AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google: ప్లేస్టోర్‌ నుంచి 10 భారతీయ యాప్స్‌ను తొలగింపు.. కేంద్రం రియాక్షన్‌తో దిగొచ్చిన గూగుల్‌

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కంపెనీలకు మూడు సంవత్సరాల మూడు వారాల గడువు ఇచ్చిన తర్వాత, తాము అవసరమైన చర్యలు తీసుకున్నామని గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. కంపెనీ పాలసీని అమలు చేయడంలో ఇది సహాయపడుతుందని గూగుల్ విశ్వసిస్తోంది. ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా మా విధానాలు ఉల్లంఘించబడినట్లయితే మేము చేసేది ఇదేనని చెబుతోంది. కాగా, బిల్లింగ్ విధానాలను పాటించకపోవడంపై గూగుల్‌ ఈ యాప్స్‌ను..

Google: ప్లేస్టోర్‌ నుంచి 10 భారతీయ యాప్స్‌ను తొలగింపు.. కేంద్రం రియాక్షన్‌తో దిగొచ్చిన గూగుల్‌
Minister Ashwini Vaishnaw
Subhash Goud
|

Updated on: Mar 02, 2024 | 5:57 PM

Share

Google Play Store Billing Issue: గూగుల్ ప్లే స్టోర్ బిల్లింగ్ సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. బిల్లులు చెల్లించని యాప్ డెవలపర్‌లపై చర్యలు తీసుకోవాలని అమెరికన్ ప్లే స్టోర్ కంపెనీ నిర్ణయించింది. దీంతో ప్లే స్టోర్ నుంచి 10 భారతీయ కంపెనీల యాప్‌లను తొలగించే ప్రక్రియను గూగుల్ ప్రారంభించనుంది. ఇందులో పలు యాప్స్‌ ఉన్నాయి. ఈ యాప్ డెవలపర్లు తమ మార్గదర్శకాలను పాటించడం లేదని, అందుకే ఈ చర్య తీసుకుంటున్నామని సెర్చ్ ఇంజన్ కంపెనీ తెలిపింది. Google Play Store చెల్లింపు విధానాన్ని గూగుల్‌ అప్‌డేట్‌ చేసింది. ఈ భారతీయ కంపెనీలు ప్లే స్టోర్ సర్వీస్ ఫీజును చెల్లించలేదు. దీంతో ఆగ్రహించిన గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి 10 భారతీయ యాప్‌లను తొలగిస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. గూగుల్‌కి సేవా రుసుము చెల్లించడంలో ఈ కంపెనీలు నిరంతరం విఫలమయ్యాయి. సేవా రుసుములకు సంబంధించి భారతీయ స్టార్టప్, గూగుల్ మధ్య వివాదం నడుస్తోంది. గూగుల్ సర్వీస్ ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయని స్టార్టప్ చెబుతోంది.

తొలగించిన యాప్స్ ఇవే..

  • ALT Balaji
  • Bharat Matrimony
  • Naukri
  • 99 Acres
  • Kuku FM
  • Quack-Quack
  • Shaadi . Com
  • Stage
  • Truly Madly
  • Stage OTT

యాప్‌లో కొనుగోళ్లు, Play Store నుండి యాప్‌లను డౌన్‌లోడ్ చేయడంపై గూగుల్‌ గరిష్టంగా 26 శాతం సేవా రుసుమును వసూలు చేస్తుంది. వీటిని స్టార్టప్‌లు వ్యతిరేకిస్తున్నాయి. చెల్లింపు విధానం ప్రకారం గూగుల్‌ తన బ్లాగ్ పోస్ట్‌లో యాప్ తీసివేతను నిర్ధారించింది. అయితే, బ్లాగ్ పోస్ట్‌లో కంపెనీ ఏ కంపెనీ పేరును పేర్కొనలేదు.

ఇవి కూడా చదవండి

3 సంవత్సరాల సమయం..

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కంపెనీలకు మూడు సంవత్సరాల మూడు వారాల గడువు ఇచ్చిన తర్వాత, తాము అవసరమైన చర్యలు తీసుకున్నామని గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. కంపెనీ పాలసీని అమలు చేయడంలో ఇది సహాయపడుతుందని గూగుల్ విశ్వసిస్తోంది. ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా మా విధానాలు ఉల్లంఘించబడినట్లయితే మేము చేసేది ఇదేనని చెబుతోంది.

కేంద్రం రియాక్షన్‌పై గూగుల్‌ వెనక్కి..

ఇదిలా ఉండగా, ఈ భారతీయ యాప్స్‌ తొలగింపుపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. యాప్‌లను తొలగించాలని గూగుల్ నిర్ణయం తీసుకున్న తర్వాత, ఐటి మంత్రి వైష్ణవ్, గూగుల్ తన ప్లే స్టోర్ నుండి కొన్ని యాప్‌లను తొలగించడాన్ని స్పందించారు. ఈ యాప్‌లను తొలగించడానికి ప్రభుత్వం అనుమతించదని వైష్ణవ్ పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించడానికి గూగుల్‌తో సమావేశానికి పిలిచారు. భారతదేశం చాలా స్పష్టంగా ఉంది.. మా విధానం చాలా స్పష్టంగా ఉంది. మా స్టార్టప్‌లకు అవసరమైన రక్షణ లభిస్తుందని అన్నారు. వచ్చే వారం గూగుల్‌ ప్రతినిధులను సమావేశానికి పిలిచినట్లు మంత్రి తెలిపారు. అయితే కేంద్రం రియాక్షన్‌పై గూగుల్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. సర్వీస్ ఫీజులకు సంబంధించిన వివాదంతో ప్లే స్టోర్ నుండి తీసివేయబడిన భారతీయ యాప్‌లను పునరుద్ధరించడానికి అంగీకరించింది. ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో అధికారులు సమావేశమైన తర్వాత కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. 94% ఫోన్‌లు దాని ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడినందున భారతీయ మార్కెట్‌ను గూగుల్ ఆధిపత్యం చేస్తుంది.

అయితే గూగుల్‌ తీసుకున్న చర్యలపై ఈ కంపెనీలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఈ యాప్స్‌ తొలగించడంపై గూగుల్‌ ప్రతినిధులతో చర్చలు జరుపుతామని, కంపెనీలను రక్షించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. కేంద్రం రియాక్షన్‌పై గూగుల్ తన నిర్ణయాన్ని మార్చుకుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి