Online Shopping: పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఆన్‌లైన్ షాపింగ్ చేసినపుడు ఎక్కువ శాతం దాదాపు అందరూ ఆన్‌లైన్ లోనే పేమెంట్స్ చేస్తారు. క్యాష్ ఆన్ డెలివరీ వైపు ఎక్కువ మంది వెళ్ళరు. అయితే, పండుగ సీజన్ ఇలా ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి.. ఆన్‌లైన్ బిజినెస్ యాప్ లకు బిజీ టైం. వీరే కాదు మరో వర్గం కూడా ఈ పండుగ సీజన్ పై కన్నేసి ఉంచుతుంది. అదే సైబర్ నేరగాళ్ల వర్గం. వీరు పండుగ సీజన్ టార్గెట్ చేసుకుని ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారి నుంచి డబ్బు లాగేస్తారు. పండుగ సీజన్ రాకుండానే ఈ ఆర్ధిక మోసాల కేసులు పెరిగాయి. అందుకే ఆన్‌లైన్ షాపింగ్ చేద్దామని..
పండుగ సీజన్ మొదలైంది. ఆన్‌లైన్ షాపింగ్ హంగామా పెరిగింది. ఆన్‌లైన్ లో షాపింగ్ చేసేవారిని ఆకట్టుకోవడానికి ప్రతి వెబ్సైట్ డిస్కౌంట్ ఆఫర్లు.. క్యాష్ బ్యాక్ ఆఫర్లు.. ఇలా రకరకాల తాయిలాలు ఇస్తూ ప్రకటనలు జోరుగా చేస్తున్నాయి. నీల్సన్ మీడియా ఇండియా నివేదిక ప్రకారం.. ప్రతి ఇద్దరు భారతీయుల్లో ఒకరు ఆన్‌లైన్ షాపింగ్‌లో ఎక్కువ ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మెట్రో నగరాల్లో 87 శాతం మంది ఆన్‌లైన్ షాపింగ్‌కు రెడీ అయిపోయారు. టైర్-టూ నగరాల్లో, 86 శాతం మంది ప్రజలు ఆన్‌లైన్ షాపింగ్ చేయాలని ఆసక్తితో ఉన్నారు.
ఆన్‌లైన్ షాపింగ్ చేసినపుడు ఎక్కువ శాతం దాదాపు అందరూ ఆన్‌లైన్ లోనే పేమెంట్స్ చేస్తారు. క్యాష్ ఆన్ డెలివరీ వైపు ఎక్కువ మంది వెళ్ళరు. అయితే, పండుగ సీజన్ ఇలా ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి.. ఆన్‌లైన్ బిజినెస్ యాప్ లకు బిజీ టైం. వీరే కాదు మరో వర్గం కూడా ఈ పండుగ సీజన్ పై కన్నేసి ఉంచుతుంది. అదే సైబర్ నేరగాళ్ల వర్గం. వీరు పండుగ సీజన్ టార్గెట్ చేసుకుని ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారి నుంచి డబ్బు లాగేస్తారు. పండుగ సీజన్ రాకుండానే ఈ ఆర్ధిక మోసాల కేసులు పెరిగాయి. అందుకే ఆన్‌లైన్ షాపింగ్ చేద్దామని అనుకునే వారు మూడు రకాల మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.
మొదటిది QR కోడ్‌లు, OTP షేరింగ్-డెబిట్/క్రెడిట్ కార్డ్ లావాదేవీలకు సంబంధించిన మోసం. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్టార్టప్ FCRF రీసెర్చ్ పేపర్స్ ప్రకారం.. దేశంలో జరుగుతున్న సైబర్ నేరాలలో ఈ మోసాల వాటా 77 శాతం కంటే ఎక్కువ. కోవిడ్ నుంచి దేశంలో దాదాపు ప్రతిచోటా QR కోడ్‌ల ద్వారా పేమెంట్స్ జరుగుతున్నాయి. దీనితో పాటు QR కోడ్‌లకు సంబంధించిన మోసాలు కూడా పెరిగాయి. సైబర్ మోసగాళ్లు సాధారణంగా QR కోడ్‌లను పిక్చర్ షేరింగ్ యాప్‌లు లేదా మెసేజింగ్ సర్వీస్ యాప్‌ల ద్వారా వ్యక్తులకు పంపుతారు. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు – విక్రయించేటప్పుడు QR కోడ్‌ని స్కాన్ చేసి ఉచిత నగదు బహుమతులు – ఇతర బెనిఫిట్స్ కోసం UPI PINని నమోదు చేయండి అనే మెసేజ్ పంపిస్తారు. ఎవరైనా దీనిని నమ్మి పిన్ షేర్ చేస్తే.. అంతేసంగతులు.. వారి బ్యాంకు అకౌంట్ ఖాళీ అయిపోతుంది. ఆన్‌లైన్‌లో నకిలీ ప్రకటనలు ఇస్తూ ప్రజలను ఆకర్షిస్తూ వారిని మోసం చేసే నకిలీ సైట్‌లు ఉన్నాయి.
సైబర్ సెక్యూరిటీ నిపుణుడు కామాక్షి శర్మ మాట్లాడుతూ.. క్యూఆర్ కోడ్‌ను మార్చడంపై చాలా మంది దుకాణదారులు ఫిర్యాదు చేశారని చెప్పారు. నిజానికి సైబర్ దుండగులు షాపులకు వెళ్లి వారి QR కోడ్ ప్లేట్‌లను రహస్యంగా తీసివేస్తారు. వాటి స్థానంలో వారి స్వంత క్యూఆర్ కోడ్ ప్లేట్లు లేదా సౌండ్ బాక్స్‌లను ఉంచుతారు. ఇప్పుడు కస్టమర్ చేసిన పేమెంట్ షాప్ అకౌంట్‌కి వెళ్ళాడు. మోసగాడి అకౌంట్‌కి చేరిపోతుంది.
ఇక ఓటీపీ మోసం గురించిచెప్పుకుంటే..ఉద్యోగాలు, సబ్సిడీల పేరుతో నకిలీ ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సృష్టించి ప్రజలను సైబర్ దుండగులు కొల్లగొడుతున్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించడం లేదా ఇంటి నుంచి పని చేయడం పేరుతో మీకు నకిలీ సైట్‌ల లింక్‌ను మెయిల్ లేదా మెసేజ్ ద్వారా పంపిస్తారు. మీ వ్యక్తిగత వివరాలు తీసుకుని… ఆపై ఓటీపీ అడిగి మిమ్మల్ని మోసం చేస్తారు. ఓటీపీ మోసంలో ప్రజలు ఓటీపీని షేర్ చేయమని ప్రాంప్ట్ వస్తుంది. కొన్నిసార్లు ఐటీ రీఫండ్ పేరుతో మరి కొన్నిసార్లు కేవైసీని అప్‌డేట్ చేసే పేరుతో ఈ ఓటీపీ మోసం జరుగుతుంది. సైబర్ ఫ్రాడ్ చేసేవారు షాపింగ్ వెబ్‌సైట్ కస్టమర్ కేర్‌గా నటిస్తూ కాల్ చేస్తారు. కస్టమర్ నమ్మకాన్ని గెలుచుకుంటారు. ఓటీపీని తీసుకుంటారు. దాని ద్వారా కస్టమర్ బ్యాంక్ అకౌంట్‌కు కనెక్ట్ అయిపోతారు. ఇంకేముంది.. అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది.
చాలా సందర్భాల్లో సైబర్ మోసగాళ్లు తాము బ్యాంక్ అఫీషియల్స్ గా పరిచయం చేసుకుంటారు. డెబిట్ కార్డు, ఖాతా వివరాలను అప్ డేట్ చేయకుంటే డెబిట్ కార్డ్ క్లోజ్ చేస్తామని, అకౌంట్ సస్పెండ్ చేస్తామని బెదిరిస్తారు. డెబిట్ కార్డ్ వివరాలు- ఫోన్‌లో వచ్చిన ఓటీపీని షేర్ చేయమని మిమ్మల్ని అడుగుతారు. ఇప్పుడు మీరు OTPని షేర్ చేసిన వెంటనే మోసపోతారు. అయితే సైబర్ మోసగాళ్లకు భారీ డేటాబేస్ ఉంది. దాని ఆధారంగానే మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తిస్తున్నారు. వారు సెర్చ్ ఇంజిన్‌లు లేదా సర్వీస్ పోర్టల్‌ల ప్రకారం డేటాను వేరు చేస్తారు. ఆపై మోసం ఉచ్చును నేస్తారు. ఎలా అంటే.. వారు మీరు దేని కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేశారు? మీరు ఏమి కొనుగోలు చేస్తున్నారు? మీరు ఏ సైట్ లోకి ఎంటర్ అవుతున్నారు? వంటి అన్ని విషయాలను వారు తెలుసుకుంటారు. ఈ వివరాల ఆధారంగా వారు మిమ్మల్ని సంప్రదించి మిమ్మల్ని మోసం చేస్తారు.
సో, మీరు కూడా పండుగ సమయంలో షాపింగ్‌కు సిద్ధమవుతున్నట్లయితే జాగ్రత్తగా ఉండాలి. తెలియని వ్యక్తి లేదా సైట్ లలో ఏ వివరాలు షేర్ చేయవద్దు. తెలియని నంబర్ నుంచి వచ్చిన లింక్‌పై క్లిక్ చేయవద్దు. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మోసపోయిన బాధితుల జాబితాలో మీ పేరు ఎప్పటికీ కనిపించదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి