- Telugu News Photo Gallery Technology photos New Updatecoming WhatsApp None Open Secret Chat WhatsApp Web Users New Feature
WhatsApp New Feature: వాట్సాప్‌లో మరో అప్‌డేట్..వెబ్ వినియోగదారులకు కొత్త ఫీచర్
ప్రస్తుతం ఏ ఫోన్‌లో చూసినా వాట్సాప్ ఉండాల్సిందే. ఇదిలేనిది ఏ ఫోన్ అంటూ ఉండదు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లో మునిగి తేలుతుంటున్నారు. ఇక వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ సంస్థ కూడా కొత్త కొత్త ఫీచర్స్‌ను తీసుకువస్తోంది. తాజాగా వాట్సాప్ వెబ్ వాడే వారికి మరో ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఆ సమస్య ఉండదు..
Updated on: Mar 02, 2024 | 4:19 PM

వాట్సాప్ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లు ఇస్తూనే ఉంది. ఈసారి కంపెనీ భద్రతను మరింత పటిష్టం చేసే కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. మెటా ఈ యాప్‌కి కొత్త ఫీచర్‌ను జోడించబోతోంది. దీని సహాయంతో వినియోగదారులు తమ రహస్య చాట్‌ను లాక్ చేయవచ్చు. వాట్సాప్‌ను టీనేజర్ల నుంచి వృద్ధుల వరకు దాదాపు అన్ని వర్గాల వారు ఉపయోగిస్తున్నారు. చాలా మంది తమ చాట్‌లను రహస్యంగా ఉంచాలని కోరుకుంటారు.

భద్రతను దృష్టిలో ఉంచుకుని, WhatsApp వెబ్ కొత్త ఫీచర్‌ను చేర్చబోతోంది. ఇది గోప్యతకు, చాట్‌ను లాక్ చేయడానికి సహాయపడుతుంది. వెబ్ వెర్షన్ కోసం వస్తున్న ఈ ఫీచర్ పేరు సీక్రెట్ కోడ్ ఫీచర్. ఇది ఇప్పటికే మొబైల్ యాప్ కోసం అందుబాటులో ఉంది. ఈ రాబోయే ఫీచర్ గురించిన సమాచారం WABetaInfo ద్వారా షేర్ చేసింది.

చాట్ లాక్ ఈ ఫీచర్ WhatsApp వెబ్ బీటా కోసం విడుదల చేసింది. ఈ ఫీచర్ సహాయంతో వినియోగదారులు ఎలాంటి చాట్‌నైనా సులభంగా లాక్ చేయవచ్చు. ఇప్పటివరకు ఈ ఫీచర్ కేవలం స్మార్ట్ ఫోన్లకే పరిమితమైంది. అయితే ఇప్పుడు అది విస్తరించబోతోంది.

సీక్రెట్ కోడ్ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ వెబ్‌లో పరీక్షిస్తోంది. అన్ని పరీక్షలను కంపైల్ చేసిన తర్వాత ఇది త్వరలో వినియోగదారులకు అందుబాటులో రానుంది. తమ ఆఫీస్ డెస్క్‌టాప్‌లో వాట్సాప్‌ను నిరంతరం ఉపయోగించే, తరచుగా లాగ్‌అవుట్ చేయడం మరచిపోయే వ్యక్తులకు ఈ ఫీచర్‌లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

WhatsApp వెబ్ లాక్ చాట్‌లను యాక్సెస్ చేయడానికి రహస్య కోడ్‌ను నమోదు చేయాలి. వాట్సాప్‌కు ఈ ఫీచర్‌లను తీసుకురావడం ఉద్దేశ్యం వినియోగదారుల సున్నితమైన సమాచారాన్ని ఇతరుల నుండి రక్షించడం. దీని కోసం అదనపు భద్రతా పిన్‌గా ఉపయోగించుకోవచ్చు.





























