Post Office: మీ డబ్బుకు భద్రతతో పాటు మంచి ఆదాయం.. పోస్టాఫీస్‌ స్కీమ్‌..

పోస్టాఫీస్‌ అందిస్తోన్న ఈ పథకం పేరు సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్‌. ఇందులో మీ రిటైర్మెంట్ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పథకంలో భాగంగా మీఉ కనీసం 1000 రూపాయల్నించి నుంచి పెట్టుబడి పెట్టుకోవచ్చు. గరిష్టంగా రూ. 30 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. దీంతో ప్రతీ నెల ఖర్చులకు నిర్ధిష్ట మొత్తం డబ్బులు...

Post Office: మీ డబ్బుకు భద్రతతో పాటు మంచి ఆదాయం.. పోస్టాఫీస్‌ స్కీమ్‌..
Postoffice
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 29, 2024 | 5:53 PM

ఉద్యోగ విరమణ తర్వాత లేదా వ్యాపారం నుంచి నిష్క్రమించిన తర్వాత ప్రతీ నెల గ్యారెంటీ ఆదాయం ఉంటే బాగుంటుందనే ఆలోచనలో చాలా మంది ఉంటారు. ఇలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టాఫీస్‌ ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా మీ డబ్బుకు భద్రత లభించడంతో పాటు ప్రతీ నెల స్థిరమైన ఆదాయాన్ని పొందొచ్చు. ఇంతకీ పోస్టాఫీస్‌ అందిస్తున్న ఈ పథకం పేరెంటి.? ఇందులో పెట్టుబడి పెడితే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పోస్టాఫీస్‌ అందిస్తోన్న ఈ పథకం పేరు సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్‌. ఇందులో మీ రిటైర్మెంట్ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పథకంలో భాగంగా మీఉ కనీసం 1000 రూపాయల్నించి నుంచి పెట్టుబడి పెట్టుకోవచ్చు. గరిష్టంగా రూ. 30 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. దీంతో ప్రతీ నెల ఖర్చులకు నిర్ధిష్ట మొత్తం డబ్బులు ఆదాయంగా పొందొచ్చు. అంతేకాదు ఈ పథకంలో పెట్టుబడిగా పెట్టిన మొత్తానికి ఇన్‌కంటాక్స్ చట్టం సెక్షన్ 80సి ప్రకారం మినహాయింపు కూడా లభిస్తుంది.

అయితే దీనిపై వచ్చే వడ్డీపై ట్యాక్స్ వర్తిస్తుంది. ప్రస్తుతం సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌పై ప్రభుత్వం 8.2 శాతం వడ్డీ ఇస్తోంది. కేంద్రం ఈ వడ్డీ రేటును సవరిస్తుంటుంది. ముఖ్యంగా 60 ఏళ్ల వృద్ధుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఉద్యోగ విరమణ తర్వాత డబ్బును సరిగ్గా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రతీ నెల వడ్డీ డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఉద్యోగవిరమణ తర్వాత ఆర్థిక అవసరాలకు ఎలాంటి ఢోకా ఉండదు. ఉదాహరణకు ఈ పథకంలో రూ. 30 పెట్టుబడి పెడితే నెలకు సుమారు రూ. 25 వేల వరకు వడ్డీ పొందొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..