Oppo f25: వివో నుంచి కొత్త ఫోన్‌.. 4కే వీడియో రికార్డింగ్ ఆప్షన్‌తో పాటు..

ప్రస్తుతం కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇస్తూ స్మార్ట్ ఫోన్‌లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఇప్పటికే చైనాకు చెందిన చాలా కంపెనీలు అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఒప్పో తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఒప్పో ఎఫ్‌25పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

Narender Vaitla

|

Updated on: Mar 01, 2024 | 9:15 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఒప్పో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఒప్పో ఎఫ్‌25 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. మిడ్ రేంజ్ బడ్జెట్‌లో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారు.

1 / 5
ఒప్పో ఎఫ్‌25 స్మార్ట్ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక రెయిర్‌ కెమెరాతో 4కే క్వాలిటీ వీడియోలను రికార్డింగ్ చేసుకోవచ్చు.

2 / 5
ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో మీడియాసెట్ డైమన్సిటీ 7050 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను అందించారు. అలాగే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. తక్కువ బరువు, స్లిమ్, డ్యూరబుల్ స్మార్ట్‌ఫోన్‌గా దీనిని రూపొందించారు.

3 / 5
ధర విషయానికొస్తే 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌తో కూడిన ఫోన్ ధరను రూ. 23,999గా నిర్ణయించారు. అలాగే 8జీబీ, 256జీబీ వేరియంట్ ధరను రూ. 28,999గా నిర్ణయించారు. మార్చి 5వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.

4 / 5
ఇక ఈ ఫోన్‌ 67 వాట్స్‌ సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కేవలం పది నిమిషాల్లో సున్నా నుంచి 30 శాతానికి, 48 నిమిషాల్లో 100 శాతం బ్యాటరీ ఛార్జ్‌ అవుతుందని కంపెనీ చెబుతోంది.

5 / 5
Follow us