- Telugu News Photo Gallery Technology photos Noise launching new smart phone in india Noisefit venture features and price details
Noisefit venture: రూ. 1500కే అదిరిపోయే స్మార్ట్ వాచ్.. నాయిస్ ఫిట్ వెంచర్.
భారత్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం నాయిస్ ఇటీవల వరుసగా స్మార్ట్ వాచ్‌లను విడుదల చేస్తూ వస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లతో కూడిన వాచ్‌లను తీసుకొస్తూ మార్కెట్లో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా నాయిస్‌ఫిట్ వెంచర్ పేరుతో కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. ఈ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Apr 05, 2024 | 3:09 PM

భారత్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం నాయిస్ భారత మార్కెట్లోకి నాయిస్ ఫిట్ వెంచర్ పేరుతో కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. ఈ వాచ్‌లో 1.39 ఇంచెస్‌తో కూడిన టీఎఫ్‌టీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 360 x 360 పిక్సెల్ రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం.

ఇందులో నాయిస్ ట్రూ సింక్ టెక్నాలజీతో ఫోన్‌తో వేగంగా ఫోన్‌కు లింక్ అవుతుంది. అలేగా బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో నేరుగా ఫోన్‌తోనే మాట్లాడుకోవచ్చు. ఇక ఇందులో 24×7 హార్ట్ రేట్, ఎస్‌పీఓ2, స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

అలాగే ఈ స్మార్ట్ వాచ్‌లో స్పోర్ట్స్ మోడ్స్‌ను అందించారు. డయల్ ప్యాడ్, రీసెంట్ కాల్ హిస్టరీ వంటి సమాచారం పొందొచ్చు. ఇందులో ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్, స్పీకర్ అందించారు.

ఈ స్మార్ట్ వాచ్‌తో క్యూఆర్ కోడ్‌తో డబ్బులు చెల్లింపులు చేసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్‌తో స్మార్ట్ ఫోన్‌లో కెమెరాను కంట్రోల్ చేసుకోవచ్చు. రిమైండర్, అలారం వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏడు రోజులు పనిచేస్తుంది. ఇక ధర విషయానికొస్తే ఈ వాచ్ ప్రారంభ ధర రూ. 1499గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ వాచ్ బ్లాక్, బ్లూ, గ్రీన్, గ్రే కలర్స్‌లో అందుబాటులో ఉండనుంది.




