Hero Karizma: 2023లో హీరో కరిజ్మా న్యూలుక్.. అవతార్ వెర్షన్ చూశారంటే అదిరిపోతారంతే..!
ముఖ్యంగా హీరో కరిజ్మా ఒకప్పుడు దేశంలో పోస్టర్ బైక్ మరియు దీనికి ఇప్పటికీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యూఎస్ మోటార్‌సైకిల్ బ్రాండ్ హార్లే-డేవిడ్‌సన్‌కు మద్దతు ఇచ్చిన తర్వాత హీరో ఆగస్ట్ 29న కొత్త హీరో కరిజ్మా ఎక్స్ 210ని విడుదల చేయడంతో కరిజ్మా బ్రాండ్‌ను పునరుద్ధరిస్తోంది. దీన్ని 'ది లెజెండ్ రిటర్న్స్'గా హీరో కంపెనీ అధికారికంగా టీజర్ విడుదల చేసింది.అయితే ఈ స్పోర్ట్స్ బైక్ సిల్హౌట్‌ను మాత్రమే వెల్లడించినప్పటికీ కరిజ్మా రీ రిలీజ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అయ్యింది.
భారతదేశంలో హీరో బైక్‌లకు ఉన్న క్రేజ్ వేరు. బడ్జెట బైక్స్‌తో పాటు సూపర్ బైక్స్ హీరో సొంతం. ముఖ్యంగా కొన్ని మోడల్స్ హీరో బైక్స్ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. హీరో కరిజ్మా అంటే యువతకు ఎంతో ఇష్టం. ఇది హీరో తన ఐకానిక్ బైక్‌గా పేర్కొంది. తాజాగా హీరో కరిజ్మా ఈ నెలాఖరులో కొత్త, అధునాతన ఫీచర్లతో తిరిగి తీసుకువస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా హీరో కరిజ్మా ఒకప్పుడు దేశంలో పోస్టర్ బైక్ మరియు దీనికి ఇప్పటికీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యూఎస్ మోటార్‌సైకిల్ బ్రాండ్ హార్లే-డేవిడ్‌సన్‌కు మద్దతు ఇచ్చిన తర్వాత హీరో ఆగస్ట్ 29న కొత్త హీరో కరిజ్మా ఎక్స్ 210ని విడుదల చేయడంతో కరిజ్మా బ్రాండ్‌ను పునరుద్ధరిస్తోంది. దీన్ని ‘ది లెజెండ్ రిటర్న్స్’గా హీరో కంపెనీ అధికారికంగా టీజర్ విడుదల చేసింది.అయితే ఈ స్పోర్ట్స్ బైక్ సిల్హౌట్‌ను మాత్రమే వెల్లడించినప్పటికీ కరిజ్మా రీ రిలీజ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అయ్యింది. ఈ తాజా కరిజ్మా బైక్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
హీరో కరిజ్మా దాని స్పోర్టీ లుక్‌తో పాటు ప్రత్యేక పెర్ఫార్మెన్స్ కారణంగా లాంచ్ అయిన వెంటనే ఇండియన్ మార్కెట్లో మొదట్లో పాపులర్‌గా మారింది. ఆ సమయంలో హీరో కరిజ్మా వీధుల్లో అత్యంత ఆకర్షణీయమైన మోటార్‌సైకిళ్లలో ఒకటిగా ఉంది. హీరో కరిజ్మా ఆర్, హీరో కరిజ్మా జెడ్‌ఎంఆర్ వారి ఐకానిక్ ఫెయిరింగ్‌తో కొనుగోలుదారుల నుండి విపరీతమైన ప్రారంభ స్పందనను పొందింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ బైక్‌ను తయారీని నిలిపేశారు. మళ్లీ ఇప్పుడు తాజా బైక్‌ను లాంచ్ చేస్తున్నట్లు పేర్కొనడంతో ఈ బైక్ ప్రియులకు మంచి వార్త అని నిపుణులు చెబుతున్నారు.
ఈ కొత్త కరిజ్మా సిగ్నేచర్ సిల్హౌట్‌ను కలిగి ఉంటుంది. అయితే ఇది కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో వస్తుంది. కరీజ్మా డీఆర్‌ఎల్‌ను పొందుతుంది. అయితే కరీజ్మా కొత్త బైక్ గురించి కంపెనీ అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే ఈ బైక్ 210 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో పని చేస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తుంది. అలాగే ఈ ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేస్తుంది. ఈ బైక్ 25 బీహెచ్‌సీ, 30 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే హీరో కరిజ్మా ఎక్స్‌ఎంఆర్ 210 ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుకవైపు మోనోషాక్‌తో పాటు డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌తో వస్తుంది. ఈ టెక్నాలజీ హీరో మోటార్‌సైకిల్‌కు మొదటిదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే కొత్త హీరో కరిజ్మా ఎక్స్‌ఎమ్‌ఆర్ 210 ధర సుమారు రూ. 1.8 లక్షల ధర ఉంటుందని పేర్కొంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి