Airtel Traffic Plan: ఎయిర్‌టెల్ టారిఫ్ ప్లాన్‌ల ధరలు భారీగా పెరగనున్నాయా?

భారతదేశపు రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ త్వరలో తన ప్లాన్‌ల ధరలను పెంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కంపెనీ చైర్మన్ సునీల్ మిట్టల్ తెలియజేశారు. ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఇటీవల ఎన్‌డిటివి ప్రాఫిట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మార్కెట్‌ను స్థిరంగా ఉంచడానికి కంపెనీ భారతదేశంలో టెలికాం రేట్లను పెంచుతుందని చెప్పారు..

Airtel Traffic Plan: ఎయిర్‌టెల్ టారిఫ్ ప్లాన్‌ల ధరలు భారీగా పెరగనున్నాయా?
Airtel
Follow us
Subhash Goud

|

Updated on: Mar 02, 2024 | 6:00 AM

భారతదేశపు రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ త్వరలో తన ప్లాన్‌ల ధరలను పెంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కంపెనీ చైర్మన్ సునీల్ మిట్టల్ తెలియజేశారు. ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఇటీవల ఎన్‌డిటివి ప్రాఫిట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మార్కెట్‌ను స్థిరంగా ఉంచడానికి కంపెనీ భారతదేశంలో టెలికాం రేట్లను పెంచుతుందని చెప్పారు.

ఎయిర్‌టెల్ ప్లాన్‌ల ధరలు పెరుగుతాయా?

అయితే, ఎయిర్‌టెల్ ప్లాన్‌ల ధర ఎప్పుడు పెరుగుతుందో సునీల్ మిట్టల్ వెల్లడించలేదు. అయితే మీడియా నివేదికల ప్రకారం, ఎయిర్‌టెల్ 2024 లో అంటే జూన్ తర్వాత దాని టారిఫ్ ప్లాన్‌ల ధరను పెంచవచ్చు. ఎయిర్‌టెల్ కంపెనీ రాబోయే నెలల్లో సగటు ఆదాయాన్ని (ARPU) రూ.208 నుంచి రూ.300కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎయిర్‌టెల్ భారతదేశంలో తన 5G సేవను నిరంతరం విస్తరిస్తోంది. వాస్తవానికి భారతదేశంలో 5G సేవను విస్తరించడానికి స్పెక్ట్రమ్, ఇతర ప్రాథమిక మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి కంపెనీ రూ.40,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తోంది. ఈ కారణంగా, కంపెనీ ఇప్పుడు తన పెట్టుబడిని క్రమంగా రికవరీ చేయడానికి ప్రయత్నిస్తోంది.

ఇవి కూడా చదవండి

డిసెంబరు 2021 నుండి భారతదేశ టెలికాం రంగంలో టారిఫ్ ప్లాన్‌ల రేట్లలో పెద్ద మార్పులేమీ లేవు. అయితే, ఈ టెలికాం కంపెనీలు భారతదేశంలో 4G సేవలను ప్రారంభించినప్పటి నుండి, కంపెనీలు ప్రతి 2-3 సంవత్సరాలకు టారిఫ్ ప్లాన్‌ల ధరలను పెంచుతూనే ఉన్నాయి. ఎయిర్‌టెల్ కాకుండా జియో, వొడాఫోన్-ఐడియాలను కలిగి ఉన్న భారతీయ టెలికాం రంగంలో మూడు కంపెనీలు అత్యంత ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. భారతీయ టెలికామ్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా పెద్ద పాత్రను కలిగి ఉన్నప్పటికీ, పోటీలో ఈ కంపెనీ Airtel, Jio, Vodafone కంటే చాలా వెనుకబడి ఉంది.

అటువంటి పరిస్థితిలో ఎయిర్‌టెల్‌ తన ప్లాన్‌ల ధరను పెంచినట్లయితే జియో, వోడాఫోన్‌-ఐడియా కంపెనీలు కూడా తమ సంబంధిత టారిఫ్ ప్లాన్‌ల ధరను పెంచవచ్చు. నవంబర్ 2021లో కూడా ఈ మూడు కంపెనీలు ఇదే పద్ధతిని అనుసరించాయి. ఆ సమయంలో కూడా ఎయిర్‌టెల్‌ దాని ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలను 20% పెంచింది. అలాగే ఆ తర్వాత అదే నెలలో జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా కూడా వారి సంబంధిత ప్లాన్‌ల ధరలను పెంచాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి