Today Gold Price: బంగారం కొనాలనే వారికి ఊరట.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే

బంగారం ధర కాస్త శాంతించినట్లు కనిపిస్తోంది. గత రెండు రోజులుగా బంగారం ధరలో పెద్దగా పెరుగదల కనిపించడం లేదు. తాజాగా ఆదివారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెద్దగా మార్పు లేదు. అయితే ఈ ఏడాది భారత్‌లో బంగారం వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌..

Today Gold Price: బంగారం కొనాలనే వారికి ఊరట.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే
Gold Price
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 01, 2024 | 6:37 AM

బంగారం ధర కాస్త శాంతించినట్లు కనిపిస్తోంది. గత రెండు రోజులుగా బంగారం ధరలో పెద్దగా పెరుగదల కనిపించడం లేదు. తాజాగా ఆదివారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెద్దగా మార్పు లేదు. అయితే ఈ ఏడాది భారత్‌లో బంగారం వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనా వేస్తోంది. ఈ లెక్కన బంగారం ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. కాబట్టి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

* దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగరాం ధర రూ. 67,100కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,040 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,040 గా ఉంది.

* ఇక మరో ప్రధాన నగరం చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,040 వద్ద కొనసాగుతోంది.

* కోల్‌కతా విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,040 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* హైదరాబాద్‌లో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,040 వద్ద కొనసాగుతోంది.

* ఇక విజయవాడ విషయానికొస్తే ఇక్కడ కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,950, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 73,040గా ఉంది.

* విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,950కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,040 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. శనివారం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో వెండి స్థిరంగా కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 87,000గా ఉండగా.. ముంబయిలో రూ. 87,000, బెంగళూరులో రూ. 85,000 వద్ద కొనసాగుతోంది. ఇక చెన్నై, కేరళ, హైదరాబాద్‌, విశాఖ, విజయవాడలో కిలో వెండి ధర అత్యధికంగా రూ. 92,900 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…