ICAR Recruitment: హైదరాబాద్ ఐకార్–సీఆర్‌ఐడీఏలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..
ICAR Recruitment: ఐకార్‌కు చెందిన సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్(సీఆర్‌ఐడీఏ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఈ సంస్థలో యంగ్ ప్రొఫెషనల్స్..
ICAR Recruitment: ఐకార్‌కు చెందిన సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్(సీఆర్‌ఐడీఏ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఈ సంస్థలో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 17 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో యంగ్ ప్రొఫెషనల్ 1, యంగ్ ప్రొఫెషనల్ 2 పోస్టులు ఉన్నాయి.
* క్రాప్ ప్రొటెక్షన్, క్రాప్ సైన్సెస్, నేచురల్ రీసోర్స్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ అప్లికేషన్లు, లైవ్ స్టాక్, ఐటీ, అడ్మిన్, ఫైన్ ఆర్ట్స్, ఫైనాన్స్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీకాం/బీబీఏ /బీబీఎస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంసీఏ/ఎమ్మెస్సీ/ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకుండా ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను తొలుత పని అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000 నుంచి రూ.35,000 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 22-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఐకార్ అధికారిక వెబ్‌సైట్ చూడండి.
Crime News: కూలీలపై బోల్తా పడిన టిప్పర్ లారీ.. క్వారీలో ముగ్గురు దుర్మరణం..