లైన్ ఆఫర్ల జాతర మొదలైంది. పండుగ సీజన్లో ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న కొనుగోలుదారులకు ఈ-ప్లాట్ ఫారం దిగ్గజాలు శుభవార్తను చెప్పాయి. ఇప్పటికే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 త్వరలో తీసుకొస్తున్నట్లు ప్రకటించగా.. ఒక అడుగు ముందుకేసిన ఫ్లిప్ కార్ట్ సంస్థ తన బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 డేట్లను అధికారికంగా ప్రకటించింది. వారం రోజుల పాటు కొనసాగే ఆన్‌లైన్ సేల్ అక్టోబర్ 8న మన దేశంలో ప్రారంభమవుతోంది. దీనిలో అందించే ప్రధాన డీల్స్ వివరాలను ఫ్లిప్ కార్ట్ సంస్థ టీజర్ లో రీవీల్ చేసింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కాగా మునుపటి సంవత్సరాల మాదిరిగానే, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు 24 గంటల ముందుగానే అందులోని ఆఫర్లను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

బిగ్ బిలియన్ సేల్ ఇలా..

ఈ సంవత్సరం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2023 సేల్ ను అక్టోబర్ 8న ప్రారంభిస్తోంది. అక్టోబర్ 15 వరకు కొనసాగునుంది. ఎప్పటిలాగే, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు సేల్‌కి ఒకరోజు ముందస్తు యాక్సెస్‌ను పొందుతారు. ఈ సేల్ ఈవెంట్ స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీలు, స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలపై 80 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఫ్యాషన్ ఉత్పత్తులపై 90 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే బ్యూటీ, గృహాలంకరణ, క్రీడా వస్తువులపై కూడా 80 శాతం వరకు తగ్గింపుతో లభిస్తాయి.

వీటిపై ఆఫర్లు..

ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ వందలాది ఉత్పత్తులపై అద్భుతమైన డీల్‌, ఆఫర్‌లను అందిస్తోంది. మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్‌లు, స్మార్ట్ టీవీలపై అదిరే పోయే తగ్గింపు ధరలు ఉండనున్నాయి. మరికొన్ని కొత్త ఉత్పత్తులు లాంచ్ కాబోతున్నాయి. పలు ఆఫర్లు, తగ్గింపు ధరలతో పటు ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్‌లు పలు ఆఫర్లను ప్రకటించాయి. ఈ బ్యాంకులకు సంబంధించిన కార్డుల సాయంతో లావాదేవీలు జరిపినా లేక ఈఎంఐ ఆప్షన్లు ఎంచుకున్నా తక్షణ తగ్గింపులు లభిస్తాయి. ఇంకా, ఆసక్తిగల కొనుగోలుదారులు పేటీఎం ఆధారిత ఆఫర్‌లను పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపులు..

ఈ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్లో యాపిల్, ఐకూ, వన్ ప్లస్, శామ్సంగ్, రియల్ మీ, జియోమీ, మోటోరోలా వంటి బ్రాండ్ ఫోన్లపై భారీ తగ్గింపులు ఉన్నాయి. ముఖ్యంగా మోటో జీ54 5జీ, శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ, రియల్ మీ సీ51, రియల్ మీ 11 5జీ, రియల్ మీ 11ఎక్స్ 5జీ, ఇన్ఫినిక్స్ జీరో 30 5జీ, మోటో జీ84 5జీ, వివో వీ29ఈ, పోకో వీ29ఈ వంటి స్మార్ట్ ఫోన్లపై మంచి డిస్కౌంట్లు ఉన్నాయి. అంతేకాకుండా, ఐఫోన్ 14 సిరీస్, ఐఫోన్ 13 లైనప్, గెలాక్సీ ఎస్ 23 అల్ట్రాపై కూడా తగ్గింపులు ఉంటాయి.

కొత్తగా లాంచ్ అయిన ఫోన్లపై కూడా..

ఈ ఫ్లిప్ కార్ట్ సేల్లో ఇటీవల కొత్తగా లాంచ్ అయిన మోటో ఎడ్జ్ 40 నియో, వివో టీ2 ప్రో 5జీ, శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈలు మన దేశంలో మొదటి సారి అమ్మాకానికి ఈ సేల్ సందర్బంగా ఆఫర్ ధరకు లభించనున్నాయి. అలాగే అక్టోబర్ 4న లాంచ్ కానున్న వివో వీ29 సిరీస్ కూడా ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులోకి రానుంది.

బ్యాంక్ ఆఫర్లు ఇలా..

ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మరియు కోటక్ బ్యాంక్ లకు చెందిన డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి చేసే కొనుగోళ్లపై 10 శాతం వరకు తక్షణ తగ్గింపును పొందే అవకాశాన్ని ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. పేటీఎం, యూపీఐ, వ్యాలెట్ లతో చేసే లావాదేవీలపై కూడా మీరు నగదును పొదుపు చేయవచ్చు. వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఫీచర్‌ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంకా, నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..