CM KCR: తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. ఆ రోజు నుంచే రైతుబంధు నగదు జమ..

Rythu Bandhu Scheme: రైతుబంధు పథకం ప్రారంభించిన పది రోజుల్లోనే అందరికీ నగదు జమ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీంతో ఈ నెల

CM KCR: తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. ఆ రోజు నుంచే రైతుబంధు నగదు జమ..
Cm Kcr
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 18, 2021 | 7:16 PM

Rythu Bandhu Scheme in Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 28 నుంచి రైతు బంధు పంపిణీ చేయనున్నట్టు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. రైతుబంధు పథకం ప్రారంభించిన పది రోజుల్లోనే అందరికీ నగదు జమ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీంతో ఈ నెల (డిసెంబర్) 28 నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమకానున్నాయి. గతంలో మాదిరిగానే భూమి ఉండి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులందరికీ నగదు జమచేయనున్నారు. ఇప్పటికే అధికారులు ఆయా జిల్లాల డేటాను ప్రభుత్వానికి అందజేశాయి.

శనివారం మంత్రులు, కలెక్టర్లతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ పలు విషయాలపై దిశానిర్దేశం చేశారు. నూతన జోనల్ వ్యవస్థ నియమ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజనను చేపట్టాలని సీఎం కేసిఆర్ కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక యువతకు ఉద్యోగుల కల్పనతో పాటు క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ పాలన ఉండాలన్నారు. నూతన జోనల్ వ్యవస్థతో ఇది అమలులోకి వస్తుందని సీఎం కెసీఆర్ స్పష్టంచేశారు. వెనకబడిన మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయ గలిగితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేసి నివేదికను అందజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. భార్యాభర్తల ఉద్యోగులు (స్పౌస్ కేస్) ఒకే చోట పనిచేస్తెనే వారు ప్రశాంతంగా పనిచేయగలుగుతారని,ఉత్పాదకత కూడా పెరుగుతుందని సీఎం తెలిపారు. స్థానిక యువత ఉద్యోగాలకు విఘాతం కలగకుండా మానవీయ కోణంలో స్పోస్ కేస్ అంశాలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ తెలిపారు.

యాసంగిలో వడ్లు కొనే పరిస్థితి లేదు.. యాసంగిలో కిలో వడ్లు కూడా కొనే పరిస్థితి లేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర విధనాల నుంచి రాష్ట్ర రైతుల్ని కాపాడాలని కలెక్టర్లకు సూచించారు. క్షేత్రస్థాయికి వెళ్లి, ధాన్యం కొనబోమనే విషయంపై అవగాహన కల్పించాలన్నారు. అలాగే రాబోయే వానాకాలం పంటల సాగుపై ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ అధికారులకు చెప్పారు. ప్రధానంగా పత్తి, వరి, కంది సాగు పై దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయ లాభసాటి పంటల సాగు దిశగా రైతులను సమాయత్తం చేయాలన్నారు.

త్వరలోనే దళితబంధు.. తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేయడమే దళిత బంధు పథకం లక్ష్యమని కేసీఆర్ చెప్పారు.10 లక్షల సాయం, దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేస్తుందన్నారు. దళితబంధును ఇప్పటికే ప్రకటించిన పద్ధతిలో ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గం, ఇప్పటికే ప్రకటించిన నాలుగు మండలాల పరిధిలో దళిత బంధును అమలు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.

Also Read:

CM KCR: ఆ రూల్‌తోనే ఉద్యోగుల విభజన.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

Crime News: కూలీలపై బోల్తా పడిన టిప్పర్ లారీ.. క్వారీలో ముగ్గురు దుర్మరణం..

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!