Hyderabad: ప్రపంచాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం: సీపీ తరుణ్ జోషి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈసిఐఎల్ ఆఫీసర్స్ కాలనీ నుండి ఎన్ఎఫ్సీ నగర్ వరకు 4 కిమీ వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి ఐపీఎస్ మాట్లాడుతూ.. స్త్రీ పురుష సమానత్వం పునరుద్ఘాటించడానికి, స్త్రీల మీద వివక్షను రూపుమాపే ఉద్దేశంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 4 కిలోమీటర్ వాకింగ్ కార్యక్రమం నిర్వహించామన్నరు.

Hyderabad: ప్రపంచాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం: సీపీ తరుణ్ జోషి
Police Commissioner Rachako
Follow us

| Edited By: TV9 Telugu

Updated on: Mar 05, 2024 | 2:55 PM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈసిఐఎల్ ఆఫీసర్స్ కాలనీ నుండి ఎన్ఎఫ్సీ నగర్ వరకు 4 కిమీ వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి ఐపీఎస్ మాట్లాడుతూ.. స్త్రీ పురుష సమానత్వం పునరుద్ఘాటించడానికి, స్త్రీల మీద వివక్షను రూపుమాపే ఉద్దేశంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 4 కిలోమీటర్ వాకింగ్ కార్యక్రమం నిర్వహించామన్నరు. విద్యారంగం, వైద్యరంగం, శాస్త్ర సాంకేతిక రంగాలు, రక్షణ దళాలు వంటి అన్ని రంగాల్లోనూ మహిళలు తమ ప్రతిభతో పురుషులతో సమానంగా పోటీపడుతున్నారని అన్నారు. ప్రపంచ అభివృద్ధిలో తమ వంతు పాత్ర నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. మహిళల పట్ల వివక్ష ప్రదర్శించడం తగదని, మహిళా హక్కులను కాపాడడం, మహిళలను గౌరవించడం అనేవి ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా వేలమంది పోలీస్ శాఖలో పనిచేస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారని వివరించారు. ప్రతి రిక్రూట్మెంట్‎లోను ఉత్సాహంగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. రాచకొండ మహిళా సిబ్బంది కోసం వారి సంక్షేమం కోసం అవసరమైన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రత్యేకంగా షి టీమ్స్ ద్వారా సమాజంలో స్త్రీలకు ఎదురయ్యే వేధింపుల నుండి రక్షణ కల్పిస్తున్నామని అలాగే మహిళలు, చిన్నారులు, వృద్ధుల పట్ల నేరాలకు పాల్పడే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిపి మల్కాజిగిరి పద్మజ, డిసిపి వుమెన్ సేఫ్టీ వింగ్ ఉషా విశ్వనాథ్, డిసిపి ఎస్ఓటి రమణ రెడ్డి, డిసిపి ఎస్ఓటి మురళీధర్, డిసిపి అడ్మిన్ ఇందిర, అదనపు డిసిపి అడ్మిన్ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ కుషాయిగూడ ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..