Omicron Variant: తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. కొత్తగా 12 కేసులు నమోదు..!
Omicron Variant: దేశంలో కరోనా మహహ్మారి నుంచి ఇప్పుడిప్పుడు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొత్త వేరియంట్ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇక భారత్‌లో..
Omicron Variant: దేశంలో కరోనా మహహ్మారి నుంచి ఇప్పుడిప్పుడు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొత్త వేరియంట్ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇక భారత్‌లో క్రమ క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. భారత్‌లో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 123కు చేరింది. ఇక తెలంగాణలో కూడా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 20కి చేరింది.
కేసులు ఇంకా పూర్తిగా తగ్గిపోకముందు కొత్త వేరియంట్ వచ్చి ఆందోళనకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను సైతం మరోసారి వణికిస్తోంది. భారత్‌లో ఈ ఒమిక్రాన్ వైరస్ రోజురోజుకు చాపకింద నీరులా వ్యాపిస్తోంది. భారత్‌లో ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. అలాగే ఇక తాజాగా మహారాష్ట్రలో కొత్తగా 8 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భారత్‌లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 123కి చేరింది. దేశంలో కోవిడ్ పరిస్థుతలపై కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి మీడియాతో మాట్లాడుతూ పలు కీలక అంశాలను వెల్లడించారు. గతంలో బయటపడిన డెల్టా కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న రోజువారి కోవిడ్ కేసుల్లో 2.4 శాతం ఈ వేరియంట్ కేసులేనని తెలిపారు.
ఇవి కూడా చదవండి: