CCL: ఎట్టకేలకు పంజాబ్‎పై గెలిచిన తెలుగు వారియర్స్.. ఓంకార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

డిఫెండింగ్ ఛాంపియన్‎గా బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ టీం దూసుకుపోతుంది. నిన్న ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‎లో దుమ్ము దులిపేసింది. కెప్టెన్ అఖిల్ స్టాప్ ప్లేయర్ తమన్ అండ్ అశ్విన్ ధాటికీ పంజాబ్ ది షేర్ ఓటమిపాలైంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించిన తెలుగు వారియర్స్ పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకెళ్లింది.

CCL: ఎట్టకేలకు పంజాబ్‎పై గెలిచిన తెలుగు వారియర్స్.. ఓంకార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Ccl Match
Follow us
Yellender Reddy Ramasagram

| Edited By: Srikar T

Updated on: Mar 02, 2024 | 5:04 PM

డిఫెండింగ్ ఛాంపియన్‎గా బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ టీం దూసుకుపోతుంది. నిన్న ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‎లో దుమ్ము దులిపేసింది. కెప్టెన్ అఖిల్ స్టాప్ ప్లేయర్ తమన్ అండ్ అశ్విన్ ధాటికీ పంజాబ్ ది షేర్ ఓటమిపాలైంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించిన తెలుగు వారియర్స్ పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకెళ్లింది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో ఇప్పటికే నాలుగు సార్లు ట్రోఫీని కైవసం చేసుకున్న తెలుగు వారియర్స్ ఐదోసారి ట్రోఫీ కోసం వేట మొదలుపెట్టింది. ఐదోసారి ట్రోఫీ గెలవాలని హోమ్ గ్రౌండ్‎లో ఆడుతున్న మ్యాచ్లో గెలిచి తమ ఫ్యాన్స్‎కి మంచి ట్రీట్ ఇవ్వాలని ఆశిస్తోంది.

ఇందులో భాగంగా శుక్రవారం పంజాబ్‎తో తలపడిన తెలుగు వారియర్స్ నరాలు తెగే ఉత్కంఠలో పంజాబ్‎పై విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్‎లో పంజాబ్‎కి దీటుగా సమాధానం ఇచ్చేందుకు హీరో అశ్విన్ ప్రయత్నించి లీడ్ తీసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ 106 టార్గెట్‎తో బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ 10 ఓవర్లలో రెండు బాల్స్ మిగిలి ఉండగానే టార్గెట్ చేజ్ చేసింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బాద్ షా ఆఫ్ మ్యాచ్‎గా నిలిచారు.

మొదటి ఇన్నింగ్స్‎లో సూపర్ బ్యాటింగ్‎తో ఆకట్టుకున్న అశ్విన్.. సెకండ్ ఇన్నింగ్స్‎లో బ్యాట్ మడతపెట్టిన తమన్ చూసి ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. మ్యాచ్ ముగిసిన తర్వాత టీవీ9తో మాట్లాడిన తమన్, అశ్విన్ తమ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. అశ్విన్ అన్న డైరెక్టర్ ఓంకార్ టీవీ9తో మాట్లాడుతూ ఇప్పటి వరకు పంజాబ్‎పై తెలుగు వారియర్స్ గెలిచింది లేదు అని.. సినిమా క్లైమాక్స్‎ని తలపించేలా సెకండ్ ఇన్నింగ్స్ మ్యాచ్ జరిగిందని అన్నారు. ఒకానొక సమయంలో మ్యాచ్ ఓడిపోయే స్టేజ్‎లో ఉన్నామని.. తమన్, అశ్విన్, అఖిల్ టీం సపోర్ట్‎తో మ్యాచును మలుపు తిప్పారని ఓంకార్ అన్నారు. మిగతా టీమ్స్‎తో పోల్చితే తెలుగు వారియర్స్ బిజీ షెడ్యూల్ కారణంగా ప్రాక్టీస్ చాలా తక్కువగా చేసినా మ్యాచుల్లో మాత్రం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ గెలుస్తున్నారని అన్నారు. ఈసారి కూడా తప్పకుండా ట్రోఫీని గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేశారు తెలుగు సినిమా సెలబ్రిటీస్.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?