Hero Karizma XMR: హీరో కరీజ్మా లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఎక్స్‌ఎంఆర్ 210పై కళ్లుచెదిరే ఆఫర్
పెరిగిన టెక్నాలజీ ప్రకారం ఈ బైక్‌ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్నారు. ప్రస్తుతం కరీజ్మా బైక్‌ను కరీజ్మా ఎక్స్‌ఎంఆర్ పేరుతో కొనుగోలుకు సిద్ధంగా ఉంది. ఈ బైక్‌పై హీరో కంపెనీ మంచి తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. హీరో కరిజ్మా ఎక్స్‌ఎంఆర్ 210ని కంపెనీ ప్రారంభ ధర రూ.1.73 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ పొందడానికి సెప్టెంబర్ 30 వరకూ గడువుగా ఉంది. ఈ ఆఫర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
భారతదేశంలో యువత కోసం ప్రత్యేకంగా సూపర్ స్పీడ్ బైక్‌లు రిలీజ్ చేయడం ఇటీవల కాలంలో బాగా ఎక్కువగా ఉంది. అయితే కొన్నేళ్ల క్రితం భారతదేశంలో సూపర్ స్పీడ్ బైక్‌ల లభ్యత అంతగా ఉండేది కాదు. ఒకవేళ ఉన్నా అది కేవలం పట్టణప్రాంతాలకే పరిమితమయ్యేది. అయితే గ్రామీణ ప్రాంతాల వారికి స్పీడ్ బైక్ అంటే కరీజ్మా బైక్ అనేలా హీరో కంపెనీ ఈ బైక్‌ను రిలీజ్ చేసింది. లాంచ్ చేసిన సమయం నుంచి ఈ బైక్ సేల్స్ పరంగా దూసుకుపోతుంది. పెరిగిన టెక్నాలజీ ప్రకారం ఈ బైక్‌ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్నారు. ప్రస్తుతం కరీజ్మా బైక్‌ను కరీజ్మా ఎక్స్‌ఎంఆర్ పేరుతో కొనుగోలుకు సిద్ధంగా ఉంది. ఈ బైక్‌పై హీరో కంపెనీ మంచి తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. హీరో కరిజ్మా ఎక్స్‌ఎంఆర్ 210ని కంపెనీ ప్రారంభ ధర రూ.1.73 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ పొందడానికి సెప్టెంబర్ 30 వరకూ గడువుగా ఉంది. ఈ ఆఫర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
కరీజ్మా లవర్స్ తమ మోటార్‌సైకిల్‌నుఅధీకృత డీలర్ నెట్‌వర్క్ ద్వారా లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుకింగ్‌లు చేయవచ్చు. బుకింగ్ రుసుము నామమాత్రంగా రూ. 3,000గా కంపెనీ నిర్ణయించింది. ఈ బైక్ సాధారణ రూ.1.8 లక్షలుగా ఉంటే ఈ రెండు రోజుల్లో బుక్ చేసుకున్న వారికి రూ.1.73 లక్షలకే అందుబాటులో ఉంటుంది. అంతేదాదాపు ఈ బైక్‌ను ఈ రెండు రోజుల్లో బుక్ చేసుకుంటే రూ.7 వేలు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ధర వద్ద ఈ బైక్ చాలా మేలైన ధర అని నిపుణుల చెబుతున్నారు. ఈ కొత్త కరిజ్మా ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైందని త్వరలోనే డెలివరీలను ప్రారంభిస్తామని హీరో ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ తాజా కరీజ్మా బైక్ ప్రీమియం పోర్ట్‌ఫోలియో కోసం డీలర్ లైనప్ ఉంటుంది. చాలా ప్రీమియం ఉత్పత్తులు ఇటీవలి కాలంలో మెరుగైన హార్డ్‌వేర్ లేదా కాంపోనరీతో అప్‌డేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ బైక్ ఫీచర్లను ఓసారి తెలుసుకుందాం.
హీరో కరీజ్మా ఎక్స్‌ఎంఆర్ 210 ఫీచర్లు
ఈ తాజా కరిజ్మా కోసం పూర్తిగా భిన్నమైన దిశలో హీరో అనేక ఫీచర్లను మొట్టమొదటిసారి అందిస్తుంది. స్టార్టర్స్ కోసం కొత్త కరిజ్మా ఎక్స్‌ఎంఆర్ డీఓహెచ్‌సీ సెటప్ (డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్), లిక్విడ్-కూల్డ్ ఇంజన్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉన్న మొదటి హీరో బైక్. కొత్త 210 సీసీ ఇంజిన్ 4వీ హెడ్‌ని కలిగి ఉంది. ఇది హీరో కంపెనీ ఇప్పటివరకు అందించిన శక్తివంతమైన ఇంజిన్ అని నిపుణులు పేర్కొంటున్నారు. పనితీరు విషయానికి వస్తే ఈ బైక్ 25.5 పీఎస్ పవర్‌తో 20.4 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో వచ్చే అడ్జస్టబుల్ విండ్‌షీల్డ్, ఆల్ ఎల్‌ఈడీ లైటింగ్, ఆధునిక పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, నావిగేషన్‌తో బ్లూటూత్ కనెక్టివిటీ, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి అధునాతన ఫీచర్లు కొనుగోలుదారులకు మంచి అనుభూతని ఇస్తాయి. ముఖ్యంగా ఈ బైక్ పల్సర్ ఆర్‌ఎస్ 200, యమహా ఆర్ 15 వీ4కు గట్టి పోటినిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి