Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI Big Update: 2000 నోట్లపై కీలక అప్‌డేట్ ఇచ్చిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

దేశంలో రెండు వేల రూపాయల నోట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఉపసంహరించుకుంటున్నట్లు గతంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అందుకు గడువు కూడా ఇచ్చింది. పెద్ద నోట్ల ఉన్నవాళ్లంతా బ్యాంకులకు వెళ్లి మార్చుకున్నారు. ఈ రెండు వేల రూపాయల నోట్లను ముద్రించడం కూడా నిలిపివేసినట్లు ఆర్బీఐ గతంలో తెలిపింది. 2000 నోట్లు ఉన్నవాళ్లు ఇప్పటి వరకు బ్యాంకులకు వెళ్లి మార్పిడి చేసుకున్నారు..

RBI Big Update: 2000 నోట్లపై కీలక అప్‌డేట్ ఇచ్చిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
2000 Notes Updates
Follow us
Subhash Goud

|

Updated on: Mar 01, 2024 | 6:32 PM

భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ.2000 నోటుపై ఒక కీలక అప్‌డేట్‌ను అందించింది. గతేడాది రూ.2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 29, 2024 వరకు రూ. 2000 నోట్లలో మొత్తం 97.62 శాతం తిరిగి వచ్చినట్లు వెల్లడించగా, ఇప్పుడు రూ.8,470 కోట్ల విలువైన 2000 నోట్లు మాత్రమే బ్యాంకులకు రాలేదని తెలిపింది. దేశంలో అతిపెద్ద కరెన్సీ నోటు రూ.2000 నోటును 19 మే 2023న రద్దు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది.

క్లీన్ నోట్ పాలసీ కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు వేల రూపాయల నోట్లను మార్చేందుకు అక్టోబర్ 7, 2023 వరకు గడువు ఇచ్చారు. దేశంలోని అన్ని బ్యాంకుల్లో ఈ నోట్లను మార్చుకునేందుకు అనుమతించారు. ఇప్పుడు సాధారణ బ్యాంకులు, ఇతర ప్రదేశాలలో ఈ 2000 నోట్లను మార్చుకునే సదుపాయం ఇప్పుడు లేదు. ఎవరైనా రూ.2000 నోట్లను మార్చుకోవాలనుకుంటే ఆ నోట్లను రిజర్వ్ బ్యాంకుకు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది.

2000 నోటు ఎప్పుడు ప్రారంభించారు?

ఇవి కూడా చదవండి

కొత్త 2000 నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 2016న విడుదల చేసింది. ఆ సమయంలో ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును ప్రకటించి పాత 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పట్లో 1000 రూపాయల నోటు అతిపెద్ద కరెన్సీ నోటు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 2000 నోట్ల ముద్రణను కూడా ఆర్‌బీఐ నిలిపివేసింది. అలాగే మే 2023లో జాబితా నుండి తొలగించబడింది. ఇప్పుడు 500 రూపాయల నోటు అతిపెద్ద కరెన్సీ నోటు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో