Medicine Price: మధుమేహం, బీపీ సహా అనేక వ్యాధుల మందుల ధరలు మరింత చౌకగా..

డ్రగ్ ప్రైసింగ్ కంట్రోల్ ఆర్డర్‌లోని నిబంధనలను అమలు చేసే బాధ్యత కూడా దీనిపై ఉంటుంది. నియంత్రణలో ఉన్న , నియంత్రణలో లేని మందుల ధరలను రెగ్యులేటర్ పర్యవేక్షిస్తుంది. ఇది నిర్ణీత ధరలకు అవసరమైన ఔషధాల లభ్యతను నిర్ధారిస్తుంది. ప్రతి రిటైలర్, డీలర్ తమ దుకాణం లేదా కార్యాలయంలో మందుల ధరలను స్పష్టంగా ప్రదర్శించడాన్ని అధికార యంత్రాంగం తప్పనిసరి చేసింది. దీంతో వినియోగదారులకు మందులను అందించడం సులభతరం అవుతుంది..

Medicine Price: మధుమేహం, బీపీ సహా అనేక వ్యాధుల మందుల ధరలు మరింత చౌకగా..
Medicine
Follow us
Subhash Goud

|

Updated on: Feb 29, 2024 | 6:40 PM

మధుమేహం, రక్తపోటు మందులు చౌకగా ఉంటాయి. నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ ( NPPA ) 69 సూత్రీకరణల రిటైల్ ధరను, సీలింగ్ ధరను నిర్ణయించింది. ధరల పరిమితిని పాటించని ఔషధ తయారీ కంపెనీలు అదనంగా వసూలు చేసిన ధరను ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. టైప్ 2 మధుమేహం, రక్తపోటు, యాంటీబయాటిక్స్, దగ్గు సిరప్, డిప్రెషన్ వంటి అనేక ఔషధాల ధరలు ధర నియంత్రణలోకి వస్తాయి.

ఈ మందులు తక్కువ ధరకే లభిస్తాయి

టైప్ 2 మధుమేహం కోసం డపాగ్లిఫ్లోజిన్, మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ (ఎక్స్‌టెండెడ్ రిలీజ్), గ్లిమెపిరైడ్ మాత్రల కలయిక రూ.14. సిటాగ్లిప్టిన్ ఫాస్ఫేట్, మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్, గ్లిమిపిరైడ్ కాంబినేషన్ రూ.13 అవుతుంది. సన్ ఫార్మాస్యూటికల్స్, ఆల్కెమ్ లేబొరేటరీస్, సిప్లా, మ్యాన్‌కైండ్ ఫార్మా, లుపిన్, టోరెంట్ ఫార్మా వంటి అనేక కంపెనీల ఔషధాలు ఈ జాబితాలో చేర్చనున్నారు. ఇది కాకుండా NPPA జాబితాలో 39 రకాల మందులను చేర్చారు. దీని కింద స్నేక్ వెనమ్ యాంటిసెరమ్ సీలింగ్ ధర రూ.428గా నిర్ణయించారు. హెచ్‌ఐవి ఔషధం సిడివుడిన్, తలసేమియా చికిత్సకు డెస్ఫెరియోక్సమైన్, ఉబ్బసం చికిత్సకు బుడెసోనైడ్-ఫార్మోటెరాల్ కలయిక ధరలను కూడా ధర నియంత్రణలోకి తెచ్చారు.

ఇవి కూడా చదవండి

NPPA (National Pharmaceutical Pricing Authority)1997లో స్థాపించారు. మందుల ధరలను నిర్ణయించడం, మార్చడం, ధరల నియంత్రణ వంటిది సంస్థ పని. దీంతో పాటు డ్రగ్ ప్రైసింగ్ కంట్రోల్ ఆర్డర్‌లోని నిబంధనలను అమలు చేసే బాధ్యత కూడా దీనిపై ఉంటుంది. నియంత్రణలో ఉన్న , నియంత్రణలో లేని మందుల ధరలను రెగ్యులేటర్ పర్యవేక్షిస్తుంది. ఇది నిర్ణీత ధరలకు అవసరమైన ఔషధాల లభ్యతను నిర్ధారిస్తుంది.

ప్రతి రిటైలర్, డీలర్ తమ దుకాణం లేదా కార్యాలయంలో మందుల ధరలను స్పష్టంగా ప్రదర్శించడాన్ని అధికార యంత్రాంగం తప్పనిసరి చేసింది. దీంతో వినియోగదారులకు మందులను అందించడం సులభతరం అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి