Challan: ట్రాఫిక్‌ పోలీసుల కీలక నిర్ణయం.. ఇకపై చలాన్‌ నేరుగా..

అయితే మన వాహనానికి చలానా పడిందా.? లేదా అన్ని విషయం తెలియాలంటే వెబ్‌సైట్‌లోకి వెళ్లి వాహనం నెంబర్ ఎంటర్ చేసి వివరాలు తెలుసుకునే వాళ్లం. అయితే ఇకపై అలా కాకుండా కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు తెలంగాణ రవాణా శాఖ కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ట్రాఫిక్‌ చలాన్ పెండింగ్‌లు పెరుగుతోన్న నేపథ్యంలో ఈ నిర్ణయం...

Challan: ట్రాఫిక్‌ పోలీసుల కీలక నిర్ణయం.. ఇకపై చలాన్‌ నేరుగా..
Traffic Challan
Follow us

|

Updated on: Sep 01, 2024 | 7:02 AM

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోతే ట్రాఫిక్‌ పోలీసులు చలనా విధించడం సర్వసాధారణమైన విషయం. ఒకప్పటిలా వాహనాలను ఆపి చలానా వసూలు చేసే రోజులు పోయాయి. ఇప్పుడు అంతా హైటెక్‌. ట్రాఫిక్‌ పోలీస్ ఎక్కడో నిల్చోని.. హెల్మెట్‌ ధరించకపోయినా, రాంగ్‌ రూట్‌లో వెళ్లినా కెమెరాలో క్లిక్ మనిపించి చలాన్‌ వేస్తున్నారు.

అయితే మన వాహనానికి చలానా పడిందా.? లేదా అన్ని విషయం తెలియాలంటే వెబ్‌సైట్‌లోకి వెళ్లి వాహనం నెంబర్ ఎంటర్ చేసి వివరాలు తెలుసుకునే వాళ్లం. అయితే ఇకపై అలా కాకుండా కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు తెలంగాణ రవాణా శాఖ కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ట్రాఫిక్‌ చలాన్ పెండింగ్‌లు పెరుగుతోన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి కొత్త ప్రతిపాదనను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

వాహనదారుడు ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమిస్తే.. వేంటనే నేరుగా వాహనదారుడి మొబైల్ నెంబర్‌కు ట్రాఫిక్ చలాన్‌లు పంపించే విధానాన్ని తీసుకురానున్నారు. అంతే కాకుండా చలన్లు సులభంగా చెల్లించేందుకు వీలుగా.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్ యాప్, యూపీఐ అప్షన్స్ కల్పించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. వాహనదారుల చలానా జరిమానాలు పెద్ద ఎత్తున పెండింగ్ లో ఉండటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోందని భావించిన అధికారులు ఈ ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ విధానాన్ని త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధానాన్ని ముందుగా కొన్ని నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, తర్వాత రాష్ట్రమంతా అమలు చేయాలని ఆలోచిస్తున్నారు. వాట్సాప్‌ లేదా మెసేజ్‌ రూపంలో చలానా పంపించి, యూపీఐ విధానంలో చలాన్లు చెల్లించే విధానాన్ని తీసుకురానున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్