AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ప్రధాని మోదీ ఆదిలాబాద్ పర్యటన.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..

భారత ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఆదిలాబాద్‌లో పర్యటిస్తున్నారు. రూ. 6,697 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతారు. మోదీ పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్‌‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మోదీ సభ జరిగే ఇందిరా స్టేడియం వైపు..

PM Modi: ప్రధాని మోదీ ఆదిలాబాద్ పర్యటన.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..
Pm Modi Adilabad Visit
Naresh Gollana
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 02, 2024 | 5:50 PM

Share

ఆదిలాబాద్, మార్చి 2: భారత ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఆదిలాబాద్‌లో పర్యటిస్తున్నారు. రూ. 6,697 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతారు. మోదీ పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్‌‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మోదీ సభ జరిగే ఇందిరా స్టేడియం వైపు రెండు రోజులు రాకపోకలు బంద్‌ చేశారు. కలెక్టరేట్, ఎస్పీ క్యాంప్ ఆఫీసు నుంచి ఆదిలాబాద్ చౌరస్తా వరకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు పట్టణంలో ఎటువంటి డ్రోన్లకు అనుమతి లేదని చెప్పారు ఎస్పీ ఆలం. మరోవైపు రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న క్రమంలో సోమవారం పరీక్షలు రాసే విద్యార్థులు వీలైనంత త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మోదీ ఆదిలాబాద్ పర్యటన నేపథ్యంలో కచ్ కంటి నుంచి ఆదిలాబాద్ పట్టణానికి రాకపోకలను మళ్లించారు పోలీసులు. పాత సాత్నాల రహదారి నుంచి ఆదిలాబాద్‌కు దారి మళ్లించారు. కెఆర్‌కె కాలనీవాసులు పట్టణంలోకి రావడానికి మావల పోలీస్ స్టేషన్ మీదుగా తిరుమల పెట్రోల్ బంక్ వైపు రాకపోకలు సాగించాలని చెప్పారు పోలీసులు. అంకులి, తంతోలి ప్రజలు పట్టణంలోకి రావడానికి కృష్ణా నగర్ మీదుగా మావల పిఎస్ ముందున్న రోడ్డును వాడుకోవాలని సూచన చేశారు. ప్రధాని మోదీ సభకు లక్ష మంది హాజరవుతారని చెప్పారు ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి. మరోసారి ఆదిలాబాద్ సీటును గెలిచి మోదీకి గిఫ్ట్‌గా ఇస్తామని చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..