ముఖేష్ అంబానీ: 2024 సంవత్సరానికి గానూ భారతదేశపు అత్యంత సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ రెండవ స్థానంలో ఉన్నారు. గత ఏప్రిల్‌లో విడుదలైన ప్రపంచ సంపన్నుల జాబితాలో.. ఆసియాలోనే ప్రథమ స్థానంలో నిలిచిన అంబానీ.. తాజాగా విడుదల చేసిన హురున్ నివేదికలో మాత్రం రెండో స్థానానికి చేరారు. ఆయన ప్రస్తుత నికర విలువ రూ.10.14 లక్షల కోట్లు.