AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పాకిస్తాన్ టు ఇండియా వయా నేపాల్.. నాలుగేళ్లుగా హైదరాబాద్‌లో సంసారం.. కట్ చేస్తే..

Hyderabad News: హైదరాబాద్ నగరంలోని కిషన్‌బాగ్ ప్రాంతంలో తన అత్తమామలతో కలిసి ఉండటానికి నవంబర్ 2022లో నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్లుగా తెలుస్తోంది. పాకిస్థాన్ జాతీయుడిని మహమ్మద్ ఫైజ్‌గా గుర్తించిన బహదూర్‌పురా పోలీసులు గురువారం ఆగస్టు 31న అరెస్టు చేశారు. అతడి పాకిస్థాన్ పాస్‌పోర్టులు, ఇతర పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Telangana: పాకిస్తాన్ టు ఇండియా వయా నేపాల్.. నాలుగేళ్లుగా హైదరాబాద్‌లో సంసారం.. కట్ చేస్తే..
Pak National
Sanjay Kasula
|

Updated on: Sep 01, 2023 | 12:44 PM

Share

హైదరాబాద్, సెప్టెంబర్ 01: పాక్‌ యువతి సీమా హైదర్‌ లవ్‌ అంటూ ఉత్తరప్రదేశ్‌ రావడం రావడం సంచలనం అయితే.. ఇప్పుడు ఈ ఫయాజ్‌ కూడా సేమ్ అదే తరహాలో నేపాల్ నుంచే ఎంటరవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. హైదరాబాద్ నగరంలోని కిషన్‌బాగ్ ప్రాంతంలో తన అత్తమామలతో కలిసి ఉండటానికి నవంబర్ 2022లో నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్ జాతీయుడిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని బహదూర్‌పురా పోలీసులు కేసు నమోదు చేశారు. మహమ్మద్ ఫైజా‌ను(24) ఆగస్టు 31న అదుపులోకి తీసుకుని విచారించి.. కేసు నమోదు చేశారు. అతని నుంచి పాస్‌పోర్టు సహా ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

బహదూర్‌పురా పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫక్తున్‌ఖ్వా‌లోని స్వాత్ వ్యాలీకి చెందిన యువకుడిగా పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ నుంచి వర్క్ వీసాపై దుబాయ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అక్కడే కొంత కాలం ఉద్యోగం చేశాడు. అయితే, 2019లో అతనికి హైదరాబాద్ నివాసి నేహా ఫాతిమా(29)తో పరిచయం ఏర్పడింది . ఫైజ్ నేహాకు దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పించేందుకు సహాయం చేశాడు. ఆ తర్వాత వీరు ప్రేమించుకుని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ దంపతులకు మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.

అత్తా మామలతో కలిసి..

ఆ తర్వాత నేహా ఇండియాకు తిరిగొచ్చింది. ఫైజ్ తన భార్య తల్లిదండ్రులు షేక్ జుబేర్, అఫ్జల్ బేగం సహాయంతో దేశంలోకి ప్రవేశించాడని.. వారు అతని కోసం స్థానిక గుర్తింపు పత్రాన్ని పొందుతారని అతనికి హామీ ఇచ్చారని పోలీసులు తెలిపారు. వారు నేపాల్ సరిహద్దులో జుబేర్‌ను స్వీకరించడమే కాకుండా.. మాదాపూర్‌లోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు తీసుకెళ్లి.. మహ్మద్ ఘౌస్ పేరుతో తమ ‘కొడుకు’గా నమోదు చేసుకున్నారు. నకిలీ జనన ధృవీకరణ పత్రాలను అందించడంతో పోలీసులు పట్టుకున్నారు.

కేసు నమోదు చేసి తదుపరి విచారణ..

బహుదూర్పురాలోని అత్తమామల ఇంటి నుంచి అతడిని అరెస్టు చేశారు. అయితే అతని అత్తమామలు జుబేర్, అఫ్జల్ పరారీలో ఉన్నారు. అతడి వద్ద నుంచి పాకిస్థానీ పాస్‌పోర్టు, ఇతర పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్, ఫారినర్స్ యాక్ట్‌లోని సంబంధిత సెక్షన్ల కింద ఫైజ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడి అత్తమామలు పరారీలో ఉన్నారు.

దుబాయ్‌లో కలుసుకుని..

ఫయాజ్ అనే వ్యక్తికి నగరంలో ఓ మహిళతో వివాహమైంది. దుబాయ్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. నగరంలోని బహదూర్‌పురాలో నివాసముంటున్న భార్యను కలిసేందుకు ఫరాజ్‌ కొద్దిరోజుల క్రితం నగరానికి వచ్చాడు. సమాచారం అందుకున్న నగర పోలీసులు అతని పత్రాలను తనిఖీ చేయగా అతని పాస్‌పోర్ట్ మరియు వీసా గడువు ముగిసినట్లు గుర్తించారు. అతనిపై బహదూర్‌పురా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం