Anant Ambani: అనంత్ అంబానీ, రాధిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. ఆ తెలుగు హీరోకు మాత్రమే ఆహ్వానం

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ ఏడాది జులైలో రాధిక మర్చంట్ తో కలిసి ఏడడుగులు వేయనున్నాడు. పెళ్లికి ఇంకా సమయముంది. అయితే అంబానీ ఇంట పెళ్లంటే మాములుగా ఉండదుగా.. ఇప్పటి నుంచే ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి

Anant Ambani: అనంత్ అంబానీ, రాధిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. ఆ తెలుగు హీరోకు మాత్రమే ఆహ్వానం
Anant Ambani Wedding
Follow us
Basha Shek

|

Updated on: Mar 01, 2024 | 6:19 PM

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ ఏడాది జులైలో రాధిక మర్చంట్ తో కలిసి ఏడడుగులు వేయనున్నాడు. పెళ్లికి ఇంకా సమయముంది. అయితే అంబానీ ఇంట పెళ్లంటే మాములుగా ఉండదుగా.. ఇప్పటి నుంచే ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గుజరాత్‌లోని జామ్ నగరం ఈ వేడుకకు ఆతిథ్యం ఇవ్వనుంది. మార్చి 1-3 వరకు అంటే మూడు రోజుల పాటు జరిగే అనంత్- రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ప్రపంచ దేశాల నుంచి వివిధ రంగాల ప్రముఖులు సందడి చేయనున్నారు. మార్క్ జుకర్ బర్గ్, బిల్ గేట్స్, ఇవాంకా ట్రంప్ లాంటి ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు హాజరుకానున్నారు. వీరితో పాటు పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు అంబానీ ఇంట జరిగే పెళ్లి వేడుకలో పాల్గొననున్నారు. ఇప్పటికే స్టార్ సెలబ్రిటీల రాకతో జామ్ నగర్ కిటకిటలాడుతోంది. ఇదిలా ఉంటే అనంత్ అంబానీ- రాధికల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు సంబంధించి కేవలం రామ్ చరణ్ కు మాత్రమే ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. త‌న స‌తీమ‌ణి ఉపాస‌న‌తో క‌లిసి ఈ పెళ్లి వేడుక‌ల్లో పాల్గొన‌నున్నాడు చెర్రీ. ఇందుకోసం శుక్ర‌వారం రామ్‌చ‌ర‌ణ్, ఉపాస‌న జామ్ న‌గ‌ర్ వెళ్ల‌నున్న‌ట్లు తెలిసింది.

ఇక బాలీవుడ్ విషయానికి వస్తే.. షారుఖ్‌ఖాన్ త‌న భార్య పిల్ల‌ల‌తో అనంత్ అంబానీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొననున్నాడు. అలాగే దీపికా పదుకొణె- రణ్ వీర్ సింగ్, అలిచా భట్-రణబీర్‌ కపూర్‌, రాణీ ముఖర్జీ, అర్జున్‌ కపూర్, దర్శకుడు అట్లీ, ప్రముఖ క్రికెటర్‌ ధోనీ – సాక్షి దంపతులు, స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్- పారుపల్లి కశ్యప్‌, క్రికెటర్‌ సూర్యకుమార్‌ దంపతులు, ఇషాన్‌ కిషన్‌, జహీర్‌ ఖాన్‌- సాగరిక దంపతులు ఇప్పటికే జామ్ నగర్ చేరుకున్నారు. వీరికి ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

అతిథులకు స్వయంగా భోజనాలు వడ్డిస్తోన్న రాధికా మర్చంట్.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి