Maruti Car: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. రూ.8 లక్షల కారు కేవలం రూ.4.97 లక్షలకే.. అదిరిపోయే ఆఫర్‌

సెకండ్ హ్యాండ్ కారు కొనేందుకు ఆటో లోన్ తీసుకోకపోవడమే మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. అందుకు పలు ప్రత్నామ్నాయాలను సూచిస్తున్నారు. అందులో పర్సనల్ లోన్, టాపప్ హోమ్ లోన్, అలాగే మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే క్రెడిట్ ఫెసిలిటీలను ఉపయోగించుకోవచ్చు. మీ క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా పర్సనల్ లోన్ ఎంతొస్తుంది, వడ్డీ రేట్లు ఏ విధంగా ఉన్నాయని తనిఖీ చేసుకోవాలి.

Maruti Car: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. రూ.8 లక్షల కారు కేవలం రూ.4.97 లక్షలకే.. అదిరిపోయే ఆఫర్‌
Maruti Ertiga
Follow us
Subhash Goud

|

Updated on: Feb 29, 2024 | 5:49 PM

ప్రస్తుతం మార్కెట్లో కార్లకు ఉన్న క్రేజ్‌అంతా ఇంతా కాదు. సామాన్యుడు కూడా కారు కొనుగోలు చేయాలని ఆశిస్తున్నాడు. భారత ఆటో మార్కెట్ ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమోటివ్ మార్కెట్లలో ఒకటి. ఇక్కడ అధిక మిడిల్ సెగ్మెంట్ కార్లను కొనుగోలు చేసే పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఎలాగూ పండుగల సీజన్ వస్తోంది. అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ కారు కొనాలనే వారి కల నెరవేరాలని కోరుకుంటారు. అయితే కొత్త కారు కొనే స్థోమత లేని వారు సెకండ్‌ హ్యాండ్‌లో తీసుకోవాలని భావిస్తుంటారు. సెకండ్‌ హ్యాండ్ కార్లపై కూడా రకరకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. సెకండ్‌ హ్యాండ్‌ కార్లు లభించే ప్లాట్‌ ఫామ్‌లలో Cars24 ఒకటి.

ఇందులో తక్కువ ధరకే మంచి కండీషన్‌ ఉన్న కార్లు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మరో కారు తక్కువ ధరల్లో అందుబాటులో ఉంది. దాదాపు రూ.8 లక్షల వరకు ఉన్న కారు కేవలం. రూ.5 లక్షలలోపే లభించనుంది. తాజాగా కార్స్‌24లో 2014మోడల్‌కు చెందిన మారుతి ఎరిటీగా కారు అందుబాటులో ఉంది. దీని ధర రూ.4.97 లక్షలకు అందుబాటులో ఉంది. ఈ కారు ఇప్పటి వరకు 76,218 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఇది పెట్రోల్‌ వెర్షన్‌. ఈ కారు రిజిస్ట్రేషన్‌ 2014 సెప్టెంబర్‌లో అయ్యింది. సెకండ్‌ హ్యాండ్‌లో తక్కువ ధరల్లో పెద్దకారు తీసుకోవాలని భావించే వారికి ఇది మంచి అవకాశం. ఈ సెకండ్‌ హ్యాండ్‌ కారుకు లోన్‌ సదుపాయం కూడా ఉంది.

సెకండ్ హ్యాండ్ కారు కొనేందుకు ఆటో లోన్ తీసుకోకపోవడమే మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. అందుకు పలు ప్రత్నామ్నాయాలను సూచిస్తున్నారు. అందులో పర్సనల్ లోన్, టాపప్ హోమ్ లోన్, అలాగే మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే క్రెడిట్ ఫెసిలిటీలను ఉపయోగించుకోవచ్చు. మీ క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా పర్సనల్ లోన్ ఎంతొస్తుంది, వడ్డీ రేట్లు ఏ విధంగా ఉన్నాయని తనిఖీ చేసుకోవాలి. అందులో ప్రీ అప్రూవ్డ్ లోన్స్, జీరో ప్రాసెసింగ్ ఫీ లోన్స్ వంటి ఆఫర్స్ ఉంటాయి. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నట్లయితే తక్కువ వడ్డీకే బ్యాంకులు లోన్ ఇస్తాయి. మీ క్రెడిట్ హిస్టరీ ఆధారంగా అధిక మొత్తంలో లోన్ పొందవచ్చు. టెన్యూర్ సైతం ఎక్కువగానే ఉంటుంది. దీంతో ఈఎంఐ భారం తగ్గుతుంది. సెకండ్ హ్యాండ్ కార్ల లోన్ వడ్డీ రేట్లతో పోలిస్తే పర్సనల్ లోన్, టాపప్ లోన్ల వడ్డీ రేట్లు సగానికి పైగా తక్కువగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

నోట్‌: ఈ సెకండ్‌ హ్యాండ్‌ కార్లు కొనుగోలు చేసే ముందు సదరు వాహనానికి సంబంధించిన యజమానిని కలవకుండా, కారు కండీషన్ చెక్ చేయకుండా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వయంగా ధృవీకరించకుండా ఆర్ధిక లావాదేవీలు చేయకండి. ఈ విషయాన్ని కస్టమర్లు కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!