Drug Case: డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన క్రిష్.. శాంపిల్స్ సేకరించిన పోలీసులు.. విచారణలో ఏం చెప్పారంటే..

అనుమానితులుగా ఉన్న డైరెక్టర్ క్రిష్, నీల్, లిషి తదితరులు విచారణకు హాజరుకావాలంటూ ఇప్పటికే అందరికి నోటీసులు పంపించారు. ఈ క్రమంలోనే ఈ కేసులో ఏ10గా ఉన్న డైరెక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరగ్గా.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. దీంతో శుక్రవారం గోప్యంగా విచారణకు హజరయ్యారు. తన స్నేహితుడు చరణ్‏ను కలిసెందుకే పార్టీకి వెళ్లానని.. అక్కడ కేవలం 30 నిమిషాలు మాత్రమే ఉన్నానని క్రిష్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Drug Case: డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన క్రిష్.. శాంపిల్స్ సేకరించిన పోలీసులు.. విచారణలో ఏం చెప్పారంటే..
Director Krish
Follow us

|

Updated on: Mar 02, 2024 | 12:16 PM

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు గచ్చిబౌలి పోలీసులు. అలాగే అనుమానితులుగా ఉన్న డైరెక్టర్ క్రిష్, నీల్, లిషి తదితరులు విచారణకు హాజరుకావాలంటూ ఇప్పటికే అందరికి నోటీసులు పంపించారు. ఈ క్రమంలోనే ఈ కేసులో ఏ10గా ఉన్న డైరెక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరగ్గా.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. దీంతో శుక్రవారం గోప్యంగా విచారణకు హజరయ్యారు. తన స్నేహితుడు చరణ్‏ను కలిసెందుకే పార్టీకి వెళ్లానని.. అక్కడ కేవలం 30 నిమిషాలు మాత్రమే ఉన్నానని క్రిష్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదన్నారు క్రిష్.

కొద్దిసేపు క్రిష్ ను విచారించిన పోలీసులు అనంతరం రక్త, మూత్ర నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు. అనంతరం క్రిష్ మాట్లాడుతూ.. కొద్దిరోజులుగా తాను ముంబైలో ఉన్నానని.. పోలీసులు ఎప్పుడు పిలిచినా వారికి సహకరించేందుకు విచారణకు వస్తానని అన్నారు. నిజానికి వారం ముందే క్రిష్ విచారణకు హాజరుకావాల్సింది. కానీ ఆ సమయంలో తాను ముంబైలో ఉండడం వల్ల విచారణకు హాజరుకాలేనని.. శుక్రవారం వస్తానని పోలీసులకు తెలిపారు. కానీ అనుహ్యంగా విచారణకు ముందే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనపై అనుమానాలు ఎక్కువయ్యాయి..

ఇదిలా ఉంటే.. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న గజ్జల వివేకానంద్, నిర్భయ్, కేదార్ నాథ్ నమునాలు ఇప్పటికే పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న మిగతా 14 మంది కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నీల్, లిషి, శ్వేత్ విదేశాలకు వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నమూనా సేకరణలో ఆలస్యం జరిగే కొద్ది పరీక్షల్లో డ్రగ్స్ ఆనవాళ్లు తొలగిపోతాయనే వారు విచారణకు ఆలస్యమయ్యేలా చేస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తన చెల్లెలు లిషి కనిపించడం లేదని టాలీవుడ్ నటి కుషిత గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్