హైదరాబాద్‌లోని ఆ ప్రాంతంలో మారిన పరిస్థితులు.. సంతోషం వ్యక్తం చేస్తున్న ఇంటి యజమానులు
వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ సంస్కృతి ఇంటి అద్దెలపై ప్రభావం చూపింది. హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేసే ఐటీ ఎంప్లాయిస్ చాలా వరకు సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇంటి నుంచే ఉద్యోగం చేసే వెసులు బాటు కలగడంతో గ్రామాలకు తిరుగు ప్రయాణం పట్టారు. దీంతో నగరంలో అద్దె ఇల్ల ముందు భారీగా టు లెట్ బోర్డ్స్ వెలిశాయి. ఒక్కసారిగా ఇళ్లన్నీ ఖాళీ కావడంతో తీవ్ర ప్రభావం పడింది...

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్థిక వ్యవస్థ నుంచి ఆరోగ్యం వరకు అన్నింటిపై ప్రభావం పడింది. లాక్‌డౌన్ కారణంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా కరోనా కాటుకు బలైన రంగాల్లో రియల్ ఎస్టేట్ ఒకటి. దాదాపు రెండేళ్లు రియల్ ఎస్టేట్ రంగం కోలుకోని దెబ్బతింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై భారీగా ప్రతికూల ప్రభావం పడింది.
ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ సంస్కృతి ఇంటి అద్దెలపై ప్రభావం చూపింది. హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేసే ఐటీ ఎంప్లాయిస్ చాలా వరకు సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇంటి నుంచే ఉద్యోగం చేసే వెసులు బాటు కలగడంతో గ్రామాలకు తిరుగు ప్రయాణం పట్టారు. దీంతో నగరంలో అద్దె ఇల్ల ముందు భారీగా టు లెట్ బోర్డ్స్ వెలిశాయి. ఒక్కసారిగా ఇళ్లన్నీ ఖాళీ కావడంతో తీవ్ర ప్రభావం పడింది. ఇంటి యజమానులు అద్దె తగ్గించుకునే పరిస్థితి వచ్చింది. అయితే ప్రస్తుతం క్రమంగా పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. కరోనా పూర్తిగా తగ్గిపోవడం, మళ్లీ ఉద్యోగులు ఆఫీసులకు వెళుతుండడంతో ఇంటి అద్దెలకు డిమాండ్ పెరుగుతోంది.
ముఖ్యంగా హైదరాబాద్ వెస్ట్ కారిడార్‌లో ఇంటి అద్దెలు భారీగా పెరిగాయని కొత్త సర్వేలో తేలింది. ఈ ఏడాది జనవరి, జూన్ మధ్య సగటున ఇంటి అద్దెలు 11 శాతం పెరిగాయి. ముఖ్యంగా గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, మాదాపూర్, కూకట్‌పల్లి వంటి ప్రాంతాల్లో ఈ ధోరణి అధికంగా కనిపించింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ యాప్ నో బ్రోకర్ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా నగరంలోని గేటెడ్ కమ్యూనిటీలలో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఐటీ కంపెనీలకు సమీపంలో ఉండడంతో ఈ ప్రాంతాలకు సహజంగానే డిమాండ్ పెరిగింది.




ఈ ప్రదేశాల నుంచి ఆఫీసులకు తక్కువ ప్రయాణ సమయం ఉండడం, మెరుగైన సౌకర్యాలు, భద్రతపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో డిమాండ్ పెరిగినట్లు సర్వేలో తేలింది. పరిస్థితులు మళ్లీ యథా స్థితికి రావడంతో చాలా మంది ఇంటి యజమానులు అద్దెలను పెంచారు. సర్వే ప్రకారం నగరంలో ఇంటి అద్దెలు పెరిగిన నేపథ్యంలో 62 శాతం మంది యజమానులు కొత్త పెట్టుబడులు పెట్టాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే భూముల ధరలు కూడా ఊహించని స్థాయిలో పెరగడంతో తమ ప్రాపర్టీపై మెరుగైన రాబడిని పొందగలమని యజమానులు నమ్ముతున్నారు. ఇక ఈ సెంటిమెంట్ కేవలం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. ఢిల్లీలోనూ కనిపిస్తోంది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..




